
సాక్షి, అమరావతి: ఎన్టీఆర్ చావుకు కారణమైన దుర్మార్గుడు చంద్రబాబు అంటూ మంత్రి కొడాలి నాని నిప్పులు చెరిగారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఎన్టీఆర్ బొమ్మ పెట్టుకుని మళ్లీ ప్రజలను మోసం చేసేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎన్టీఆర్‌ను చెప్పులతో కొట్టించిన ఘనత చంద్రబాబుది. చంద్రబాబుకు ఎన్టీఆర్‌పై ఎలాంటి ప్రేమలేదు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ చిత్తు చిత్తుగా ఓడిపోతుందని తెలిసి.. మళ్లీ ఎన్టీఆర్ నామజపం చేస్తున్నారు. ఎన్టీఆర్ మోసం చేసిన వీళ్లను ఏమన్నాలి?. ఎన్టీఆర్ పేరెత్తే అర్హత వీళ్లకు లేదని’’ కొడాలి నాని ధ్వజమెత్తారు.
చదవండి: అవసాన దశలో టీడీపీ: సజ్జల రామకృష్ణారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment