ఆంధ్రజ్యోతి ఎండీని అరెస్టు చేయాలి | ABN MD Radha Krishna should arrest demands veena vaani parents | Sakshi
Sakshi News home page

ఆంధ్రజ్యోతి ఎండీని అరెస్టు చేయాలి

Published Mon, Nov 2 2015 8:43 PM | Last Updated on Fri, Aug 10 2018 5:09 PM

ABN MD Radha Krishna should arrest demands veena vaani parents

వరంగల్: ఏబీఎన్, ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని వీణావాణీల తల్లిదండ్రులు మారగాని మురళి, నాగలక్ష్మి సోమవారం డిమాండ్ చేశారు. తమ పిల్లల పేరుతో డబ్బులు వసూలు చేసి సొంత ఖాతాలో వేసుకున్నారని ఆరోపించారు.

వసూలు చేసిన డబ్బులు తమకు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్న రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వరంగల్ జిల్లా నర్సింహులపేట మండలం బీరిశెట్టిగూడెంలో ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. వీరికి గ్రామస్తులు మద్దతు తెలిపారు. అనంతరం వారు రహదారిపై రాధాకృష్ణ దిష్టిబొమ్మను దహనం చేశారు. పోలీసులు వచ్చి బాధితులతో మాట్లాడి ఆందోళనను విరమింపజేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement