
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ఏబీఎన్ అసత్యాలు ప్రచారం చేస్తోందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని నిప్పులు చెరిగారు. ఆదివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఏబీఎన్ రాధాకృష్ణ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబును అధికారంలోకి తీసుకురావాలన్న కాంక్షతో పిచ్చి రాతలు రాస్తున్నారని దుయ్యబట్టారు. ‘‘చంద్రబాబు తన కుటుంబసభ్యులను కూడా నమ్మరు. అధికారం కోసం క్షుద్ర పూజలు చేసిన దుర్మార్గుడు చంద్రబాబు’’ అంటూ కొడాలి నాని ధ్వజమెత్తారు.
గత పదేళ్లుగా వైఎస్ జగన్ వ్యక్తిత్వంపై ఎల్లో మీడియా దాడులు చేస్తోందని.. పార్టీలో చేరడానికి కండిషన్స్ పెట్టే దుస్థితి సీఎం జగన్‌కు లేదన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్‌లో అందరూ స్వచ్చందంగానే చేరారని.. ఎల్లో మీడియా పిచ్చిరాతలు రాస్తే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. కోర్టుల్లో పరువునష్టం దావా వేస్తామని మంత్రి హెచ్చరించారు. ‘‘వైఎస్ జగన్ ఆత్మస్థైర్యాన్ని ఎవరూ దెబ్బతీయలేరు. వైఎస్సార్, వైఎస్ జగన్‌ను తక్కువ చేయాలని తప్పుడు రాతలు రాసి.. ప్రజల్లో క్రెడిబిలిటి రాధాకృష్ణ పోగొట్టుకున్నాడు. ప్రజల గుండెల్లో వైఎస్ఆర్, వైఎస్ జగన్ ఉన్నతస్థాయిలో ఉన్నారని’’ మంత్రి నాని అన్నారు.
రాష్ట్రంలో సీఎం జగన్ సంక్షేమ పాలన సాగుతోందని.. అది చూసి ఓర్వలేక ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు. మూడు నెలలకోసారి ఏపీకి వచ్చే చంద్రబాబుకు పబ్లిసిటీ కోసం దీక్షలు చేయడం అలవాటేనని’’ మంత్రి కొడాలి నాని ఎద్దేవా చేశారు.
చదవండి: రామోజీ హోటళ్లలో విదేశీ మద్యం అమ్మొచ్చా?
‘లోకేశ్.. మీరు పరీక్షలు కరెక్టుగా రాసి పాసయ్యారా?’
Comments
Please login to add a commentAdd a comment