సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో 240 మద్యం బ్రాండ్లకు పర్మిషన్లు ఇచ్చిన నీచ ఘనత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుది అని మంత్రి కొడాలి నాని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చీప్ లిక్కర్‌ను భారతదేశంలో కనిపెట్టిన చీప్ ముఖ్యమంత్రి చంద్రబాబు అని మండిపడ్డారు. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తే చంద్రబాబు అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే మళ్లీ లిక్కర్‌ను రాష్ట్రంలో ప్రవేశ పెట్టిన 420 చంద్రబాబు నాయుడని విమర్శించారు.
అదే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయ్యాక 45వేల బెల్ట్ షాప్‌లను రద్దు చేసినట్లు తెలిపారు. అదే విధంగా బడులు, దేవాలయాల వద్ద ఉన్న వైన్స్ షాపులను తీసేయించిన ఘనత సీఎం జగన్‌ది అని కొనియాడారు. చంద్రబాబు అల్జీమర్స్‌తో బాధపడుతున్నారని చంద్రబాబు రాష్ట్రాన్ని పాలించడం మన దురదృష్టకరమని విమర్శించారు. టీడీపీని ఎవరు పట్టుకుంటే వారు సర్వనాశనం అవుతారన్నారు. తెలంగాణలో టీడీపీకి ఏ గతి పట్టిందో ఏపీలో అదే గతి పడుతుందని మంత్రి కొడాలి నాని విమర్శించారు. టీడీపీ నాయకులు పార్టీ మారాలని, లేదా తమ నాయకుడిని అయినా మార్చుకోవాలని హితవు పలికారు.
Comments
Please login to add a commentAdd a comment