
సాక్షి, అమరావతి: ఎల్లో బ్యాచ్ పైత్యం మరోస్థాయికి చేరింది. తాటికాయంత అక్షరాలతో హెడింగ్స్ పెట్టి తమ దగ్గర తప్పుడు కంటెంట్ విరివిగా లభించును అన్న చందంగా బ్యానర్ స్టోరీలు వండివార్చడం ఈనాడు, ఆంధ్రజ్యోతికి కొత్తకాదు. కానీ, రోజురోజుకు శృతిమించుతున్న వారి రోతరాతలపై పాఠకులు ముక్కున వేలేసుకుంటున్నారు.
తాజాగా ఆంధ్రజ్యోతి మొదటి పేజీలో వచ్చిన కథనాలు పచ్చపైత్యానికి రుజువులుగా నిలిచాయి. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సర్కార్‌పై బురద జల్లడమే పనిగా పెట్టుకున్న రాధాకృష్ణ అడ్డంగా దొరికిపోయారు. తప్పుడు కథనాల తీరును ఎండగడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వేదికగా కౌంటర్ అటాక్ చేసింది.
‘పులిహోర కథనాలు వండి వార్చడం అంటే ఏంటో ఇవాళ్టి రాధాకృష్ణ చంధ్రజ్యోతిలో రాసిన కథనాలను చూస్తే అర్థమవుతుంది. ఒకేరోజు వార్తలు కథనాలు.. వాటికి ఏమాత్రం పొంతన లేకుండా అబద్ధపు రాతలు రాశారు’ అంటూ ఓ వీడియోను ట్వీట్ చేసింది. సోషల్ మీడియా వేదికగా పలువురు నెటిజన్లు కూడా అబద్ధపు రాతల కథనాలపై ఆంధ్రజ్యోతిని ట్రోల్ చేస్తున్నారు.
చదవండి: అసభ్యకర పోస్టులు.. సోషల్ మీడియా కట్టడి అవసరం: వాసిరెడ్డి పద్మ
పులిహోర కథనాలు వండి వార్చడం అంటే ఏంటో ఇవాళ్టి రాధాకృష్ణ చంధ్రజ్యోతిలో రాసిన కథనాలను చూస్తే అర్థమవుతుంది. ఒకేరోజు వార్తలు కథనాలు.. వాటికి ఏమాత్రం పొంతన లేకుండా అబద్ధపు రాతలు రాశారు.#BanYellowMediaSaveAP#EndOfTDP pic.twitter.com/62HuEOMQ2R
— YSR Congress Party (@YSRCParty) June 30, 2023
Comments
Please login to add a commentAdd a comment