Undivided twins
-
కష్టాల్లో వీణ-వాణి పర్యవేక్షణ!
- స్టేట్‌హోంకు తరలించే అవకాశముందంటున్న అధికారులు సాక్షి, హైదరాబాద్: అవిభక్త కవలలు వీణ-వాణిల పరిస్థితి ఇప్పుడు ఇబ్బందికరంగా ఉంది. లండన్ పంపించి ఆపరేషన్ చేసే కథ కంచికి చేరింది. ఎయిమ్స్ వైద్యులూ చేతులెత్తేశారు. యుక్త వయస్సు వస్తోంది ఇక మేము ఉంచుకోలేమంటూ నీలోఫర్ వైద్యులు చెబుతున్నారు..తల్లిదండ్రులేమో ఆ బిడ్డలను తీసుకెళ్లేందుకు నిరాకరిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో వీణ వాణిల పర్యవేక్షణ, వారికి వైద్యసేవలు ప్రశ్నార్థకంగా మారాయి. వీణ-వాణిల తల్లిదండ్రుల్ని పిలిచి మాట్లాడాలని ప్రభుత్వం నీలోఫర్ వైద్యులకిచ్చిన ఆదేశాల మేరకు ఆరు రోజుల క్రితం కవలల తండ్రిని పిలిపించారు. కవలలిద్దరినీ తీసుకెళతానని, అయితే దీనికోసం ప్రభుత్వం నుంచి ఏదైనా సాయం వచ్చేలా చూడాలని కోరారు. ఆ తర్వాత నీలోఫర్ వైద్యులు, వీణ-వాణి తండ్రి లేఖ రాయడం మొదలెట్టారు. లేఖ రాసేక్రమంలో సగం పూర్తయ్యాక వీణ-వాణిల తండ్రికి ఫోన్ వచ్చింది. అనంతరం ఆయన లేఖ మధ్యలోనే ఆపేశారు. ఎందుకూ అని వైద్యులు ప్రశ్నించగా, ఐదు రోజుల తర్వాత వచ్చి తీసుకెళతానని చెప్పారు. ఇప్పుడు ఏడు రోజులైనా తండ్రి ఫోన్ కూడా తీయడం లేదని వైద్యులు చెబుతున్నారు. దీంతో నీలోఫర్ వైద్య బృందం కూడా ఆందోళన వ్యక్తం చేస్తోంది. నీలోఫర్ ఆస్పత్రి ఎనిమిదేళ్లలోపు చిన్నారులకు మాత్రమే వైద్యమందించే ఆస్పత్రి అని, వీణ-వాణిలకు 13 సంవత్సరాల వయసు వచ్చిందని, ఇక తాము ఇక్కడ వారి పర్యవేక్షణ చూడలేమని చెబుతున్నారు. ప్రభుత్వమే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని వైద్యబృందం సర్కారుకు లేఖ రాయనున్నట్టు తెలిసింది. తల్లిదండ్రులు తీసుకెళ్లడానికి నిరాకరిస్తే వారిని స్టేట్‌హోంకు తరలించాలనే ఆలోచన సర్కారుకు ఉన్నట్టు తెలుస్తోంది. -
త్వరలో ఎయిమ్స్‌కు వీణావాణి
* అనుమతులు వచ్చిన తర్వాత తరలింపు * ఎయిమ్స్‌లో ఆపరేషన్ సాధ్యమే: వైద్య బృందం సాక్షి, హైదరాబాద్: అవిభక్త కవలలు వీణావాణిలను త్వరలో ఢిల్లీ తీసుకెళ్లి పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆల్ ఇండియా మెడికల్ సైన్స్ (ఎయిమ్స్) వైద్య బృందం తెలిపింది. వారం రోజుల పాటు అక్కడే ఉంచుకుని రక్తనాళాలకు సంబంధించిన వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు గురువారం ఎయిమ్స్ న్యూరోసర్జన్స్ డాక్టర్ అశిష్ సూరి, డాక్టర్ మన్మోహన్ సింగ్, ప్లాస్టిక్ అండ్ రీకన్స్ట్రక్షన్ సర్జన్ డాక్టర్ మనీష్ సింగాల్ బృందం నిలోఫర్ ఆస్పత్రికి చేరుకుని వీణావాణిల ఆరోగ్య పరిస్థితిని పరీక్షించారు. సుమారు రెండు గంటల పాటు పిల్లలతో గడిపారు. వీణావాణిలను ఎయిమ్స్‌కు తీసుకెళ్లి వారం రోజుల పాటు అక్కడే ఉంచి పూర్తి స్థాయి వైద్య పరీక్షలు చేయాల్సి ఉందన్నారు. ఆ తర్వాతే శస్త్రచికిత్సపై ఓ అంచనాకు వచ్చే అవకాశం ఉందన్నారు. ఎయిమ్స్‌లో శస్త్రచికిత్స సాధ్యమేనని స్పష్టం చేశారు. అయితే తెలంగాణ ప్రభుత్వం ఎయిమ్స్ డెరైక్టర్‌కు లేఖ రాయాల్సి ఉందని, ఆ ప్రక్రియ పూర్తయి.. ప్రభుత్వ పరంగా అన్ని అనుమతులు వచ్చిన తర్వాత వీణావాణిలను ఢిల్లీ తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. -
ఒక్కొక్కరికీ నాలుగు కళ్లు...
మన వీణావాణీల్లాగానే వీరు కూడా తల భాగంలో అతుక్కుని పుట్టిన అవిభక్త కవలలు. పేర్లు తాతియానా, క్రిస్టా. వయసు ఏడేళ్లు.. ఉండేది కెనడాలో.. వీరిద్దరికీ అన్ని అవయవాలూ విడివిడిగానే ఉన్నాయి. మెదడు కూడా ఎవరిది వారిదే. కానీ రెండు అతుక్కుని ఉండటంతో భావోద్వేగాలను ఇద్దరూ అనుభూతి చెందుతారు. అంటే.. ఒకరికి చక్కిలిగింత పెడితే రెండో అమ్మాయికీ నవ్వొస్తుంది. ఒకరికి బాధ కలిగితే అది ఇద్దరికీ తెలుస్తుంది. అన్నింటికంటే ప్రత్యేకత ఏమిటంటే.. వీరిద్దరూ ఒకరి కళ్లలో నుంచి మరొకరు చూడగలుగుతారు!! ఇద్దరికీ వేర్వేరు అభిప్రాయాలు, వేర్వేరు ఆలోచనలు ఉన్నాయి. తమ అవయవాలను తామే నియంత్రించుకుంటారు. కానీ కాళ్లు, చేతులను మాత్రం ఇద్దరూ నియంత్రించగలుగుతారు. అంటే.. తాతియానా చేతిని గాల్లోకి లేపాలంటే అది క్రిస్టా కూడా చేయగలుగుతుందన్న మాట. వీరు పుట్టిన తర్వాత ఒక రోజు కంటే ఎక్కువ బతకరని వైద్యులు పెదవి విరిచారట. కానీ ఇప్పుడు వీరు చాలా ఆనందంగా ఎలాంటి సమస్యా లేకుండా ఉండటం తమకు ఎంతో సంతోషంగా ఉందని తల్లి హోగన్ చెబుతోంది. -
అవిభక్త కవలలు-విభక్త కవలలు
మొత్తం మీద ఈ చీలు సర్కార్లు కొన్నిసార్లు ద్వైతంగా, అప్పుడప్పుడు అద్వైతంగా ప్రవర్తిస్తున్నాయి. కేంద్రంతో ముడిపడిన సందర్భాల్లో విశిష్టాద్వైతం కనిపిస్తోంది. వీణ వాణి అవిభక్త కవల లుగా పుట్టినప్పటి నుంచి వార్తల్లో ఉన్నారు. తల తప్ప మిగిలిన భాగాలన్నీ విడివిడి గానే ఉంటాయి. ఈ కవలలు తెలంగాణ బిడ్డలు. సరిగ్గా కేసీఆర్ తెలంగాణ ఉద్యమా నికి ఎంత వయసో వీరికీ అంతే! మొన్ననే లండన్ నుం చి వచ్చిన వైద్యనిపుణులు పరీక్షలన్నీ చేసి శస్త్రచికిత్స చేస్తామన్నారు. ఎనభై శాతం విజయవంతం అవుతుం ది. ఏవన్నా ఎదురుచూడని సమస్యలొస్తే ఇరవై శాతం అపజయానికి ఆస్కారం ఉందన్నారు. ఆపరేషన్‌కి అయ్యే కోట్లాది వ్యయం తెలంగాణ ప్రభుత్వమే భరి స్తానంది. విశాలాంధ్ర నుంచి ఆంధ్రప్రదేశ్ అవతరించిన పుడు అది భాషా ప్రయుక్త రాష్ట్రాల కోవలోకి వచ్చింది. మా అమ్మ ‘‘తెలుగు తల్లి’’ అన్నారు. ఆంధ్రప్రదేశ్ చీలాక తెలుగు తల్లి అవశేషంలోకి వెళ్లింది. సశేషంలోకి వేరే తల్లి వచ్చింది. అప్పట్లో రెండు తలలు కలిసి ఉండి మెదళ్లు ఏకాండిగా పెనవేసుకు పెరిగాయి. అప్పటి అధి ష్టానం హడావుడిగా శస్త్రచికిత్సకు పూనుకుంది. బొత్తిగా వ్యవధిలేక పరశురాముడి బాణీలో గండ్ర గొడ్డలి దెబ్బ తో రెండు ముక్కలు చేసి, గొడ్డలి భుజాన వేసుకు వెళ్లిపో యింది. దాంతో అతి సున్నితంగా ఉండే మెదడు అస్త వ్యస్తమైపోయింది. ఆలోచనలన్నీ మెదడులోనే కదా పుడ తాయి. దురద పుడితే గోక్కోమనే సూచన దగ్గర్నించి అనంత కోట్ల విలువైన స్కామ్‌లకు పునాదులు మెదడు లోనే కదా పడేది. గొడ్డలి దెబ్బకి చెదిరిపోయి కొన్ని నరాలు అక్రమంగానూ కొన్ని సక్రమంగానూ పనిచేస్తు న్నాయి. ఉద్యోగుల జీతాల పెంపు, డీజిల్ పెట్రో ధరల పెంపు, ఇసుక అమ్మకాలు, లిక్కర్ అమ్మకాల పెంపు, అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణ, దాష్టీకపు ప్రసంగాలు లాంటివి రెండు తుంపుల్లోంచి ఒకలాగే వినిపిస్తున్నాయి. మొత్తం మీద ఈ చీలు సర్కార్లు కొన్నిసార్లు ద్వైతం గా, అప్పుడప్పుడు అద్వైతంగా ప్రవర్తిస్తున్నాయి. కేం ద్రంతో ముడిపడిన సందర్భాల్లో విశిష్టాద్వైతం కనిపిస్తోంది. అడవుల్లో కొన్నిసార్లు కొన్నిచోట్ల కొన్ని పచ్చటి తీగెలు కలగాపులగంగా అల్లుకుపోతాయి. అప్పుడు ఏ తీగెకు ఏ పువ్వు పూసిందో తెలియదు. ఆ అల్లాయ్ బల్లాయ్లో ఒక్కోసారి జన్యుమార్పిడి జరిగిపోయి, తీగెల పూలరంగులు పోలికలు మారిపోతాయి. అడవి మల్లెలు ఎరుపెక్కుతాయి. తీగెమందారం తెల్లబడుతుం ది! ఇది ప్రకృతి సహజం. కాని ఈ వ్యవహారం వేరు. ‘‘మదారుగాని బండి, సలారు గాని ఎద్దులు, బుడెన్ సాబ్ కందెన - కట్టరా దీన్ని కొండల్లో అన్నట్టు’’, అంటే బండికి కావల్సిన ఏ దినుసూ సరిగ్గాలేదు.. అయినా మనదేం పోయిందని కట్టేసి కొండ ఎక్కించారు ఆ నాటి ఘనులు. కాని వీణ వాణిల వైద్య నిపుణులు తమ అను భవాన్ని, పరిజ్ఞానాన్ని మేళవించి బాధ్యతాయుతంగా విడదీసే క్రమాన్ని చెప్పారు. ఏడాది పాటు దశల వారీగా పెనవేసుకున్న మెదడుని విడదీస్తామన్నారు. ఈ సమ స్యని కూడా నేత శిల్పి పడుగు పోసినంత సుకుమారం గా, ఒక్క పోగు కూడా మెలిక పడకుండా చూడాలి. పడు గుని క్రమపద్ధతిలో చుట్టి మగ్గం మీదకు ఎక్కిస్తే తర్వాత పేకాడించడం సుగమం అవుతుంది. అప్పుడిక ఎంసెట్ సమస్య ఇట్టే సాల్వ్ అవుతుంది. కృష్ణా గోదావరి జలాల వివాదం ఉండదు. కుడి కాల్వ ఎండిపోవడం, ఎడమ గట్టు మండి పడటం ఉండదు. విద్యుత్తు సక్రమంగా దామాషా ప్రకారం ప్రవహిస్తుంది. భిన్నత్వంలో ఏక త్వంగా క్రమబద్ధీకరించిన ఆంధ్ర తెలంగాణ మెదళ్లు పనిచేస్తాయి. అపస్వరాల నిలయాలుగా ఉన్న అవశేష సశేష రాష్ట్రాలు అర్ధనారీస్వరం అవుతుంది! - (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
ఆపరేషన్ ఖర్చు భరించనున్న సర్కారు?
వీణావాణిల ఆపరేషన్‌పై సీఎంతో చర్చించి నిర్ణయం సాక్షి, హైదరాబాద్: అవిభక్త కవలలు వీణా వాణిలను బ్రిటన్ పంపించి, ఆపరేషన్‌కు అయ్యే ఖర్చును భరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సచివాలయంలో సోమవారం వైద్య ఆరోగ్యశాఖామంత్రి సి.లక్ష్మారెడ్డి ఉన్నతాధికారులతో సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా వీణావాణిల ఆపరేషన్ అంశం చర్చకు వచ్చినట్లు తెలిసింది. ఆపరేషన్‌కు అయ్యే ఖర్చు... అందులో ఉండే రిస్క్‌పై తల్లిదండ్రులతో చర్చించాలని మంత్రి పేర్కొన్నట్టు సమాచారం. వారి అంగీకారంతోనే నిర్ణయం తీసుకోవాలని చెప్పినట్లు తెలి సింది. లండన్ వైద్యుల నుంచి ప్రతిపాదనలు వచ్చాక వాటిపై సీఎం కేసీఆర్‌తో చర్చించి నిర్ణయం తీసుకోవాలని అన్న ట్లు సమాచారం. రిస్క్ తక్కువుంటే ముందుకు వెళ్లాలని... లేకుంటే ఏంచేయాలనే అంశంపై సీఎం అభిప్రాయం తీసుకోవాలని భావించినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా జూడాల సమ్మె కాలాన్ని గైర్హాజరీగా పరిగణించడం వల్ల మార్చి1న జరిగే పీజీ పరీక్షకు హౌస్సర్జన్లు అర్హత కోల్పోతారని... అయితే ప్రభుత్వం దీనిపై ఇప్పటికే విధాననిర్ణయం తీసుకున్నందున దీనిపై ఇప్పుడేమీ చేయలేమని చేతుతెత్తేసినట్లు సమాచారం. జూడాల భద్రత, స్టైఫండ్ సమ స్యలను పరిష్కరించాలని నిర్ణయించారు. పారిశుద్ధ్యానికి సంబంధించిన బకాయిల చెల్లింపులకు ప్రతిపాదలను సిద్ధం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. కేటాయించిన రూ. 4.8 కోట్లలో విడుదల కాని నిధులను ఇస్తామని మంత్రి చెప్పారు. -
ఒకే గుండెతో.. అవిభక్త కవలల జననం
విశాఖపట్నం ప్రభుత్వ ఘోషా ఆస్పత్రిలో శుక్రవారం ఉదయం అరుదైన అవిభక్త కవలలు జన్మించారు. మగ శిశువులిద్దరూ ఛాతీ వద్ద అతుక్కుని పుట్టారు. ఇద్దరికీ ఒకే గుండె, ఒకే కాలేయం ఉన్నాయి. చికిత్స నిమిత్తం వీరిని కేజీహెచ్‌కు పంపించారు. శిశువుల తండ్రి మారపల్లి యర్రయ్య భవన నిర్మాణ సెంటరింగ్ కార్మికుడు. తల్లి నూకాలమ్మ గృహిణి. ఆమెకిది మూడో కాన్పు. తొలి రెండు కాన్పులు కూడా ఆమెకు నిరాశనే మిగిల్చాయి. అండ విభజన సరిగా జరిగితే కవలలు జన్మిస్తారని.. సరిగ్గా జరగకపోతే ఇలా అవిభక్త కవలలు పుడతారని ఘోషా ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ ఉమ చెప్పారు. కొందరు తల వద్ద, మరొకొందరు చాతీవద్ద, ఇంకొందరు నడుము వద్ద అతుక్కుని పుడతారన్నారు. శిశువులిద్దరినీ కేజీహెచ్‌కు పంపించి చికిత్స చేయిస్తామన్నారు.