'రాధకృష్ణ'గా వెంకీ | victory venkatesh next film titled radha krishna | Sakshi
Sakshi News home page

'రాధకృష్ణ'గా వెంకీ

Published Sat, Nov 14 2015 9:38 AM | Last Updated on Sun, Sep 3 2017 12:29 PM

'రాధకృష్ణ'గా వెంకీ

'రాధకృష్ణ'గా వెంకీ

'గోపాల గోపాల' సినిమా తరువాత తన తదుపరి ప్రాజెక్టును ఫైనల్ చేయటానికి చాలా టైం తీసుకున్నాడు విక్టరీ వెంకటేష్. సీనియర్ డైరెక్టర్ల నుంచి కొత్త దర్శకుల వరకు చాలామంది కథలు విన్న విక్టరీ హీరో ఫైనల్ గా ఓ యంగ్ డైరెక్టర్‌కు ఓకే చెప్పాడు. ఇటీవల 'భలే భలే మగాడివోయ్' లాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించిన మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు.

గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో 'రాధ' అనే సినిమా ఎనౌన్స్ అయి ఆగిపోయింది. ఆ తరువాత మరోసారి వెంకీని తన కథతో మెప్పించిన మారుతి డిసెంబర్ చివరివారంలో కొత్త సినిమా షూటింగ్ మొదలు పెట్టడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో వెంకీ జోడిగా నయనతార నటించనుందన్న టాక్ వినిపిస్తోంది. కొద్ది రోజులుగా మళయాల సినిమా 'భాస్కర్ ది రాస్కెల్' రీమేక్‌లో నటిస్తాడంటూ వార్తలు వినిపించటంతో మారుతి దర్శకత్వంలో తెరకెక్కనుంది, స్ట్రయిట్ సినిమానా లేక రీమేక్ అన్న విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.

లాంగ్ గ్యాప్ తరువాత వెంకీ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను  సితార క్రియేషన్స్ బ్యానర్ నిర్మించనుంది. అన్ని రకాల వినోదాంశాలతో పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా  ఈసినిమాను తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement