Concrete buildings
-
పోతపోసిన పోస్టాఫీస్...!
బెంగళూరు: 3డీ కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీతో పోతపోసిన తపాలా కార్యాలయం దేశంలో తొలిసారిగా బెంగళూరులో కొలువు తీరనుంది. దీన్ని ఎల్ అండ్ టీ సంస్థ 45 రోజుల్లో 1,000 చదరపు అడుగుల్లో నిర్మించనుంది. పూర్తిగా ఆటో మేటిక్‌గా పనిచేసే రోబోటిక్ ప్రింటర్ దీన్ని తయారు చేస్తుంది. కాంక్రీట్‌ను పొరలు పొరలుగా 3డీ మోడల్‌కు తగ్గట్లు పోస్తుంది. ఎక్కడా కాంక్రీట్ పడే వేగం తగ్గకుండా చూస్తూ వెనువెంటనే గట్టిపడేలా చేస్తుంది. పొరల మధ్య బలమైన బంధం ఉండేలా ‘గ్రీన్ కాంక్రీట్’ను నింపుతుంది. ‘‘జీ+3 నిర్మాణాలు, విల్లాలు, సైనిక బ్యారక్‌లు, ఒకే అంతస్తుండే పాఠశాలలు, పోస్టాఫీసులు, ఫ్యాక్టరీల నిర్మాణంపై దృష్టిపెట్టాం’’ అని సంస్థ పూర్తికాల డైరెక్టర్, ఎల్ అండ్ టీ కన్స్ట్రక్షన్ (బిల్డింగ్స్) సీనియర్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఎంవీ సతీశ్ ఈ సందర్భంగా మీడియాకు చెప్పారు. -
మనకోసం కాదు.. వాటి కోసం..
ఇది సీ ట్రీ డిజైన్. ఈ వినూత్న భవనాన్ని డిజైన్ చేసింది మనం ఉండటానికి కాదు.. వృక్ష, జంతు జీవజాలం ఉండటానికి! నగరాల్లోని పచ్చదనాన్ని కాంక్రీటు భవనాలు మింగేస్తున్న నేపథ్యంలో నీటిపై తేలియాడే ఈ సీ ట్రీ వంటివి వాటిని హరితమయం చేస్తాయని దీన్ని డిజైన్ చేసిన వాటర్ స్టూడియో సంస్థ(నెదర్లాండ్) చెబుతోంది. ఈ హరిత భవనం అరలు అరలుగా ఉంటుంది. ఇందులో రకరకాల చెట్లు, మొక్కలతోపాటు పక్షులు, గబ్బిలాలు, తుమ్మెదలు, తేనెటీగలు ఇంకా ఇతర చిన్న జంతువులు ఉండొచ్చట. ఇక నీటి కింది భాగంలో ఉండే అరలు అక్కడి జీవజాలానికి ఆవాసంగా ఉంటాయి. ఈ సీ ట్రీలను సముద్రాలు, నదులు, సరస్సులు దేనిపైనైనా నిర్మించొచ్చు. నీటి అడుగున ఉండే కేబుల్ వ్యవస్థ ఆధారంగా ఇది అటూ ఇటూ కదలకుండా ఒకే చోట ఉండేలా చేస్తారు. సీ ట్రీ ప్రకృతి పరిరక్షణకు తోడ్పడుతుందని.. కాలుష్యాన్ని తగ్గిస్తుందని చెబుతున్నారు. ఒక్కో సీ ట్రీ నిర్మాణానికి రూ.7.8 కోట్లు ఖర్చవుతుంది. వీటి నిర్మాణానికి అవసరమయ్యే నిధులను పెద్ద పెద్ద చమురు కంపెనీల నుంచి సేకరించవచ్చని వాటర్ స్టూడియో అంచనా వేస్తోంది. ఇంకో విషయం.. ఇందులో మనుషులకు ప్రవేశం నిషిద్ధం. అక్కడుండే జంతు జీవజాలాన్ని మనం డిస్టర్బ్ చేయకూడదన్నమాట.