ఆపరేషన్ ఖర్చు భరించనున్న సర్కారు?
- వీణావాణిల ఆపరేషన్‌పై సీఎంతో చర్చించి నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: అవిభక్త కవలలు వీణా వాణిలను బ్రిటన్ పంపించి, ఆపరేషన్‌కు అయ్యే ఖర్చును భరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సచివాలయంలో సోమవారం వైద్య ఆరోగ్యశాఖామంత్రి సి.లక్ష్మారెడ్డి ఉన్నతాధికారులతో సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా వీణావాణిల ఆపరేషన్ అంశం చర్చకు వచ్చినట్లు తెలిసింది.
ఆపరేషన్‌కు అయ్యే ఖర్చు... అందులో ఉండే రిస్క్‌పై తల్లిదండ్రులతో చర్చించాలని మంత్రి పేర్కొన్నట్టు సమాచారం. వారి అంగీకారంతోనే నిర్ణయం తీసుకోవాలని చెప్పినట్లు తెలి సింది. లండన్ వైద్యుల నుంచి ప్రతిపాదనలు వచ్చాక వాటిపై సీఎం కేసీఆర్‌తో చర్చించి నిర్ణయం తీసుకోవాలని అన్న ట్లు సమాచారం. రిస్క్ తక్కువుంటే ముందుకు వెళ్లాలని... లేకుంటే ఏంచేయాలనే అంశంపై సీఎం అభిప్రాయం తీసుకోవాలని భావించినట్లు తెలిసింది.
ఇదిలా ఉండగా జూడాల సమ్మె కాలాన్ని గైర్హాజరీగా పరిగణించడం వల్ల మార్చి1న జరిగే పీజీ పరీక్షకు హౌస్‌సర్జన్లు అర్హత కోల్పోతారని... అయితే ప్రభుత్వం దీనిపై ఇప్పటికే విధాననిర్ణయం తీసుకున్నందున దీనిపై ఇప్పుడేమీ చేయలేమని చేతుతెత్తేసినట్లు సమాచారం. జూడాల భద్రత, స్టైఫండ్ సమ స్యలను పరిష్కరించాలని నిర్ణయించారు. పారిశుద్ధ్యానికి సంబంధించిన బకాయిల చెల్లింపులకు ప్రతిపాదలను సిద్ధం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. కేటాయించిన రూ. 4.8 కోట్లలో విడుదల కాని నిధులను ఇస్తామని మంత్రి చెప్పారు.