
జూన్ 1న 'బాబు బంగారం'
'గోపాల గోపాల' సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న విక్టరీ వెంకటేష్, ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో 'బాబు బంగారం' సినిమాలో నటిస్తున్నాడు. చాలా రోజుల తరువాత ఫుల్లెంగ్త్ కామెడీ రోల్లో నటిస్తున్న వెంకటేష్, ఈ సినిమా సక్సెస్ మీద చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. డైరెక్టర్ మారుతి మంచి ఫాంలో ఉండటం కూడా సినిమాకు బాగా కలిసొచ్చే అంశంగా కనిపిస్తోంది.
'భలే భలే మొగాడివోయ్' సినిమాతో సూపర్ హిట్ కొట్టిన మారుతి, వెంకటేష్తో మరోసారి అదే మ్యాజిక్ను రిపీట్ చేయాలని భావిస్తున్నాడు. అందుకు తగ్గట్టుగానే అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్తో బాబు బంగారం సినిమాను పక్కాగా రెడీ చేస్తున్నాడు. మేకింగ్తో పాటు రిలీజ్ విషయంలో కూడా ఇప్పటినుంచే జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఎలాంటి పోటీ లేకుండా జూన్ 1న సోలోగా సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు.
వెంకటేష్ సరసన హిట్ పెయిర్గా గుర్తింపు తెచ్చుకున్న నయనతార నటిస్తున్న ఈ సినిమాకు సూర్యదేవర నాగవంశీ నిర్మాత. మారుతి దర్శకత్వం వహిస్తుండగా, జిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో వెంకీ కామెడీ పోలీస్గా నటించనున్నాడన్న టాక్ వినిపిస్తోంది.