Veena Vani
-
వీణావాణీలకు శుభాకాంక్షలు
హైదరాబాద్: అవిభక్త కవలలైన వీణావాణీ సోమవారం 20వ జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. వెంగళరావునగర్ డివిజన్ పరిధిలోని మధురానగర్‌కాలనీలోని మహిళా శిశుసంక్షేమ శాఖ బాలసదన్‌లో వీరు ఆశ్రమం పొందుతున్నారు. మురళీ–నాగలక్ష్మి దంపతులకు జని్మంచిన ఈ కవలల తలలు అతుక్కుని జని్మంచిన వీరిని ఎన్ని ఆసుపత్రులకు చూపించినా వారిని విడదీయడం సాధ్యం కాలేదు. దాంతో వారిని చిన్నతనం నుంచే తల్లిదండ్రులు స్టేట్‌హోంలోని శిశువిహార్‌లో ఉంచారు. నాటి నుంచి నేటి వరకు కూడా వారు అక్కడే ఆశ్రయం పొందుతూ విద్యనభ్యసిస్తున్నారు. పది, ఇంటర్‌లోనూ ఇరువురు మంచి మార్కులు సాధించారు. భవిష్యత్‌లో సీఏ కావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామన్నారు. ప్రస్తుతం ఆంధ్రా మహిళా సభ కళాశాలలో బీ.కాం ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. సోమవారం వీరి జన్మదిన వేడుకలు బాలసదన్‌లో తల్లిదండ్రులు, అధికారుల సమక్షంలో నిర్వహించారు. -
ఆపరేషన్ చేస్తే వీణా-వాణీలకు ముప్పు.. హైకోర్టుకు నివేదించిన రాష్ట్ర ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: అవిభక్త కవలలు వీణా– వాణీలకు శస్త్ర చికిత్స చేసి విడదీసేందుకు విదేశాల నుంచి వైద్యులను పిలిపించి పరీక్షలు చేయించామని.. శస్త్రచికిత్స చేస్తే వారి ప్రాణా లకు ప్రమాదం ఏర్పడవచ్చని వైద్యులు స్పష్టం చేశారని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. దీంతో వీణా–వాణీల తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు శస్త్రచికిత్స చేయించాలన్న ప్రయత్నాన్ని విరమించుకున్నామని తెలిపింది. వీణా–వాణీలకు శస్త్రచికిత్స చేయాలని, వారికి హైదరాబాద్ లేదా వరంగల్‌లో నివాసం మంజూరు చేసేలా ఆదేశించాలంటూ హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ 2016లో దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ అభినంద్ కుమార్ షావలిల ధర్మాసనం శుక్ర వారం మరోసారి విచారించింది.భవిష్యత్తులో వారి వైద్య చికిత్సలకయ్యే ఖర్చును ప్రభుత్వం భరించేందుకు సిద్ధంగా ఉందని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది వివరించారు. 9 ఏళ్లుగా వారు ఆసుపత్రిలోనే ఉన్నారని, వారి యోగ క్షేమాలన్నీ ప్రభుత్వమే చూసిందని తెలిపారు. ఇద్దరూ ఇంటర్ చదువుతున్నారని వివరించారు. వీణా–వాణీల ఉన్నత చదువు, ఇతర ఖర్చులకు హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ నెలకు రూ.15 వేలు సాయం అందించేందుకు సిద్ధంగా ఉందని ఫౌండేషన్ తరపు న్యాయవాది నివేదించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్‌ను ధర్మాసనం అభినందించింది. -
మాకింత విషమిచ్చి చంపేయండి
ఆ తర్వాతే మా పిల్లలను అనాధలుగా భావించండి కనీసం మాకు ఓ మాటా కూడా చెప్పకుండా తరలిస్తారా? మేము బతికుండగానే తమ పిల్లలను అనాధలను చేశారు దేవుడిపై భారమేసి..ఆపరేషన్ చేయండిః అవిభక్త కవలలు వీణావాణి తండ్రి ఆవేదన సాక్షి, సిటీబ్యూరో: ‘మాకు ఇంత విషమిచ్చి చంపేయండి. ఆ తర్వాతే వీణవాణిలను అనాధలుగా భావించండి. కనీసం మాకు ఓ మాట కూడా చెప్పకుండా అనాధాశ్రమానికి తరలిస్తారా? మా పిల్లలను మేం చూసుకోవడానికి ఇతరుల అనుమతి తీసుకోవాలా?’ అని అవిభక్త కవలలు వీణావాణి తల్లిదండ్రులు మురళి, నాగలక్ష్మిలు ఆవేదన వ్యక్తం చేశారు. అవిభక్తకవలలు వీణావాణిలను నిలోఫర్ ఆస్పత్రి నుంచి స్టేట్‌హోం తరలించిన విషయాన్ని తెలుసుకున్న తల్లిదండ్రులు సోమవారం వారి వద్దకు వచ్చారు. పిల్లలను చూసేందుకు అనుమతించాల్సిందిగా పీడీని కోరగా నిమిషం వ్యవధి మాత్రమే ఇచ్చారన్నారు. తమ పిల్లలను చూసుకోవడానికి తాము అనుమతి తీసుకోవాలా? అని ప్రశ్నించారు. కనీసం తెలంగాణ రాష్ట్రంలోనైనా తమ పిల్లలకు న్యాయం జరుగుతుందని భావించాం. స్వరాష్ట్రంలో కూడా తమకు తీరని మనోవేదనే మిగిలిందని ఆరోపించారు. వారికి చికిత్స చేసి వేరు చేయాల్సిందిగా ఇప్పటికే పలు మార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశానని చెప్పారు. తమకు తగిన జీవనభృతిని కల్పిస్తే తమ పిల్లల బాగోగులు చూసుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. దేవుడిపై భారం వేసి పిల్లలకు చికిత్స చేయాల్సిందిగా కోరారు. (గుట్టుచప్పుడు కాకుండా వీణావాణీ తరలింపు) వీణా వాణీలకు సకల సౌకర్యాలు వెంగళరావునగర్ : వీణావాణీలకు సకల సౌకర్యాలను కల్పించడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపీనథ్ చెప్పారు. సోమవారం స్టేట్‌హోం కార్యాలయంలో వీణావాణీలను ఎమ్మెల్యే మాగంటి కలిసి దాదాపు గంటసేపు వారితో ముచ్చటించారు. అక్కడున్న చిన్నారులకు బిస్కెట్లు, చాక్లెట్లు, సిబ్బందికి బహుమతులు పంపిణీ చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మట్లాడుతూ..ముఖ్యమంత్రి కేసీఆర్ వీణవాణిల చికిత్సపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారన్నారు. ప్రపంచస్థాయి వైద్యులకు చూపించి వారి సలహా మేరకు వారి పోషణను, సంరక్షించే బాధ్యతను మహిళా శిశుసంక్షేమశాఖకు అప్పగించారని అన్నారు. -
పేరు.. వీణావాణీ.. అడ్రస్.. స్టేట్‌హోం
నిలోఫర్‌తో వీడిన పదేళ్ల అనుబంధం - స్టేట్‌హోంకు తరలింపు..ముగ్గురు ఆయాలు, టీచర్ కూడా సాక్షి, హైదరాబాద్: అవిభక్త కవలలు వీణావాణీలను హైదరాబాద్‌లోని నిలోఫర్ ఆస్పత్రి నుంచి అమీర్‌పేట్ స్టేట్‌హోంకు రాష్ట్ర ప్రభుత్వం తరలించింది. ఆదివారం ఉదయం ప్రత్యేక అంబులెన్స్‌లో వారితోపాటు ముగ్గురు ఆయాలు, టీచర్‌ను కూడా పంపింది. స్టేట్‌హోంలోని వాతావరణానికి అలవాటు పడే వరకు(ఆరు మాసాలు) వారి బాగోగులు వీరే చూసుకోనున్నారు. అనివార్యమని భావిస్తే నిలోఫర్ ఆస్పత్రి వైద్యులే స్టేట్‌హోంకు వెళ్లి వైద్య సేవలు అందించనున్నారు. సుమారు పదేళ్ల పాటు నిలోఫర్ ఆస్పత్రి వైద్యులు, ఆయాలే వీరి బాగోగులను చూసుకున్నారు. వీణావాణీల కోసం ఓ గదితోపాటు ముగ్గురు ఆయాలు, చదువు చెప్పేందుకు ఒక టీచర్‌ను ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం వీణావాణీలు ఆరో తరగతి చదువుతున్నారు. ఆస్పత్రిని వీడి వెళ్లేందుకు చిన్నారులు తొలుత నిరాకరించారు. వైద్యులు వారికి నచ్చజెప్పడంతో అయిష్టంగానే వెళ్లేందుకు అంగీకరించారు. పిల్లలిద్దరిలో వాణి హైపర్‌టెన్షన్‌తో బాధపడుతోంది. మాకు సమాచారం లేదు.. దంతాలపల్లి: అవిభక్త కవలలైన వీణావాణీలను నిలోఫర్ ఆస్పత్రి నుంచి ప్రభుత్వం స్టేట్‌హోంకు తరలించిన విషయంలో తమకు ఎలాంటి సమాచారం లేదని వారి తల్లిదండ్రులు మురళి, నాగలక్ష్మిలు పేర్కొన్నారు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం బీరిశెట్టిగూడెంలో వారు విలేకరులతో మాట్లాడారు. ఉదయం టీవీలో చూసి విషయం తెలుసుకున్న తాము ఆస్పత్రికి ఫోన్ చేస్తే ‘స్విచాఫ్’అని వచ్చిందని వీణావాణీల తండ్రి మురళి పేర్కొన్నారు. పిల్లలను ఆస్పత్రిలోనే ఉంచి శస్త్రచికిత్స చేయాలని తాము లేఖ ఇచ్చినా ఎలాంటి సమాచారం లేకుండా స్టేట్ హోంకు తరలించడమేమిటని వారు ప్రశ్నించారు. ఇది వీణావాణి.. జీవితంలో ఎదురయ్యే కష్టాలను ధైర్యంగా ఎదుర్కోవాలని చెబుతూ.. తమ చిత్రాన్ని తామే గీసుకున్న వీణావాణీ.. -
వీణావాణీల సంరక్షణకు కట్టుబడి ఉన్నాం
హైకోర్టుకు నివేదించిన సర్కార్ సాక్షి, హైదరాబాద్: అవిభక్త కవలలు వీణా-వాణీల సంరక్షణకు తాము కట్టుబడి ఉన్నామని రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం హైకోర్టుకు నివేదించింది. వీణా-వాణీల ప్రాణాలకు ముప్పుకలగని రీతిలో శస్త్రచికిత్స చేసేందుకు ఎవరైనా డాక్టర్‌ను పిటిషనర్ తీసుకొస్తే తమకు ఎటువంటి అభ్యంతరం లేదంది. వీణా-వాణీలను వేరుచేయడంలో జరుగుతోన్న జాప్యంపై జోక్యం చేసుకోవాలంటూ స్వచ్ఛంద సంస్థ హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్)ను మంగళవారం ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎస్.శరత్‌కుమార్ స్పందిస్తూ, వీణా-వాణీలు ప్రస్తుతం నిలోఫర్ ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని, వారికి ప్రభుత్వం అక్కడ అన్ని సదుపాయాలు కల్పిస్తోందని వివరించారు. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ అంబటి శంకర నారాయణలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. -
హైకోర్టులో వీణవాణీల కేసు విచారణ
-
కౌంటర్ దాఖలు చేయండి
వీణావాణి వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: అవిభక్త కవలలు వీణావాణిలను వేరు చేసే విషయంలో జరుగుతున్న అసాధారణ జాప్యంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 7కు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావులతో కూడిన ధర్మాసనం రెండు రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. వీణావాణిలను వేరు చేసే విషయంలో ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోకుండా తాత్సారం చేస్తోందని, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ హైదరాబాద్‌కు చెందిన స్వచ్ఛంద సంస్థ హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ హైకోర్టులో ఇటీవల పిల్ దాఖలు చేసింది. దీనిని ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం రెండు రోజుల క్రితం విచారించింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. వీణావాణిలు ప్రస్తుతం నిలోఫర్ ఆసుపత్రిలో ఉన్నారని, వారిని అక్కడి నుంచి హైదరాబాద్‌లోని మరోచోట లేదా వారి సొంతూరు వరంగల్‌లో అనువైన చోట ఉంచి అన్ని సౌకర్యాలు కల్పించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. అంతేకాక వారి పోషణ నిమిత్తం నెలకు రూ.15 వేలు చెల్లించేలా కూడా ఆదేశాలు ఇవ్వాలన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. పిటిషనర్ సంస్థతో ప్రత్యేకంగా సమావేశమై ఓ నిర్ణ యం తీసుకోవాలని ప్రభుత్వానికి సూచిం చింది. ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. -
ఇక జీవితాంతం స్టేట్‌హోమ్‌లోనే..
వీణావాణీల భవిష్యత్తుపై సర్కార్ నిర్ణయం స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అనుమతికి వైద్య ఆరోగ్యశాఖ ప్రతిపాదన వారి చదువు, భద్రత, వైద్యం, ఇతరత్రా బాధ్యత ప్రభుత్వానిదే హైదరాబాద్: అవిభక్త కవలలు వీణావాణీలను జీవితాంతం స్టేట్‌హోమ్‌లో ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో ఉంచేందుకు అనుమతి కోరుతూ స్త్రీ, శిశు సంక్షేమశాఖకు.. వైద్య ఆరోగ్యశాఖ ప్రతిపాదన పంపాలని నిర్ణయించింది. వారు టీనేజీలోకి అడుగుపెట్టినందున భద్రత, చదువు, వైద్య వసతి, ఇతరత్రా అన్ని సదుపాయాలు ఉండేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. అందువల్ల స్త్రీ, శిశు సంక్షేమ శాఖకు సమగ్రమైన ప్రతిపాదనలతో నివేదిక తయారుచేసి అనుమతి తీసుకోనున్నారు. అక్కడి నుంచి అంగీకారం రాగానే వారిని స్టేట్‌హోమ్‌కు తరలిస్తారు. పేదరికం కారణంగా వీణావాణీలను తీసుకెళ్లేందుకు తల్లిదండ్రులు నిరాసక్తత కనబరిచిన విషయం తెలిసిందే. ప్రపంచంలోనే అవిభక్త కవలలుగా ఉన్న వారికి సంబంధించిన అంశాన్ని ప్రత్యేక అంశంగా పరిగణించి చివరకు స్టేట్‌హోమ్‌కి తరలిస్తేనే మంచిదని సర్కారు భావించింది. శస్త్రచికిత్సపై ఆశ ల్లేవ్.. అవిభక్త కవలలైన వీరిని విడదీసి విముక్తి కల్పించాలని ప్రభుత్వం భావించినా అది నెరవేరే పరిస్థితి కనిపించడంలేదు. లండన్ డాక్టర్లు పరిశీలించి వెళ్లారు. వారు సరేనన్నా.. రిస్క్ ఉంటుందన్నారు. ఈ విషయంపై ఎయిమ్స్ వైద్యులు కూడా రిస్క్ తప్పదని స్పష్టంచేశారు. ఆ తర్వాత ఆస్ట్రేలియా డాక్టర్లు కూడా ముందుకు వచ్చారు. కానీ రిస్క్ ఉంటుందన్న వైద్య నిపుణుల అభిప్రాయం వ్యక్తం కావడంతో శస్త్రచికిత్సకు వెళ్లడానికి సర్కారు ఏమాత్రం సుముఖంగా లేదు. శస్త్రచికిత్స చేస్తే అవిభక్త కవలల్లో ఎవరికి ప్రాణాపాయం ఉన్నా అది ఆమోదయోగ్యం కాదని... అలాంటి రిస్క్ భరించడానికి ప్రభుత్వ వర్గాలు, తల్లిదండ్రులు సిద్ధంగా లేరని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు స్పష్టంచేస్తున్నారు. ఎన్ని కోట్లైనా సర్కారు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉందని... కానీ రిస్క్ ఉంటే మాత్రం ముందుకు వెళ్లబోమని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వారికి జీవితాంతం ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామంటున్నారు. స్టేట్‌హోమ్‌కు తరలిస్తే ఎటువంటి చర్యలు తీసుకోవాలో ప్రత్యేకంగా మార్గదర్శకాలు ఖరారు చేస్తామని... ఆ ప్రకారం వారు నడుచుకోవాల్సి ఉంటుందంటున్నారు. -
విధిపోవాలి
అవును. విడిపోవాలి. విధి బంధించిన ఈ రెండు మనసులు విడిపోవాలి. అవును. విడిపోవాలి. ఈ రెండు ఆకాంక్షల గూళ్లు విడిపోవాలి. స్వేచ్ఛతో పక్షుల్లా ఎగరాలి. ‘తల’పుల తలుపులు తెరుచుకోవాలి. వీణావాణీలు రెండు బాటలలో రెండు గమ్యాలు చేరగలగాలి. అవును. కబంధవిధి ఓడిపోవాలి. ఇలాంటి విధి.. పోవాలి. విధిపోవాలి. ‘‘ఫిబ్రవరి 12 న నా బార్బీ తల ఎక్కడో పోయింది. తెచ్చిస్తారా?’’ వాణి వేసిన ప్రశ్నకి గుండె కలుక్కుమంది. తమాయించుకొని మీ ఇద్దరికీ బార్బీ అంటే అంతిష్టమా? అని అడిగితే.. అతి కష్టంగా తల ఔనన్నట్లుగా. కాదన్నట్లుగా ఊగింది. నిజానికి ఊగాల్సింది వాణి ఒక్క తలే. కానీ రెండు తలలూ ఊపక తప్పలేదు వీణా వాణీలకు. ఎందుకంటే - సమాధానం నోటితో అయితే ఔననో కాదనో చెప్పే వీలుంది. కానీ ఒకే తలతో రెండు భావాలను ప్రకటించడం వారికి అసాధ్యం. ‘‘‘నాకైతే డోరెమాన్ అంటే ఇష్టం అని చెప్పాలనుకుంది వీణ. కానీ వాణి తలతో ముడిపడి వున్న తన తల ఆ పనిచేయలేకపోయింది. వాణి కి బార్బీ అంటే పంచప్రాణాలు. తన కి ఎవరో బహుమతిగా యిచ్చిన బార్బీ పాతదైపోయి దాని తల ఎక్కడో ఊడిపోయింది. దాన్నెవరో ఆ గదినుంచి, ఆసుపత్రి ప్రాంగణం నుంచి ఊడ్చి ఎత్తిపారబోసారు. కానీ వాణి గుండెల్లోనుంచి ఆ బార్బీ బొమ్మమాత్రం చెరిగిపోలేదు. తలలేని ఆ బార్బీని తనదగ్గరే దాచుకుంది అపురూపంగా. ఎంత అపురూపం అంటే.. బార్బీ తలను పోగొట్టుకున్న రోజును కూడా గుర్తుపెట్టుకుంది. తలలు ఒక్కటే.. తలపులు వేరు వీణకి బార్బీ అంటే అంతిష్టమేం లేదు. అదొక్కటే కాదు. వీణకి సిరిమల్లెపువ్వా పాటంటే ప్రాణం, కానీ వాణికి చిరుగాలిలా... నలువైపులా... నీవెంటే ఉంటానులే... ఇష్టం. వీణకి వెనీలా ఐస్‌క్రీం యిష్టం, వాణికి స్ట్రాబెర్రీ యిష్టం. వీణకి బ్లూస్కర్ట్, టాప్ అంటే యిష్టం, వాణికి లాంగ్‌ఫ్రాక్ ఇష్టం. వీణ సైంటిస్ట్ కావాలనుకుంటోంది. వాణి గొప్ప ఇంజనీర్‌గా ఎదిగి వాళ్లిద్దరికీ మధ్య ఉన్న గోడను తొలగించుకుని, తనకిష్టమైన రంగంలో పై చదువులు చదవాలనుకుంటోంది. ఇవే కాదు, ఇంకా ఎన్నో ఇష్టాలు, ఎన్నో భావాలు. ఎన్నెన్నో అభిరుచులు.. ఎన్నెన్నో కథలు, కవితలు, పాటలు, కలలు. అన్నీ విభిన్నమైనవే కానీ తలొక్కటే అవిభక్తం. ఆసుపత్రితో అటాచ్మెంట్ వైద్య శాస్త్ర పరిజ్ఞానానికే సవాల్‌గా మారిన అవిభక్త కవలలు హైదరాబాద్‌లోని నీలోఫర్‌కి వచ్చి అప్పుడే పదేళన్లు గడిచిపోయాయి. తలలు మాత్రమే కలిసి ఉండి, మిగతా శరీర భాగమంతా విడివడి ఉన్న వీరి పోషణ బాధ్యత ప్రభుత్వానిదేనని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రకటించారు. వారి బాధ్యతను నీలోఫర్ ఆసుపత్రికి అప్పగించారు. నాటి నుంచి నేటి వరకు వారి ఆలనా పాలనా చూస్తున్నది నీలోఫర్ వైద్యులు, ఆ ఆసుపత్రి సిబ్బందే. దాంతో వీణ, వాణిలకు ఆసుపత్రే సర్వస్వం అయింది. దానిచుట్టూనే వారి ప్రపంచం. కథలైనా, బొమ్మలైనా, మాటైలనా, పాటలైనా అన్నీ ఆసుపత్రే. ఒకరికి అనువుగా ఇంకొకరు ఇంటర్వ్యూ మధ్యలో వాణి టాయ్‌లెట్‌కి వెళ్లాల్సి వచ్చింది. వీణ భుజంపై తట్టడంతో తను అద్దం చేతిలోకి తీసుకుని మెల్లిగా వాణిని అనుసరించింది. అద్దం ఎందుకు? వాణి కాలకృత్యం పూర్తయ్యిందన్న విషయం వీణకు తెలియాలిగా. ఆ అద్దంలో చూస్తూ వాణికి అనుకూలంగా వీణ తనని తాను సర్దుబాటు చేసుకుంటూ తన శరీరం బరువునంతా పక్కకు ఒంచి అలాగే నిలబడుతుంది. అంటే ఒకరు టాయ్‌లెట్ బేసిన్‌పై ఉన్నప్పుడు మరొకరు ఓ పక్కకు ఒరిగి నించొని ఉండాలి. అది ఎంతసేపైనా. దేవుడా! ఎంత నరకం! తలలు రెండూ రెండు భిన్నమైన దిక్కుల్లో ఉంటే ఒకరేం చేస్తున్నారో రెండోవారికి అర్థం కాదు కనుక వీణావాణి శరీరంలో అద్దం కూడా ఒక భాగమయ్యిందిప్పుడు. జీవితంలోని కీలక దశ మొదలైంది! ఇప్పుడు వీణావాణిలకు 12 ఏళ్లు నిండాయి. వారిలో ప్రకృతి సహజంగా వచ్చే మార్పులను ఎదుర్కోవడం మరో సవాల్‌గా మారింది. యుక్త వయస్సు ఆడపిల్లలకు ప్రారంభం అయ్యే రుతుక్రమం సహజంగా ఇదే వయస్సులో మొదలవుతుంది. ప్రతి స్త్రీ జీవితంలోనూ ప్రకృతి సహజమైన, అనివార్యమైన సమస్య ఇది. ఆ ఐదురోజులూ స్త్రీలు అనుభవించే కష్టాలు కొన్ని సామాజికమైనవైతే, మరికొన్ని వ్యక్తిగతమైనవి, ఆరోగ్యపరమైనవి. ఇకపై వీణావాణిల ఇద్దరి శరీరాలు ఆ రెండింటినీ ఎదుర్కోవడానికి సంసిద్ధం కావాలి. ఒకరికి ఇష్టం ఉన్నా లేకున్నా తరచూ బాత్రూంకి వెళ్తుండాలి. రెండో వారికి అనుకూలంగా మెలగాలి. అంతేకాదు. ఇప్పటివరకు వీణవాణిల పోషణ, విద్యాబుద్ధులు మాత్రమే ఆసుపత్రి బాధ్యత. ఇక యిప్పుడు వారి బాధ్యతకు తోడు భద్రత ప్రధాన సమస్యగా మారనుంది. ఈ పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సి వస్తుంది. విడదీయడానికి 10 కోట్లు! వీణావాణిలను ఆపరేషన్ చేసి విడదీయడం కష్టసాధ్యం అని తేల్చేసారు యు.కె వైద్యులు. ఆపరేషన్‌కి పదికోట్లు దాకా ఖర్చవుతుందని కూడా యు.కె. వైద్య బృందం అంచనా వేసింది. ఇంతా చేస్తే ఆపరేషన్ సక్సెస్ అవుతుందన్న నమ్మకం లేదు. పాక్షికంగా కానీ, శాశ్వతంగాకానీ వారు కోమాలోనే ఉండే ప్రమాదం కూడా లేకపోలేదంటున్నారు వైద్యులు. వీణావాణిల డైరీలు ఒక్కసారి తిరగేస్తే వారి మనోగతం మనకు కన్నీళ్లు తెప్పిస్తుంది. ఆసుపత్రిని వీడి వెళ్లడం వారికేమాత్రం ఇష్టం లేదు. తమని ఇక్కడినుంచి పంపించేయొద్దని వేడుకుంటూ సూపరింటెండెంట్‌కి లేఖ కూడా రాసుకున్నారు. ఆ గదిలో ఏ కాగితం ముక్క చూసినా అన్నింట్లోనూ ఆసుపత్రి చుట్టూ అల్లుకున్న వారి అనుబంధాలే. ఆ గోడలన్నింటా వారి స్వప్నలోకాలే. నిజానికి కుటుంబం, ప్రభుత్వం, వైద్యులు ఈ ముగ్గురి పర్యవేక్షణలో ఈ పిల్లలుండాలి. ఈ ముగ్గురిలో ఏ ఒక్కరు తమ బాధ్యత నుంచి తప్పుకున్నా వారి జీవితాలు గాలిలో దీపంగా మారే ప్రమాదం వుంది. - అత్తలూరి అరుణ, ప్రిన్సిపల్ కరస్పాండెంట్ ఎక్కువ కాలం ఇక్కడ ఉంచలేం వీణావాణీల్లా ఇరాన్లో 34 ఏళ్ల తరువాత అవిభక్త కవలల కోరిక మేరకు వారిని విడదీయడంతో వారు చనిపోయిన అనుభవం వైద్యశాస్త్రం ముందుంది. అలాగే బీహార్‌లో కూడా ఇటువంటిదే మరో కేసు వుంది. ఆపరేషన్ రిస్క్‌తో కూడుకున్నది. ఈ పిల్లల్ని మా దగ్గర మరెంతో కాలం కొన సాగించే అవకాశం లేదు. తల్లి దండ్రులు తీసుకెళ్లేందుకు వస్తామన్నారు. తండ్రి ఒక్కరే వారిని చూసుకుంటామన్న అంగీకార పత్రంపై సంతకం చేసి తీసుకొచ్చారు. తల్లి సంతకం కూడా కావాలని అడిగాం. ఎప్పుడో వస్తామన్న వాళ్లు ఇంతకీ రాలేదు. ఏం చేయాలన్న సందిగ్దంలో ఇప్పుడు ఉన్నాం. - సి.సరేష్ కుమార్, నీలోఫర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ బాధ్యత ప్రభుత్వానిదే ఈ పిల్లల్ని స్పెషల్ కేసుగా గుర్తించి బాధ్యతని ఉమన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తీసుకోవాలి. వీరిది ప్రత్యేకమైన కేసుగా చూడాలి. జనరల్ రూల్స్ దీనికి వర్తించవు. ఇటువంటి పిల్లల కోసం స్పెషల్ రూల్స్ పొందుపరచాలి. పిల్లల హక్కులకు భంగం కలగకుండా, వారికి కావాల్సిన అన్ని సదుపాయాలను ప్రభుత్వమే కల్పించాల్సి ఉంటుంది. - శాంతా సిన్హా. జాతీయ బాలల హక్కుల కమిషన్ సభ్యురాలు వీళ్లిక పిల్లలు కాదు మాది పిల్లల ఆసుపత్రి. పన్నెండేళ్ళు దాటిన ఈ చిన్నారులకు కావాల్సింది పీడియాట్రిషన్ కాదు, ఫిజీషియన్, గైనికాలజిస్ట్, న్యూరాలజిస్ట్, కార్డియాలజిస్ట్. వారికి సర్వస్వం మేమే అయి ఇంతకాలం చూసుకున్నాం, కానీ ఇకపై వీరిని ప్రభుత్వం నిర్వహించే చిల్డ్రన్ హోంలో చేర్పించడం మంచిది. కేవలం నాలుగ్గోడల మధ్యే కాకుండా బాహ్య ప్రపంచాన్ని కూడా వీళ్లు చూడగలుగుతారు.- డాక్టర్ లాలూ ప్రసాద్ రాథోడ్, నీలోఫర్ ఆసుపత్రి -
వీణావాణీలు ఇంటికే!
- శస్త్రచికిత్స చేయించలేమని చేతులెత్తేసిన సర్కారు - ఆర్థికసాయం, పెన్షన్ సౌకర్యం కల్పిస్తామని వెల్లడి సాక్షి, హైదరాబాద్: అవిభక్త కవలలు వీణావాణీలకు శస్త్రచికిత్స చేయించలేమని సర్కారు చేతులెత్తేసింది. శస్త్రచికిత్స చేయించడం వల్ల వారి ప్రాణాలకు ప్రమాదం ఉందని, అందువల్ల వారిని ఇంటికే పంపిస్తామని ప్రకటించింది. వీణావాణీలను వేరు చేస్తామని లండన్ వైద్యులు చెప్పినా.. కేవలం ఎయిమ్స్ నివేదికపై ఆధారపడి సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. ‘‘ఎయిమ్స్ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో వీణావాణీలకు ఆపరేషన్ చేయడం రిస్క్‌గా భావిస్తున్నాం. మరోసారి వైద్య పరీక్షల ఆలోచన సర్కారుకు లేదు. వారిని నీలోఫర్‌లో ఉంచడం కష్టం. కాబట్టి వారిని తల్లిదండ్రుల వద్దకు పంపిస్తాం. పిల్లలను చూసుకునే ఆర్థిక స్థోమత లేదని తల్లిదండ్రులు చెబుతున్నందున ముఖ్యమంత్రితో మాట్లాడి ఆర్థిక సాయం చేయాలన్న ఆలోచన చేస్తున్నాం. అలాగే వీణావాణీలకు ప్రత్యేకంగా పెన్షన్ ఇచ్చే ఆలోచన ఉంది. వారి చదువు, ఆరోగ్యం, వైద్యం కోసం కూడా సాయం చేస్తాం..’’ అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. శరీరం అతుక్కుని పుట్టి 14 ఏళ్లుగా ఎన్నో బాధలు అనుభవిస్తున్న వీణావాణీల కథ ఇంటికి చేరింది. హైదరాబాద్‌లోనే పరీక్షలు.. వీణావాణీలకు శస్త్రచికిత్స అంశంపై సర్కారు గతేడాది లండన్ వైద్యులను పిలిపించి హడావుడి చేసింది. అయితే రూ.10 కోట్లు ఖర్చవుతుందని వారు తేల్చగానే ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రి సలహా అంటూ వెనక్కి తగ్గిందన్న ఆరోపణలున్నాయి. కానీ ఎయిమ్స్లోనైనా పరీక్షలు చేశారా అంటే అదీ లేదు. నీలోఫర్ ఆస్పత్రి పక్కనే ఉన్న ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రిలో పరీక్షలు చేసి, వాటిని ఎయిమ్స్‌కు నివేదించారు. అంతర్జాతీయ స్థాయిలో చేయాల్సిన వైద్య పరీక్షలను ఇక్కడికే పరిమితం చేశారు. ఆ నివేదికలను పట్టుకుని ఎయిమ్స్ నిపుణులు ‘శస్త్ర చికిత్స చేయగలం. కానీ ప్రాణాలకు ప్రమాదం’ అని ప్రకటించారు. అసలు లండన్ వైద్యులు శస్త్రచికిత్స చేస్తామని చెప్పాక కూడా ఇలా చేయడంపై విమర్శలు వస్తున్నాయి. ఆర్థికసాయం చేస్తే తీసుకెళ్తాం వీణావాణీల తల్లిదండ్రులు తాము కూలీ చేసి బతుకుతున్నామని, ఇప్పు డు తమ వద్ద ఉన్న ఇద్దరు పిల్లలనే కష్టపడి పోషిస్తున్నామని వీణావాణీల తండ్రి మురళి పేర్కొన్నారు. వీణావాణీలను తీసుకెళ్లాలని నీలోఫర్ వైద్యులు చెప్పారని.. తాము సమ యం కావాలని కోరామని చెప్పారు. వీణావాణీలను సరిగా చూసుకునే ఆర్థిక స్థోమత తమకులేదని.. వారికి మంచి ఆహారం, విద్య, వైద్యం అందించలేమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆర్థిక సాయం చేసి, సదుపాయాలు కల్పిస్తే వీణావాణీలను తీసుకెళ్లి కంటికి రెప్పలా చూసుకుంటామని చెప్పారు. -
వీణా-వాణీలను విడదీస్తే ప్రాణగండం
హైదరాబాద్ : అవిభక్త కవలలు వీణా వాణీల శస్త్ర చికిత్స విషయంలో ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు చేతుతెల్తేశారు. తలలు అంటుకొని ప్రస్తుతం సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న వీణా-వాణీలను విడదీయడానికి శస్త్రచికిత్స చేయడం అత్యంత ప్రమాదకరమని బ్రిటన్ కు చెందిన వైద్య బృందం తేల్చి చెప్పింది. ఆపరేషన్ చేస్తే వీణా-వాణీ బతికే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయన్నారు. శస్త్రచికిత్స విజయవంతమైనా, నాడీ వ్యవస్థ కలిసి ఉండటంతో వాళ్లిద్దరూ కోమాలోకి వెళ్లడమో, నరాల క్షీణత, పక్షవాతం వచ్చే అవకాశం ఉందని వైద్యులు వెల్లడించారు. ఎయిమ్స్ వైద్యుల తాజా ప్రకటనతో నీలోఫర్ వైద్యులు డైలమాలో పడ్డారు. ఆపరేషన్ సంగతి పక్కన పెడితే ..ప్రస్తుతం నిలోఫర్ ఆసుపత్రిలో ఆశ్రయం పొందుతున్న చిన్నారులిద్దరి ఆలనాపాలన కూడా ప్రశ్నార్థకంగా మారింది. వారిద్దరికీ 13ఏళ్లు రావడంతో ఇక వారిని చూసుకోవడం తమవల్ల కాదని నిలోఫర్ వర్గాలు తేల్చి చెప్పాయి. దీంతో వీణా-వాణీల తాజా పరిస్థితులపై నీలోఫర్ వైద్యులు తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాయాలని నిర్ణయానికి వచ్చారు. కాగా ఇప్పటి వరకూ ఏదో ఓ రోజు వీరిద్దరిని విడదీసేందుకు వైద్యులు ప్రయత్నిస్తారన్న చిన్నారుల తల్లిదండ్రులు ఈ వార్తతో అయోమయంలో పడ్డారు. తాము పేదవారిమని, వారిద్దర్ని పోషించే శక్తి తమకు లేదని చెబుతున్నారు. -
వీణా వాణీ శస్త్రచికిత్సకు రంగం సిద్ధం
-
వీణా వాణీ శస్త్రచికిత్సకు రంగం సిద్ధం
సాక్షి, హైదరాబాద్: అవిభక్త కవలలు వీణా వాణీలను శస్త్రచికిత్స ద్వారా విడదీసే ప్రక్రియకు రంగం సిద్ధమవుతోంది. దీనికి సంబంధించి గురువారం ఢిల్లీలో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. అఖిల భారత వైద్య విద్యామండలి వైద్యులతో పాటు లండన్ నుంచి వచ్చిన నిపుణులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. శస్త్రచికిత్స ద్వారా వారిని విడదీస్తామంటూ లండన్ వైద్యులు గతేడాది ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, వారికి ఆపరేషన్ ఢిల్లీ ఎయిమ్స్‌లో చేయాలా లేదా లండన్‌లోనే చేయాలా అన్న దానిపై స్పష్టత రాకపోవడంతో వాయిదా పడుతూ వస్తోంది. వీణా వాణీలను విడదీసే ఆపరేషన్ విజయవంతమవుతుందా లేదా అన్నదానిపైనా వైద్య నిపుణుల్లో జోరుగా చర్చ సాగుతున్న నేపథ్యంలో గురువారం నాటి ఢిల్లీ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ ఆపరేషన్‌కు ముందు వారికి ‘డిజిటల్ సబ్‌స్ట్రాక్షన్ యాంజియో’ పరీక్ష చేయాలని ఆ సమావేశంలో నిర్ణయించారు. అవిభక్త కవలలను విడదీసే ఆపరేషన్‌కు ముందు వారి మెదడుకు సంబంధించిన సమాచారాన్ని ఈ పరీక్ష ద్వారా తెలుసుకుంటారు. రాజధానిలోని నిజాం వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్)లో ఈ రకమైన పరీక్ష నిర్వహించే సదుపాయం ఉంది. ఈ పరీక్ష అనంతరం నివేదికను లండన్ వైద్యుల పరిశీలనకు పంపుతారు. ఈ పరీక్ష ద్వారా అందిన సమాచారం ఆధారంగానే వీరికి శస్త్రచికిత్స తేదీని నిర్ణయిస్తారని వైద్యుడొకరు వెల్లడించారు. -
ఆంధ్రజ్యోతి ఎండీని అరెస్టు చేయాలి
వరంగల్: ఏబీఎన్, ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని వీణావాణీల తల్లిదండ్రులు మారగాని మురళి, నాగలక్ష్మి సోమవారం డిమాండ్ చేశారు. తమ పిల్లల పేరుతో డబ్బులు వసూలు చేసి సొంత ఖాతాలో వేసుకున్నారని ఆరోపించారు. వసూలు చేసిన డబ్బులు తమకు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్న రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వరంగల్ జిల్లా నర్సింహులపేట మండలం బీరిశెట్టిగూడెంలో ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. వీరికి గ్రామస్తులు మద్దతు తెలిపారు. అనంతరం వారు రహదారిపై రాధాకృష్ణ దిష్టిబొమ్మను దహనం చేశారు. పోలీసులు వచ్చి బాధితులతో మాట్లాడి ఆందోళనను విరమింపజేశారు. -
వీణావాణిల గోడు పట్టని ‘నిలోఫర్’
♦ శస్త్రచికిత్స కోసం ఎయిమ్స్‌తో మాట్లాడాలని సర్కార్ ఆదేశం ♦ 15 రోజులు దాటినా స్పందించని నిలోఫర్ వైద్యులు ♦ అక్టోబర్ 15తో 13వ ఏట అడుగిడిన అవిభక్త కవలలు సాక్షి, హైదరాబాద్: అవిభక్త కవలలు వీణావాణిలను వేరు చేసే ప్రక్రియ ఇప్పట్లో కొలిక్కి వచ్చేలా కనిపించడంలేదు. వీరికి శస్త్రచికిత్స చేయడానికి ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్యులను సంప్రదించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల మొదట్లో ఆదేశించినప్పటికీ నిలోఫర్ ఆస్పత్రి వైద్యుల్లో కదలిక కనిపించడంలేదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో లండన్‌కు చెందిన గ్రేట్ ఆర్మండ్ స్ట్రీట్ ఆస్పత్రి వైద్యులు డాక్టర్ డేవిడ్ డునావే, డాక్టర్ జిలానీల బృందం హైదరాబాద్‌కొచ్చి నిలోఫర్‌లో ఉన్న వీణావాణిలను పరిశీలించింది. వారిని లండన్‌కు తీసుకువస్తే శస్త్రచికిత్స చేసి వేరు చేస్తామని చెప్పింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం వీణావాణిలకు ఢిల్లీలోని ఎయిమ్స్‌లో శస్త్రచికిత్స నిర్వహిద్దామని, లండన్ నుంచి వైద్యులను ఇక్కడకే రప్పిస్తే బావుం టుందని భావించింది. ఇదే అంశంపై ఎయిమ్స్‌కు సమాచారం ఇచ్చింది. ఎనిమిది నెలలు గడచినా స్పందన లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం వీలైనంత త్వరలో ఎయిమ్స్ వైద్యులను సంప్రదించాలని వైద్య విద్యా సంచాలకుడి (డీఎంఈ)ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఎయిమ్స్ వైద్యులతో మాట్లాడాలని డీఎంఈ, నీలోఫర్ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను ఈనెల 5వ తేదీన ఆదేశించారు. 15 రోజులు దాటినా ఎయిమ్స్ వైద్యులతో ఇంతవరకూ మాట్లాడలేదని తెలుస్తోంది. అక్టోబర్ 15తో వీణావాణిలు 13వ ఏట అడుగు పెట్టారు. కవలలు పెద్దవాళ్లవుతుండటం, నీలోఫర్ చిన్నపిల్లల ఆస్పత్రి కావడంతో ఇబ్బందులొస్తాయంటున్నారు. జాప్యంపై నీలోఫర్ సూపరిండెంటెంట్ను ఫోన్లో సంప్రదించగా..ఆయన స్పందించలేదు. 2003 నుంచీ ఇదే పరిస్థితి.. ► వరంగల్ జిల్లాకు చెందిన మురళి, నాగలక్ష్మిలకు 2003లో వీణావాణిలు జన్మించారు. అప్పట్నుంచీ ఇప్పటివరకూ ఈ అవిభక్త కవలల శస్త్రచికిత్స అంశం అనేక మలుపులు తిరుగుతోంది. ► 2003లో జన్మించిన ఈ కవలను డాక్టర్ నాయుడమ్మ గుంటూరు తీసుకెళ్లారు. అక్కడే 2006 వరకూ ఉన్నారు. ఆపరేషన్ కుదరక తిరిగి వీరిని నీలోఫర్‌కు చేర్చారు. ► 2007లో ముంబై బ్రీచ్‌కాండీ ఆస్పత్రి వై ద్యులు సర్జరీ చేయడానికి సిద్ధమయ్యా రు. చిన్నారులను ముంబైకి తరలించారు. అయితే చికిత్స కార్యరూపం దాల్చకపోవడంతో తిరిగి వెనక్కు వచ్చారు. ► 2009లో సింగపూర్‌కు చెందిన డాక్టర్ కీత్‌గో బృందం వీరిని పరిశీలించినా తల్లిదండ్రులు శస్త్రచికిత్సకు ఆమోదం తెలపకపోవడంతో ఆగిపోయింది. ► 2015 ఫిబ్రవరి 8న లండన్‌కు చెందిన డాక్టర్ డునావే, డాక్టర్ జిలానీలు నీలోఫర్‌కు వచ్చి వీణావాణిలను పరిశీలించి లండన్‌కు తీసుకొస్తే శస్త్రచికిత్స చేస్తామన్నారు. కానీ ప్రభుత్వం ఎయిమ్స్‌లో చేయాలని సూచించింది. ► ఆపరేషన్ తర్వాత వచ్చే సమస్యలను ఎదుర్కొనడానికి తమవద్ద సరైన వసతులు లేవనే అభిప్రాయంతో ఎయిమ్స్ వైద్యులు ఉన్నట్టు సమాచారం. -
వీణా వాణీల శస్త్రచికిత్సపై సందిగ్ధత
సాక్షి, హైదరాబాద్: అవిభక్త కవలలు వీణావాణిల శస్త్రచికిత్స పై సందిగ్ధత కొనసాగుతోంది. లండన్ వైద్యులను రప్పించి శస్త్రచికిత్స చేయడానికి సిద్ధమేనన్న ఎయిమ్స్... రాష్ట్ర ప్రభుత్వానికి ఈ విషయమై రాసిన లేఖ లో పలు ఆసక్తికర విషయాలను ప్రస్తావించింది. తనకు ప్రభుత్వం సంధించిన 4 ప్రశ్నలకు సంక్షిప్తంగా బదులిచ్చింది. ‘‘కేం ద్రం అనుమతి స్తే లండన్ వైద్యులతో ఎయిమ్స్‌లో శస్త్రచికిత్స చే యడానికి సిద్ధమే. కానీ చిన్నారులను ప్రత్యక్షం గా పరీక్షించనిదే దీనిపై నిర్ణయం తీసుకోలేం. దేనిమీదా స్పష్టత రాకుండా ఖర్చు విషయంపై ఇప్పుడే ఏమీ చెప్పలేం’’ అని పేర్కొంది. దీం తో సర్కారు సందిగ్థంలో పడింది. ఎయిమ్స్ వై ద్య బృందాన్ని రాష్ట్రానికి రప్పించేందుకు ప్రయత్నిస్తోంది. ఆ బాధ్యతను వైద్య విద్యా సంచాలకుడు డాక్టర్ పుట్టా శ్రీనివాస్‌కు అప్పగించినట్టు ప్రభుత్వ వర్గాలు ‘సాక్షి’కి చెప్పాయి. -
వీణావాణీలకు ఎయిమ్స్‌లో శస్త్రచికిత్స
లండన్ వైద్యులతో చేయించేందుకు ఎయిమ్స్ సంసిద్ధత సాక్షి, హైదరాబాద్: అవిభక్త కవలలు వీణా వాణీల శస్త్రచికిత్సకు ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) ముందుకు వచ్చింది. లండన్ గ్రేట్ ఆర్మండ్స్ట్రీట్ ఆస్పత్రి వైద్యులను దేశానికి రప్పించి శస్త్రచికిత్స చేయిస్తామని ఎయిమ్స్ స్పష్టం చేసింది. వీణా వాణీ ల శస్త్రచికిత్స విషయమై దేశంలో ఉన్న అవకాశాలపై సలహా కోరుతూ తెలంగాణ ప్రభుత్వం నెల క్రితం ఎయిమ్స్‌కు లేఖ రాసిన సంగతి తెలిసిందే. తమ వద్దనే శస్త్రచికిత్సకు అవసరమైన అత్యాధునిక వైద్య సదుపాయాలు సమకూర్చి వీణావాణీలను విజయవంతంగా వేరు చేయడంలో కృషి చేస్తామని వెల్లడించింది. ఇది లా ఉండగా ఇక్కడకు వచ్చి శస్త్రచికిత్స చేయడానికి లండన్ వైద్యులు అంగీకరిస్తారా లేదా అన్న విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. లండన్ వైద్యులు హైదరాబాద్ నిలోఫర్‌కు వచ్చి వీణా వాణీలను పరీక్షించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వారికి విజయవంతంగా శస్త్రచికిత్స చేస్తామని లండన్ వైద్యులు వెల్లడించారు. ఆరు విడతలుగా చేసే ఈ ఆపరేషన్‌కు ఏడాది సమయం పడుతుందని స్పష్టం చేశారు. అందుకు రూ. 10 కోట్లు ఖర్చు కాగలదని ప్రభుత్వానికి నివేదిక పంపారు కూడా. లండన్ వైద్యుల నివేదిక అనంతరం తెలంగాణ సర్కారు శస్త్రచికిత్స విషయమై ఎయిమ్స్ సలహా కోరుతూ లేఖ రాసింది. అయితే, ఎయిమ్స్‌లో శస్త్రచికిత్సకు అంగీకరించిన ఆ సంస్థ ఎంత ఖర్చు అవుతుందన్న విషయాన్ని మాత్రం పేర్కొనలేదు. ఈ నేపథ్యంలో ఖర్చుపై స్పష్టత ఇవ్వాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం ఎయిమ్స్‌కు మరో లేఖ రాయాలని నిర్ణయించింది. అలాగే ఢిల్లీలోని ఎయిమ్స్‌లో శస్త్రచికిత్స చేయడానికి లండన్ వైద్యులు ముందుకు వస్తారా లేదా కూడా తెలుసుకోవాలని ప్రయత్నిస్తోంది. ఆ బాధ్యతను కేంద్ర ప్రభుత్వం మీద పెట్టి బ్రిటన్ ప్రభుత్వాన్ని ఒప్పించేలా చేయాలని కూడా భావిస్తోంది. -
లండన్ వైద్యులను ఢిల్లీ రప్పిద్దామా?
వీణ వాణీల ఆపరేషన్‌పై ఎయిమ్స్‌కు సర్కారు లేఖ దేశంలోనే శస్త్రచికిత్స చేసేందుకు ఉన్న అవకాశాలపై ఆరా ఖర్చు తదితర అంశాలపై వివరణ కోరిన రాష్ట్ర ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: వీణ, వాణి అవిభక్త కవలలను వేరు చేసేందుకు లండన్ వైద్యులను మన దేశానికే రప్పించి శస్త్రచికిత్స చేసేందుకు గల సాధ్యాసాధ్యాలపై అభిప్రాయం కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)కు లేఖ రాసింది. లండన్‌కు చెందిన గ్రేట్ ఆర్మండ్ స్ట్రీట్ ఆస్పత్రి వైద్యులు వీణవాణిలను విడదీసే శస్త్రచికిత్స చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇందుకోసం దాదాపు రూ.10 కోట్ల మేరకు ఖర్చవుతుందంటూ వారు నివేదిక కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎయిమ్స్ సలహా కోరుతూ వారి నివేదికను కూడా పంపింది. ఎక్కడ చేయించవచ్చు? ప్రధానంగా మూడు అంశాలపై సర్కారు ఎయిమ్స్ సలహా కోరింది. లండన్ డాక్టర్లను రప్పించడం ఒకటి కాగా.. అలా రప్పిస్తే ఎయిమ్స్‌లో ఆపరేషన్ చేయడానికి అవసరమైన అత్యాధునిక వైద్య పరికరాలు, సదుపాయాలు ఉన్నాయా? లేదా తెలపాలని కోరింది. లండన్‌లో చికిత్సకు రూ. 10 కోట్లు ఖర్చయితే.. వారిని ఢిల్లీకి రప్పించి, శస్త్రచికిత్స చేయిస్తే ఎంత ఖర్చవుతుందో సమాచారం ఇవ్వాలని కోరింది. ఇక రెండో అంశం.. అసలు ఎయిమ్స్‌లోనే శస్త్రచికిత్స చేయడానికి అవకాశాలు, ఆధునిక వైద్య వసతులు ఏమేరకు ఉన్నాయనే వివరాలు ఇవ్వాలని కోరింది. మూడో విషయం.. దేశంలో మరెక్కడైనా వీణవాణీలకు శస్త్రచికిత్స చేసే సామర్థ్యం గల ఆసుపత్రులున్నాయా? వైద్యులు ఉన్నారా? అన్న విషయంపైనా వివరాలు పంపాల్సిందిగా విజ్ఞప్తి చేసింది. ఈ మూడింటిలో ఏది అనుకూలమో చెప్పాలని.. శస్త్రచికిత్స విజయవంతమయ్యేలా ఆ సలహాలు ఉండాలని కోరింది. జాప్యమా.. జాగ్రత్తా..? వీణవాణీల శస్త్రచికిత్సపై ఎయిమ్స్ సలహా కోరడం మంచిదే అయినా... దేశంలో ఎక్కడైనా చేసే అవకాశం ఉందా? అని సర్కారు అడగడాన్ని పలువురు వైద్య నిపుణులు విమర్శిస్తున్నారు. వీణవాణీల ఆపరేషన్‌పై ఏళ్లుగా చర్చ జరుగుతున్న సంగతిని వారు ప్రస్తావిస్తున్నారు. సింగపూర్ వైద్యులను ఇంతకు ముందు సంప్రదించారని, దేశంలో పలు రాష్ట్రాల్లో ఉన్న ప్రసిద్ధ ఆసుపత్రులతో పాటు ఎయిమ్స్ వైద్యుల దృష్టిలోనూ ఈ విషయం ఉందని వారు చెబుతున్నారు. అనేక ప్రయత్నాల తర్వాతే లండన్ ఆసుపత్రి వైద్యులు ముందుకు వచ్చారని, వారు ఇప్పటికే ఇలాంటి ఆపరేషన్ చేసి విజయవంతమయ్యారని అంటున్నారు. ఇలా ఇన్ని రకాల ప్రయత్నాలు జరిగినప్పటికీ... మళ్లీ ఎయిమ్స్ సలహా అంటూ సర్కారు తాత్సారం చేస్తోందని ఆరోపిస్తున్నారు. లండన్ ఆసుపత్రిలో చికిత్స విజయవంతానికి గల అవకాశాలను పరిశీలించాలని కోరితే చాలని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే ప్రభుత్వ యంత్రాంగం మాత్రం ఈ వాదనను కొట్టివేస్తోంది. ఒకటికి పదిసార్లు సరిచూసుకోవడం కోసమే ప్రభుత్వం ఎయిమ్స్ సలహా కోరిందని చెబుతోంది. -
క్షేమంగా వెళ్ళి.. లాభంగా రండి..!
-
అవిభక్త కవలలు-విభక్త కవలలు
మొత్తం మీద ఈ చీలు సర్కార్లు కొన్నిసార్లు ద్వైతంగా, అప్పుడప్పుడు అద్వైతంగా ప్రవర్తిస్తున్నాయి. కేంద్రంతో ముడిపడిన సందర్భాల్లో విశిష్టాద్వైతం కనిపిస్తోంది. వీణ వాణి అవిభక్త కవల లుగా పుట్టినప్పటి నుంచి వార్తల్లో ఉన్నారు. తల తప్ప మిగిలిన భాగాలన్నీ విడివిడి గానే ఉంటాయి. ఈ కవలలు తెలంగాణ బిడ్డలు. సరిగ్గా కేసీఆర్ తెలంగాణ ఉద్యమా నికి ఎంత వయసో వీరికీ అంతే! మొన్ననే లండన్ నుం చి వచ్చిన వైద్యనిపుణులు పరీక్షలన్నీ చేసి శస్త్రచికిత్స చేస్తామన్నారు. ఎనభై శాతం విజయవంతం అవుతుం ది. ఏవన్నా ఎదురుచూడని సమస్యలొస్తే ఇరవై శాతం అపజయానికి ఆస్కారం ఉందన్నారు. ఆపరేషన్‌కి అయ్యే కోట్లాది వ్యయం తెలంగాణ ప్రభుత్వమే భరి స్తానంది. విశాలాంధ్ర నుంచి ఆంధ్రప్రదేశ్ అవతరించిన పుడు అది భాషా ప్రయుక్త రాష్ట్రాల కోవలోకి వచ్చింది. మా అమ్మ ‘‘తెలుగు తల్లి’’ అన్నారు. ఆంధ్రప్రదేశ్ చీలాక తెలుగు తల్లి అవశేషంలోకి వెళ్లింది. సశేషంలోకి వేరే తల్లి వచ్చింది. అప్పట్లో రెండు తలలు కలిసి ఉండి మెదళ్లు ఏకాండిగా పెనవేసుకు పెరిగాయి. అప్పటి అధి ష్టానం హడావుడిగా శస్త్రచికిత్సకు పూనుకుంది. బొత్తిగా వ్యవధిలేక పరశురాముడి బాణీలో గండ్ర గొడ్డలి దెబ్బ తో రెండు ముక్కలు చేసి, గొడ్డలి భుజాన వేసుకు వెళ్లిపో యింది. దాంతో అతి సున్నితంగా ఉండే మెదడు అస్త వ్యస్తమైపోయింది. ఆలోచనలన్నీ మెదడులోనే కదా పుడ తాయి. దురద పుడితే గోక్కోమనే సూచన దగ్గర్నించి అనంత కోట్ల విలువైన స్కామ్‌లకు పునాదులు మెదడు లోనే కదా పడేది. గొడ్డలి దెబ్బకి చెదిరిపోయి కొన్ని నరాలు అక్రమంగానూ కొన్ని సక్రమంగానూ పనిచేస్తు న్నాయి. ఉద్యోగుల జీతాల పెంపు, డీజిల్ పెట్రో ధరల పెంపు, ఇసుక అమ్మకాలు, లిక్కర్ అమ్మకాల పెంపు, అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణ, దాష్టీకపు ప్రసంగాలు లాంటివి రెండు తుంపుల్లోంచి ఒకలాగే వినిపిస్తున్నాయి. మొత్తం మీద ఈ చీలు సర్కార్లు కొన్నిసార్లు ద్వైతం గా, అప్పుడప్పుడు అద్వైతంగా ప్రవర్తిస్తున్నాయి. కేం ద్రంతో ముడిపడిన సందర్భాల్లో విశిష్టాద్వైతం కనిపిస్తోంది. అడవుల్లో కొన్నిసార్లు కొన్నిచోట్ల కొన్ని పచ్చటి తీగెలు కలగాపులగంగా అల్లుకుపోతాయి. అప్పుడు ఏ తీగెకు ఏ పువ్వు పూసిందో తెలియదు. ఆ అల్లాయ్ బల్లాయ్లో ఒక్కోసారి జన్యుమార్పిడి జరిగిపోయి, తీగెల పూలరంగులు పోలికలు మారిపోతాయి. అడవి మల్లెలు ఎరుపెక్కుతాయి. తీగెమందారం తెల్లబడుతుం ది! ఇది ప్రకృతి సహజం. కాని ఈ వ్యవహారం వేరు. ‘‘మదారుగాని బండి, సలారు గాని ఎద్దులు, బుడెన్ సాబ్ కందెన - కట్టరా దీన్ని కొండల్లో అన్నట్టు’’, అంటే బండికి కావల్సిన ఏ దినుసూ సరిగ్గాలేదు.. అయినా మనదేం పోయిందని కట్టేసి కొండ ఎక్కించారు ఆ నాటి ఘనులు. కాని వీణ వాణిల వైద్య నిపుణులు తమ అను భవాన్ని, పరిజ్ఞానాన్ని మేళవించి బాధ్యతాయుతంగా విడదీసే క్రమాన్ని చెప్పారు. ఏడాది పాటు దశల వారీగా పెనవేసుకున్న మెదడుని విడదీస్తామన్నారు. ఈ సమ స్యని కూడా నేత శిల్పి పడుగు పోసినంత సుకుమారం గా, ఒక్క పోగు కూడా మెలిక పడకుండా చూడాలి. పడు గుని క్రమపద్ధతిలో చుట్టి మగ్గం మీదకు ఎక్కిస్తే తర్వాత పేకాడించడం సుగమం అవుతుంది. అప్పుడిక ఎంసెట్ సమస్య ఇట్టే సాల్వ్ అవుతుంది. కృష్ణా గోదావరి జలాల వివాదం ఉండదు. కుడి కాల్వ ఎండిపోవడం, ఎడమ గట్టు మండి పడటం ఉండదు. విద్యుత్తు సక్రమంగా దామాషా ప్రకారం ప్రవహిస్తుంది. భిన్నత్వంలో ఏక త్వంగా క్రమబద్ధీకరించిన ఆంధ్ర తెలంగాణ మెదళ్లు పనిచేస్తాయి. అపస్వరాల నిలయాలుగా ఉన్న అవశేష సశేష రాష్ట్రాలు అర్ధనారీస్వరం అవుతుంది! - (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
ఆపరేషన్ ఖర్చు భరించనున్న సర్కారు?
వీణావాణిల ఆపరేషన్‌పై సీఎంతో చర్చించి నిర్ణయం సాక్షి, హైదరాబాద్: అవిభక్త కవలలు వీణా వాణిలను బ్రిటన్ పంపించి, ఆపరేషన్‌కు అయ్యే ఖర్చును భరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సచివాలయంలో సోమవారం వైద్య ఆరోగ్యశాఖామంత్రి సి.లక్ష్మారెడ్డి ఉన్నతాధికారులతో సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా వీణావాణిల ఆపరేషన్ అంశం చర్చకు వచ్చినట్లు తెలిసింది. ఆపరేషన్‌కు అయ్యే ఖర్చు... అందులో ఉండే రిస్క్‌పై తల్లిదండ్రులతో చర్చించాలని మంత్రి పేర్కొన్నట్టు సమాచారం. వారి అంగీకారంతోనే నిర్ణయం తీసుకోవాలని చెప్పినట్లు తెలి సింది. లండన్ వైద్యుల నుంచి ప్రతిపాదనలు వచ్చాక వాటిపై సీఎం కేసీఆర్‌తో చర్చించి నిర్ణయం తీసుకోవాలని అన్న ట్లు సమాచారం. రిస్క్ తక్కువుంటే ముందుకు వెళ్లాలని... లేకుంటే ఏంచేయాలనే అంశంపై సీఎం అభిప్రాయం తీసుకోవాలని భావించినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా జూడాల సమ్మె కాలాన్ని గైర్హాజరీగా పరిగణించడం వల్ల మార్చి1న జరిగే పీజీ పరీక్షకు హౌస్సర్జన్లు అర్హత కోల్పోతారని... అయితే ప్రభుత్వం దీనిపై ఇప్పటికే విధాననిర్ణయం తీసుకున్నందున దీనిపై ఇప్పుడేమీ చేయలేమని చేతుతెత్తేసినట్లు సమాచారం. జూడాల భద్రత, స్టైఫండ్ సమ స్యలను పరిష్కరించాలని నిర్ణయించారు. పారిశుద్ధ్యానికి సంబంధించిన బకాయిల చెల్లింపులకు ప్రతిపాదలను సిద్ధం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. కేటాయించిన రూ. 4.8 కోట్లలో విడుదల కాని నిధులను ఇస్తామని మంత్రి చెప్పారు. -
లండన్‌లో వీణావాణీల ఆపరేషన్..!
-
వీణ-వాణిలను వేరు చేయొచ్చు: లండన్ వైద్యులు
అవిభక్త కవలలు వీణ - వాణిలను లండన్ నుంచి వచ్చిన వైద్యులు శనివారం పరిశీలించారు. వారిని వేరు చేయడానికి అవకాశాలు ఉన్నాయో లేవో క్షుణ్ణంగా చూశారు. తప్పకుండా వాళ్లిద్దరినీ వేరు చేయొచ్చని తెలిపారు. అయితే సంక్లిష్ట పరిస్థితుల దృష్ట్యా వాళ్లకు లండన్‌లోనే ఆపరేషన్ చేయాల్సి ఉంటుందన్నారు. దాదాపు ఐదు విడతల్లో సర్జరీలు చేయాల్సి ఉంటుందని, ఇందుకు 9 నుంచి 12 నెలల పాటు సమయం పట్టే అవకాశం ఉందని చెప్పారు. తాము ఇప్పటివరకు రెండుసార్లు అవిభక్త కవలలకు ఆపరేషన్లు చేశామని, వేరుపడ్డ ఆ నలుగురు కవలలు ఇప్పుడు క్షేమంగా, ఆరోగ్యంగా ఉన్నారని వివరించారు. ఇప్పుడు వీణ - వాణిలను కూడా తాము వేరు చేయగలమని చెప్పారు.