వీణ-వాణిలను వేరు చేయొచ్చు: లండన్ వైద్యులు | we can seperate veena and vani, say london doctors | Sakshi
Sakshi News home page

వీణ-వాణిలను వేరు చేయొచ్చు: లండన్ వైద్యులు

Published Sat, Feb 7 2015 1:55 PM | Last Updated on Sat, Sep 2 2017 8:57 PM

వీణ-వాణిలను వేరు చేయొచ్చు: లండన్ వైద్యులు

వీణ-వాణిలను వేరు చేయొచ్చు: లండన్ వైద్యులు

అవిభక్త కవలలు వీణ - వాణిలను లండన్ నుంచి వచ్చిన వైద్యులు శనివారం పరిశీలించారు. వారిని వేరు చేయడానికి అవకాశాలు ఉన్నాయో లేవో క్షుణ్ణంగా చూశారు. తప్పకుండా వాళ్లిద్దరినీ వేరు చేయొచ్చని తెలిపారు. అయితే సంక్లిష్ట పరిస్థితుల దృష్ట్యా వాళ్లకు లండన్లోనే ఆపరేషన్ చేయాల్సి ఉంటుందన్నారు.

దాదాపు ఐదు విడతల్లో సర్జరీలు చేయాల్సి ఉంటుందని, ఇందుకు 9 నుంచి 12 నెలల పాటు సమయం పట్టే అవకాశం ఉందని చెప్పారు. తాము ఇప్పటివరకు రెండుసార్లు అవిభక్త కవలలకు ఆపరేషన్లు చేశామని, వేరుపడ్డ ఆ నలుగురు కవలలు ఇప్పుడు క్షేమంగా, ఆరోగ్యంగా ఉన్నారని వివరించారు. ఇప్పుడు వీణ - వాణిలను కూడా తాము వేరు చేయగలమని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement