కిడ్నాప్‌ చేసి.. బెదిరించి  | Kidnapping case against former OSD Radhakishan Rao | Sakshi
Sakshi News home page

కిడ్నాప్‌ చేసి.. బెదిరించి 

Published Thu, Apr 11 2024 4:23 AM | Last Updated on Thu, Apr 11 2024 4:23 AM

Kidnapping case against former OSD Radhakishan Rao - Sakshi

మాజీ ఓఎస్డీ రాధాకిషన్‌రావుపై కిడ్నాప్‌ కేసు 

సహ నిందితులుగా ఇన్‌స్పెక్టర్లు గట్టుమల్లు, మల్లికార్జున్‌ 

క్రియా హెల్త్‌కేర్‌ అధినేత వేణుమాధవ్‌ను నిర్బంధించి, 

రూ. 10 లక్షలు వసూలు చేశారని ఆరోపణ 

వేణు నుంచి సంస్థ షేర్లు లాక్కుని యాజమాన్య మార్పిడి 

అయిదేళ్ల క్రితమే జరిగినా.. తాజా పరిణామాలతో ధైర్యం తెచ్చుకుని ఫిర్యాదు 

పీటీ వారెంట్‌ దాఖలు చేయాలని అధికారుల నిర్ణయం 

ట్యాపింగ్‌ కేసులో రాధాకిషన్‌రావు పోలీసు కస్టడీ పూర్తి 

సాక్షి, హైదరాబాద్‌/బంజారాహిల్స్‌: అక్రమ ఫోన్‌ ట్యాపింగ్, బెదిరింపు వసూళ్లు ఆరోపణలపై అరెస్టయిన హైదరాబాద్‌ టాస్‌్కఫోర్స్‌ మాజీ ఆఫీసర్‌ ఆన్‌ స్పెషల్‌ డ్యూటీ (ఓఎస్డీ) పి.రాధాకిషన్‌రావుపై జూబ్లీహిల్స్‌ ఠాణాలో కిడ్నాప్‌ కేసు నమోదైంది. క్రియా హెల్త్‌కేర్‌ వివాదంలో తలదూర్చి దాని డైరెక్టర్‌ వేణుమాధవ్‌ చెన్నుపాటిని కిడ్నాప్‌ చేసి, షేర్లు, యాజమాన్య బదిలీ చేయించడంతో పాటు రూ.10 లక్షలు వసూలు చేసిన ఆరోపణలపై దీన్ని రిజిస్టర్‌ చేశారు.

ఈ కేసులో ఇన్‌స్పెక్టర్లు బి.గట్టుమల్లు, ఎస్‌.మల్లికార్జున్‌ సైతం నిందితులుగా ఉన్నారు. ఇది సోమవారమే రిజిస్టర్‌ కాగా... బుధ వారం వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే రాధాకిషన్‌రావుపై కూకట్‌పల్లి ఠాణాలో బెదిరింపుల కేసు నమోదైన విషయం విదితమే. మరోపక్క అక్రమ ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ఆయన పోలీసు కస్టడీ బుధవారంతో ముగిసింది. వారం రోజుల పాటు ఆయ న్ను వివిధ కోణాల్లో ప్రశ్నించిన సిట్‌ అధికారులు కీలక సమాచారం సేకరించినట్లు తెలిసింది. 

వ్యాపారవేత్త వేణును ఎలా ట్రాప్‌ చేశారంటే.. 
నగరానికి చెందిన వేణుమాధవ్‌ చెన్నుపాటి ప్రపంచ బ్యాంక్‌లో కొన్నాళ్లు పని చేసిన తర్వాత 2008లో తిరిగి వచ్చి 2011లో క్రియా హెల్త్‌కేర్‌ సంస్థను స్థాపించారు. 2014లో ఉమ్మడి రాష్ట్రంలో 165 పట్టణ ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు, టెలి మెడిసిన్‌ సౌకర్యాలు, అత్యవసర వాహనాలతో సహా ప్రధాన ప్రాజెక్టులను ఈ సంస్థ నిర్వహించేది. 2016 నాటికి క్రియా హెల్త్‌కేర్‌ మూడు ప్రధాన ప్రాజెక్ట్‌లను చేజి క్కించుకుని ఐదేళ్లల్లో తమ ప్రాజెక్టు విలువను రూ.250 కోట్లకు పెంచుకుంది.

ఇది జరిగిన కొన్నాళ్లకు గోపాల్, రాజ్, నవీన్, రవి క్రియాలో పార్ట్‌ టైమ్‌ డైరెక్టర్లుగా చేరారు. 2015లో బాలాజీ ఈ సంస్థకు సీఈఓగా నియమితులయ్యారు. 2016–17 ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి క్రియా హెల్త్‌కేర్‌లో ఆరుగురు డైరెక్టర్లు ఉండగా... వేణు 60, బాలాజీ 20, గోపాల్‌ 10, రాజ్‌ 10 శాతం చొప్పున షేర్లు కలిగి ఉన్నారు. వీరిలో వేణు, బాలాజీ మాత్రమే ఫుల్‌టైమ్‌ డైరెక్టర్లు. 2018లో ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం నాన్‌ ఎమర్జెన్సీ మొబైల్‌ హెల్త్‌కేర్‌ క్లినిక్‌ల ఏర్పాటుకు బిడ్డింగ్‌కు పిలిచింది.

అందులో పాల్గొన్న క్రియా హెల్త్‌కేర్‌ 1500 మొబైల్‌ అంబులెన్స్‌ హెల్త్‌ క్లినిక్‌లను నడిపే ప్రాజెక్టును తీసుకునే ముందు కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ సంస్థ పార్ట్‌టైమ్‌ డైరెక్టర్లు నలుగురూ వేణుకు ఉన్న 60 శాతం షేర్లను తక్కువ విలువకు విక్రయించాలని పట్టుబట్టారు. సీఈఓ బాలాజీని కూడా వారి వైపు తిప్పుకున్నారు.  

రాధాకిషన్‌రావు తనదైన శైలిలో బెదిరించి.. 
అక్కడ రాధాకిషన్‌రావు ప్రోద్బలంతో అప్పటి వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ గట్టుమల్లు తీవ్రస్థాయిలో వేణును బెదిరించారు. దాదాపు రూ.100 కోట్ల విలువైన క్రియా హెల్త్‌కేర్‌ కంపెనీలోని షేర్లు, యాజమాన్యం వదులుకోవాలని హెచ్చరించారు.

రాధాకిషన్‌రావుతో పాటు ఇతర నిందితుల సమక్షంలో నాటకీయ పరిణామాల మధ్య తుపాకులు, కర్రలతో బెదిరించడంతో గత్యంతరం లేక వేణు సెటిల్‌మెంట్‌ అగ్రిమెంట్‌పై సంతకం చేయాల్సి వచ్చింది. వేణు నుంచి రూ.10 లక్షలు వసూలు చేసి గట్టుమల్లు, మల్లికార్జున్‌తో కూడిన బృందం ఈ విషయాన్ని పోలీసులు, మీడియా, కోర్టుల్లో ఎవరి దృష్టికి తీసుకువెళ్లినా ప్రాణహాని ఉంటుందని హెచ్చరించి పంపింది. 

తాజా పరిణామాలతో ధైర్యం తెచ్చుకుని ఫిర్యాదు 
ప్రాణభయంతో ఇన్నాళ్లు మిన్నకుండిపోయిన వేణుమాధవ్‌కు ఇటీవల రాధాకిషన్‌రావు అరెస్టు విషయం తెలిసి ధైర్యంగా ముందుకు వచ్చి  జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా అధికారులు రాధాకిషన్‌రావు, చంద్రశేఖర్‌ వేగే, గట్టుమల్లు, మల్లికార్జున్, కృష్ణ, గోపాల్, రాజ్, రవి, బాలాజీ తదితరులపై ఐపీసీలోని 386, 365, 341, 120 (బీ), రెడ్‌ విత్‌ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఈ కేసులో రాధాకిషన్‌రావుపై కోర్టు ద్వారా పీటీ వారెంట్‌ తీసుకుని అరెస్టు చేయాలని భావిస్తున్నారు. ప్రస్తుతం గట్టుమల్లు రాచకొండ ఐటీ సెల్‌లో, మల్లికార్జున్‌ ఎస్‌ఐబీలో ఇన్‌స్పెక్టర్లుగా పని చేస్తున్నారు. మల్లికార్జున్‌ సుదీర్ఘకాలం వెస్ట్‌జోన్‌ టాస్‌్కఫోర్స్‌లో ఎస్సైగా పని చేశారు. పదోన్నతి తర్వాత రాధాకిషన్‌రావు సిఫార్సుతోనే ప్రభాకర్‌రావు ఎస్‌ఐబీలోకి తీసుకున్నారు. 

రూ.40కోట్ల షేర్లను రూ.40 లక్షలకే బదిలీ చేయించుకుని ..
ఇదిలా ఉండగా.. గోల్డ్‌ ఫిష్‌ అబోడ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వేగే చంద్రశేఖర్‌ తన కంపెనీలో పెట్టుబడి కోసం 2018 మార్చిలో వేణుమాధవ్‌ను సంప్రదించారు. ఆ సందర్భంలోనే క్రియా హెల్త్‌కేర్‌ వివాదాలు తెలుసుకుని, పార్ట్‌టైమ్‌ డైరెక్టర్లతో మాట్లాడి విషయం సెటిల్‌ చేస్తానని చెప్పారు. ఇలా మార్కెట్‌లో రూ.40 కోట్ల విలువైన షేర్లను కేవలం రూ.40 లక్షలకే వేణు నుంచి బదిలీ చేయించుకున్నారు. నలుగురు పార్ట్‌టైమ్‌ డైరెక్టర్లతో అతడు మరో రహస్య ఒప్పందం కేసుకుని తనను మోసం చేసినట్లు వేణుకు తర్వాత తెలిసింది.

వేణు మాధవ్‌ తన నలుగురు పార్ట్‌టైమ్‌ డైరెక్టర్ల వేధింపులపై 2018 అక్టోబర్‌ 3న జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అదే నెల 12 నుంచి నలుగురి నుంచి వేణుకు వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. ఉత్తరప్రదేశ్‌లో ప్రాజెక్టు ప్రారంభించడానికి గడువు సమీపిస్తుండటంతో 2018 నవంబర్‌లో చంద్రశేఖర్‌ వేగే, గోపాల్, రాజ్‌ తలసిల, నవీన్, రవి అప్పటి టాస్‌్కఫోర్స్‌ డీసీపీ పి.రాధా కిషన్ రావును ఆశ్రయించారు.

కంపెనీకి సంబంధించిన మిగిలిన షేర్లనూ తమకు ఇప్పించమని వీళ్లు కోరా రు. దీంతో రాధాకిషన్‌రావు, అప్పటి టాస్‌్క ఫోర్స్‌ ఎస్సై మల్లికార్జున్‌ అదే నెల 22న ఉద యం 5.30 గంటలకు వేణును తమ సిబ్బందితో కలిసి కిడ్నాప్‌ చేసి సికింద్రాబాద్‌లోని టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయానికి తరలించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement