ప్రభాస్‌ ఒకేసారి రెండు సినిమాల్లో.! | Prabhas to shoot for two films | Sakshi
Sakshi News home page

Published Sat, Jan 13 2018 4:08 PM | Last Updated on Sat, Jan 13 2018 4:08 PM

Prabhas to shoot for two films - Sakshi

బాహుబలి సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్, ప్రస్తుతం మరో భారీ చిత్రం సాహో షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసింది. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు రన్ రాజా రన్‌ ఫేం సుజిత్ దర్శకుడు. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా పూర్తవ్వడానికి చాలా సమయం పడుతుందని భావిస్తున్నారు.

అయితే ఈ లోగా మరో సినిమాను కూడా పట్టాలెక్కించాలని భావిస్తున్నాడట రెబల్ స్టార్. జిల్ ఫేం రాధకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు గతంలోనే ఓకె చెప్పాడు ప్రభాస్‌. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాను సాహోతో పాటు కంప్లీట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడట ప్రభాస్. అయితే ఈ వార్తలపై చిత్రయూనిట్ మాత్రం అధికారికంగా స్పందించలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement