
కవేలి క్రాస్‌రోడ్డు వద్ద నిర్మించిన బస్‌షెల్టర్
కోహీర్: మండలంలోని కవేలి క్రాస్‌రోడ్డు వద్ద 65 నంబరు జాతీయ రహదారి పక్కన ఎల్ అండ్ టీ సంస్థ ప్రయాణికుల సౌకర్యార్ధం బస్‌షెల్టర్ నిర్మించారు. రోడ్డు విస్తరణలో భాగంగా 20 ఏళ్ల క్రితం నిర్మించిన బస్‌షెల్టర్‌ను కూల్చివేశారు. నష్టపరిహారం ఇంతవరకు చెల్లించలేదు. నిలువ నీడ లేక ఏడాది కాలంగా ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎల్ అండ్ టీ సంస్థ షెల్టర్‌ను నిర్మించడంతో ప్రయాణికుల ఇబ్బందులు తొలగిపోయాయి.