ఎన్టీఆర్తో త్రివిక్రమ్.. కన్ఫామ్ | Ntr Next Movie With Trivikram Srinivas after Bobby Film | Sakshi
Sakshi News home page

ఎన్టీఆర్తో త్రివిక్రమ్.. కన్ఫామ్

Published Sat, Dec 31 2016 1:10 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

ఎన్టీఆర్తో త్రివిక్రమ్.. కన్ఫామ్ - Sakshi

ఎన్టీఆర్తో త్రివిక్రమ్.. కన్ఫామ్

టాలీవుడ్లో చాలా కాలంగా త్రివిక్రమ్, ఎన్టీఆర్ల కాంబినేషన్లో తెరకెక్కబోయే సినిమా విషయంలో చర్చ జరగుతోంది. గతంలో ఒకటి రెండు సార్లు ఈ ప్రాజెక్ట్ విషయంలో ప్రయత్నాలు జరిగిన వర్క్ అవుట్ కాలేదు. ముఖ్యంగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ రాసే డైలాగ్స్ను మాస్ ఇమేజ్ ఉన్న ఎన్టీఆర్ లాంటి హీరో చెప్తే ఎలా ఉంటుందో చూడాలని అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలు కూడా ఎదురుచూస్తున్నారు.

ఫైనల్గా ఈ క్రేజీ కాంబినేషన్ కు ముహుర్తం సెట్ అయ్యింది. ఎన్టీఆర్, త్రివిక్రమ్ ల కాంబినేషన్లో ఓ సినిమా చేస్తున్నట్టుగా ప్రకటించారు హారికా అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మాత రాధకృష్ణ. తమ బ్యానర్లో తెరకెక్కనున్న ఐదో సినిమా త్రివిక్రమ్ శ్రీనివాస్, ఎన్టీఆర్ల కాంబినేషన్లో తెరకెక్కుతుందని తెలిపారు. ప్రస్తుతం ఎన్టీఆర్ బాబీ సినిమాతో బిజీగా ఉండగా త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్తో తెరకెక్కించే సినిమా ప్రీ  ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తయిన తరువాత 2017 సెప్టెంబర్లో త్రివిక్రమ్ ఎన్టీఆర్ల సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement