ప్రభాస్‌ ప్రేమకథ మొదలవుతోంది | Prabhas Next Film To Be Launched In August | Sakshi
Sakshi News home page

Jul 24 2018 12:26 PM | Updated on Jul 24 2018 12:26 PM

Prabhas Next Film To Be Launched In August - Sakshi

యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ ప్రస్తుతం సాహో సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా సెట్స్‌ మీద ఉండగానే నెక్ట్స్‌ సినిమాను రెడీ చేస్తున్నాడు ప్రభాస్‌. జిల్‌ ఫేం రాధకృష్ణ దర్శకత్వంలో ఓ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌లో నటించేందుకు ఓకె చెప్పాడు. ఈ సినిమాను కూడా యూవీ క్రియేషన్స్‌ సంస్థ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తోంది. ఇప్పటికే సాహో పనులు పూర్తి కావస్తుండటంతో త్వరలో కొత్త సినిమాను ప్రారంభించేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.

పీరియాడిక్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను ఆగస్టు తొలి వారంలో ప్రారంభించనున్నారట. అధికారికంగా ప్రకటించకపోయినా ఆగస్టులోనే ఈ సినిమా సెట్స్‌ మీదకు వెళ్లనుందన్న వార్త టాలీవుడ్‌ సర్కిల్స్‌లో గట్టిగా వినిపిస్తోంది. యూరప్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమా కోసం హైదరబాద్‌లో యూరప్‌ లోకేషన్లను సెట్‌ వేస్తున్నారట. అక్కడి ట్రైన్‌, షిప్‌, హెలికాప్టర్‌ లాంటి వాటిని కూడా హైదరాబాద్‌లో సెట్‌ వేస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement