ప్రభాస్‌ కొత్త సినిమాకు దేశీ టైటిలే..! | Prabhas Radha Krishna Movie Titled as Jaan | Sakshi
Sakshi News home page

Published Fri, Oct 12 2018 12:20 PM | Last Updated on Fri, Oct 12 2018 12:20 PM

Prabhas Radha Krishna Movie Titled as Jaan - Sakshi

బాహుబలి తరువాత సాహో సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ ఆ సినిమా రిలీజ్‌ కాకముందే మరో ప్రాజెక్ట్‌ను టైల్‌లో పెట్టాడు. జిల్‌ ఫేం రాధకృష్ణ దర్శకత్వంలో ఓ పీరియాడిక్‌ రొమాంటిక్‌ డ్రామాలో నటిస్తున్నాడు. ఇటీవల ఈ సినిమా షూటింగ్ ఇటలీలో ప్రారంభమైంది. ప్రభాస్‌ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నారు.

ఎక్కువ భాగం విదేశాల్లో తెరకెక్కనున్న ఈ సినిమాకు ముందుగా అమోల్‌ (ప్రేమ) అనే ఫ్రెంచ్‌ పదాన్ని టైటిల్‌గా ఫిక్స్‌ చేశారన్న ప్రచారం జరిగింది. అయితే తాజాగా మరో టైటిల్‌ తెరమీదకు వచ్చింది. రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ కావటంతో ఈ సినిమాకు ‘జాన్‌’ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారట. డార్లింగ్‌ ఇమేజ్‌ ఉన్న ప్రభాస్‌కు ఈ టైటిల్‌ అయితే కరెక్ట్ అని భావిస్తున్నారట చిత్రయూనిట్‌. అయితే ఇంత వరకు చిత్రయూనిట్ నుంచి టైటిల్‌ విషయంలో ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement