venumadhav
-
వేణుమాధవ్‌తో ఉన్న ఈ అబ్బాయిని గుర్తుపట్టారా? అబ్బో రచ్చ లేపే కమెడియన్! (ఫోటోలు)
-
TG: ఎవరా పెద్ద సారు?
సాక్షి, హైదరాబాద్: పోలీసు విభాగంలో డీజీపీ కార్యాలయాన్ని మించిన ఉన్నత విభాగం (టాప్ ఆఫీస్) మరొకటి లేదు. ఆ కార్యాలయం నుంచి వచ్చే ఆదేశాలు ఎవరైనా పాటించాల్సిందే. కానీ గతంలో ఓ ఉన్నతాధికారి (హయ్యర్ అప్) ఇందుకు విరుద్ధంగా వ్యవహరించారా? అంటే.. క్రియ హెల్త్ కేర్ డైరెక్టర్ వేణుమాధవ్ చెన్నుపాటి కిడ్నాప్ కేసును పరిశీలిస్తే అవుననే సమాధానమే లభిస్తోంది. అదే సమయంలో ఎవరా ఉన్నతాధికారి? అనే సందేహం కలుగుతోంది. కృష్ణారావు ద్వారా హయ్యర్ అప్ వద్దకు.. హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసుస్టేషన్లో రిజిస్టర్ అయిన ఈ కేసులో హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ మాజీ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ) పి.రాధాకిషన్‌రావు, ఇన్స్పెక్టర్లు బి.గట్టుమల్లు, ఎస్.మల్లికార్జున్ తదితరులు నిందితులుగా ఉన్న విషయం తెలిసిందే. ఈ కిడ్నాప్ కేసులో ఐదో నిందితుడిగా ఉన్న కృష్ణారావు అలియాస్ కృష్ణ పాత్ర కీలకమని తెలుస్తోంది. ఈయన గతంలో ఓ మీడియా చానల్లో కీలక స్థానంలో పని చేశారు. అప్పట్లోనే పలువురు పోలీసు ఉన్నతాధికారులతో పరిచయాలు ఏర్పడ్డాయి. అలాంటి వారిలో ఈ ‘హయ్యర్ అప్’కూడా ఒకరని సమాచారం. వేణు మాధవ్‌ను కిడ్నాప్ చేసి, తీవ్ర స్థాయిలో బెదిరించి, పత్రాలపై సంతకాలు చేయించుకుని క్రియా హెల్త్ కేర్ సంస్థను చేజిక్కించుకోవాలని దాని పార్ట్‌టైమ్ డైరెక్టర్లు గోపాల్, రాజ్ తలసిల, నవీన్, రవి... గోల్డ్ ఫిష్ అబోడ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ చంద్రశేఖర్ వేగేతో కలిసి కుట్ర పన్నారు. కృష్ణారావు అనేక మంది పోలీసు ఉన్నతాధికారులకు సన్నిహితుడని తెలిసిన చంద్రశేఖర్ ఆయన్ను సంప్రదించాడని, కృష్ణారావు ద్వారానే హయ్యర్ అప్ వరకు ఈ వ్యవహారం వెళ్లిందని సమాచారం. కాగా విషయం సెటిల్ చేయడానికి రూ.10 కోట్లకు డీల్ మాట్లాడుకున్న ఆ పెద్ద సారు.. పని పూర్తి చేసే బాధ్యతల్ని రాధాకిషన్‌రావు, గట్టు మల్లులకు అప్పగించినట్లు, దీంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. డీజీపీ కార్యాలయం గట్టు మల్లుకు ఫోన్ సిట్ సమాచారం మేరకు.. 2018 నవంబర్ 22న ఉదయం 5.30 గంటలకు అప్పట్లో టాస్క్‌ఫోర్స్ ఎస్సైగా పని చేస్తున్న మల్లికార్జున్.. వేణుమాధవ్‌ను తన బృందంతో కిడ్నాప్ చేసి సికింద్రాబాద్‌లోని టాస్క్‌ఫోర్స్ కార్యాలయానికి తరలించాడు. అక్కడ రాధాకిషన్‌రావు ప్రోద్భలంతో అప్పటి వెస్ట్‌జోన్ టాస్‌్కఫోర్స్ ఇన్స్పెక్టర్ గట్టు మల్లు తీవ్రస్థాయిలో వేణును బెదిరించాడు. అతి కష్టంమ్మీద తన ఫోన్ దక్కించుకున్న వేణుమాధవ్ టాస్క్‌ఫోర్స్ కార్యాలయం నుంచే తొలుత తన న్యాయవాది శ్రీనివాస్‌కు ఫోన్ చేసి విషయం చెప్పారు. ఆయన కోర్టులో తేల్చుకుందాం అన్నారు. తర్వాత తన స్నేహితుడైన లహరి రిసార్ట్స్ యజమాని సంజయ్‌ను వేణు సంప్రదించారు. దీంతో డీజీపీ కార్యాలయానికి వెళ్లిన సంజయ్ అక్కడ నుంచి గట్టు మల్లుకు ఫోన్ చేయించారు. ఆ కాల్ అందుకున్న రాధాకిషన్ రావు మాటాడుతూ.. ఇది ఉన్నతాధికారే అప్పగించిన విషయని చెప్పడంతో డీజీపీ కార్యాలయం చేతులెత్తేసింది. దీంతో రాధాకిషన్‌రావు, గట్టు మల్లు, మల్లికార్జున్ తదితరులు వేణుమాధవ్‌తో పత్రాలపై సంతకాలు చేయించి క్రియా హెల్త్‌కేర్‌లో షేర్లు, ఆయన యాజమాన్యం మార్పు చేశారు. ఆ నలుగురి వాంగ్మూలాలు కీలకమే.. వేణును తీవ్రస్థాయిలో భయపెట్టడానికి ఉగ్రవాదం, మనీలాండరింగ్ కేసులు నమోదు చేస్తామంటూ టాస్క్‌ఫోర్స్ పోలీసులు బెదిరించారు. ఇందుకు సంబంధించి రాధాకిషన్‌రావు సహా తొమ్మిది మందిపై కేసు నమోదైంది. వేణు మాధవ్ తన నలుగురు పార్ట్‌టైమ్ డైరెక్టర్ల వేధింపులపై 2018 అక్టోబర్ 3న జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అదే నెల 12 నుంచి నలుగురి నుంచి వేణుకు వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. అయితే ఈ ఫిర్యాదును పోలీసులు పట్టించుకోకపోవడంతో అప్పటి బంజారాహిల్స్ ఏసీపీని కలిసి న్యాయం చేయమని కోరినా ఫలితం దక్కలేదు. ఈ ఫిర్యాదు విషయంలో పోలీసుల ఉదాశీన వైఖరికి కారణం తెలియాలంటే నాటి బంజారాహిల్స్ ఏసీపీని పిలిచి విచారించాల్సి ఉంది. ముఖ్యంగా డీజీపీ కార్యాలయం, హయ్యర్ అప్‌తో పాటు న్యాయవాది శ్రీనివాస్, లహరి రిసార్ట్స్ యజమాని సంజయ్‌ల నుంచీ వాంగ్మూలాలు సేకరించాలి. అయితే డీజీపీ కార్యాలయం, ‘హయ్యర్ అప్ విషయంలో సిట్ అధికారులు ఏ విధంగా ముందుకు వెళ్తారన్నది వేచి చూడాల్సి ఉంది. సిట్ అదుపులో ఇన్స్పెక్టర్ మల్లికార్జున్ రాధాకిషన్‌రావు ఇప్పటికే అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టై, జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు. దీంతో ఆయన్ను కిడ్నాప్ కేసులో పీటీ వారెంట్‌పై అరెస్టు చేసి, కోర్టు అనుమతితో పోలీసు కస్టడీలోకి తీసుకోవాలని జూబ్లీహిల్స్ పోలీసులు, సిట్ అధికారులు నిర్ణయించారు. మరోపక్క ఇదే కేసులో నిందితుడిగా ఉన్న నాటి టాస్క్‌ఫోర్స్ ఎస్సై, ప్రస్తుతం స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో (ఎస్ఐబీ) ఇన్స్పెక్టర్గా పని చేస్తున్న మల్లికార్జున్‌ను సిట్ అధికారులు శుక్రవారం అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. -
కిడ్నాప్ చేసి.. బెదిరించి
సాక్షి, హైదరాబాద్/బంజారాహిల్స్: అక్రమ ఫోన్ ట్యాపింగ్, బెదిరింపు వసూళ్లు ఆరోపణలపై అరెస్టయిన హైదరాబాద్ టాస్‌్కఫోర్స్ మాజీ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ) పి.రాధాకిషన్‌రావుపై జూబ్లీహిల్స్ ఠాణాలో కిడ్నాప్ కేసు నమోదైంది. క్రియా హెల్త్‌కేర్ వివాదంలో తలదూర్చి దాని డైరెక్టర్ వేణుమాధవ్ చెన్నుపాటిని కిడ్నాప్ చేసి, షేర్లు, యాజమాన్య బదిలీ చేయించడంతో పాటు రూ.10 లక్షలు వసూలు చేసిన ఆరోపణలపై దీన్ని రిజిస్టర్ చేశారు. ఈ కేసులో ఇన్స్పెక్టర్లు బి.గట్టుమల్లు, ఎస్.మల్లికార్జున్ సైతం నిందితులుగా ఉన్నారు. ఇది సోమవారమే రిజిస్టర్ కాగా... బుధ వారం వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే రాధాకిషన్‌రావుపై కూకట్పల్లి ఠాణాలో బెదిరింపుల కేసు నమోదైన విషయం విదితమే. మరోపక్క అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన పోలీసు కస్టడీ బుధవారంతో ముగిసింది. వారం రోజుల పాటు ఆయ న్ను వివిధ కోణాల్లో ప్రశ్నించిన సిట్ అధికారులు కీలక సమాచారం సేకరించినట్లు తెలిసింది. వ్యాపారవేత్త వేణును ఎలా ట్రాప్ చేశారంటే.. నగరానికి చెందిన వేణుమాధవ్ చెన్నుపాటి ప్రపంచ బ్యాంక్‌లో కొన్నాళ్లు పని చేసిన తర్వాత 2008లో తిరిగి వచ్చి 2011లో క్రియా హెల్త్‌కేర్ సంస్థను స్థాపించారు. 2014లో ఉమ్మడి రాష్ట్రంలో 165 పట్టణ ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు, టెలి మెడిసిన్ సౌకర్యాలు, అత్యవసర వాహనాలతో సహా ప్రధాన ప్రాజెక్టులను ఈ సంస్థ నిర్వహించేది. 2016 నాటికి క్రియా హెల్త్‌కేర్ మూడు ప్రధాన ప్రాజెక్ట్‌లను చేజి క్కించుకుని ఐదేళ్లల్లో తమ ప్రాజెక్టు విలువను రూ.250 కోట్లకు పెంచుకుంది. ఇది జరిగిన కొన్నాళ్లకు గోపాల్, రాజ్, నవీన్, రవి క్రియాలో పార్ట్ టైమ్ డైరెక్టర్లుగా చేరారు. 2015లో బాలాజీ ఈ సంస్థకు సీఈఓగా నియమితులయ్యారు. 2016–17 ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి క్రియా హెల్త్‌కేర్‌లో ఆరుగురు డైరెక్టర్లు ఉండగా... వేణు 60, బాలాజీ 20, గోపాల్ 10, రాజ్ 10 శాతం చొప్పున షేర్లు కలిగి ఉన్నారు. వీరిలో వేణు, బాలాజీ మాత్రమే ఫుల్‌టైమ్ డైరెక్టర్లు. 2018లో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నాన్ ఎమర్జెన్సీ మొబైల్ హెల్త్‌కేర్ క్లినిక్‌ల ఏర్పాటుకు బిడ్డింగ్‌కు పిలిచింది. అందులో పాల్గొన్న క్రియా హెల్త్‌కేర్ 1500 మొబైల్ అంబులెన్స్ హెల్త్ క్లినిక్‌లను నడిపే ప్రాజెక్టును తీసుకునే ముందు కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ సంస్థ పార్ట్‌టైమ్ డైరెక్టర్లు నలుగురూ వేణుకు ఉన్న 60 శాతం షేర్లను తక్కువ విలువకు విక్రయించాలని పట్టుబట్టారు. సీఈఓ బాలాజీని కూడా వారి వైపు తిప్పుకున్నారు. రాధాకిషన్‌రావు తనదైన శైలిలో బెదిరించి.. అక్కడ రాధాకిషన్‌రావు ప్రోద్బలంతో అప్పటి వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ గట్టుమల్లు తీవ్రస్థాయిలో వేణును బెదిరించారు. దాదాపు రూ.100 కోట్ల విలువైన క్రియా హెల్త్‌కేర్ కంపెనీలోని షేర్లు, యాజమాన్యం వదులుకోవాలని హెచ్చరించారు. రాధాకిషన్‌రావుతో పాటు ఇతర నిందితుల సమక్షంలో నాటకీయ పరిణామాల మధ్య తుపాకులు, కర్రలతో బెదిరించడంతో గత్యంతరం లేక వేణు సెటిల్మెంట్ అగ్రిమెంట్‌పై సంతకం చేయాల్సి వచ్చింది. వేణు నుంచి రూ.10 లక్షలు వసూలు చేసి గట్టుమల్లు, మల్లికార్జున్‌తో కూడిన బృందం ఈ విషయాన్ని పోలీసులు, మీడియా, కోర్టుల్లో ఎవరి దృష్టికి తీసుకువెళ్లినా ప్రాణహాని ఉంటుందని హెచ్చరించి పంపింది. తాజా పరిణామాలతో ధైర్యం తెచ్చుకుని ఫిర్యాదు ప్రాణభయంతో ఇన్నాళ్లు మిన్నకుండిపోయిన వేణుమాధవ్‌కు ఇటీవల రాధాకిషన్‌రావు అరెస్టు విషయం తెలిసి ధైర్యంగా ముందుకు వచ్చి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా అధికారులు రాధాకిషన్‌రావు, చంద్రశేఖర్ వేగే, గట్టుమల్లు, మల్లికార్జున్, కృష్ణ, గోపాల్, రాజ్, రవి, బాలాజీ తదితరులపై ఐపీసీలోని 386, 365, 341, 120 (బీ), రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో రాధాకిషన్‌రావుపై కోర్టు ద్వారా పీటీ వారెంట్ తీసుకుని అరెస్టు చేయాలని భావిస్తున్నారు. ప్రస్తుతం గట్టుమల్లు రాచకొండ ఐటీ సెల్లో, మల్లికార్జున్ ఎస్ఐబీలో ఇన్స్పెక్టర్లుగా పని చేస్తున్నారు. మల్లికార్జున్ సుదీర్ఘకాలం వెస్ట్‌జోన్ టాస్‌్కఫోర్స్‌లో ఎస్సైగా పని చేశారు. పదోన్నతి తర్వాత రాధాకిషన్‌రావు సిఫార్సుతోనే ప్రభాకర్‌రావు ఎస్ఐబీలోకి తీసుకున్నారు. రూ.40కోట్ల షేర్లను రూ.40 లక్షలకే బదిలీ చేయించుకుని .. ♦ ఇదిలా ఉండగా.. గోల్డ్ ఫిష్ అబోడ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వేగే చంద్రశేఖర్ తన కంపెనీలో పెట్టుబడి కోసం 2018 మార్చిలో వేణుమాధవ్‌ను సంప్రదించారు. ఆ సందర్భంలోనే క్రియా హెల్త్‌కేర్ వివాదాలు తెలుసుకుని, పార్ట్‌టైమ్ డైరెక్టర్లతో మాట్లాడి విషయం సెటిల్ చేస్తానని చెప్పారు. ఇలా మార్కెట్లో రూ.40 కోట్ల విలువైన షేర్లను కేవలం రూ.40 లక్షలకే వేణు నుంచి బదిలీ చేయించుకున్నారు. నలుగురు పార్ట్‌టైమ్ డైరెక్టర్లతో అతడు మరో రహస్య ఒప్పందం కేసుకుని తనను మోసం చేసినట్లు వేణుకు తర్వాత తెలిసింది. వేణు మాధవ్ తన నలుగురు పార్ట్‌టైమ్ డైరెక్టర్ల వేధింపులపై 2018 అక్టోబర్ 3న జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అదే నెల 12 నుంచి నలుగురి నుంచి వేణుకు వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. ఉత్తరప్రదేశ్‌లో ప్రాజెక్టు ప్రారంభించడానికి గడువు సమీపిస్తుండటంతో 2018 నవంబర్‌లో చంద్రశేఖర్ వేగే, గోపాల్, రాజ్ తలసిల, నవీన్, రవి అప్పటి టాస్‌్కఫోర్స్ డీసీపీ పి.రాధా కిషన్ రావును ఆశ్రయించారు. కంపెనీకి సంబంధించిన మిగిలిన షేర్లనూ తమకు ఇప్పించమని వీళ్లు కోరా రు. దీంతో రాధాకిషన్‌రావు, అప్పటి టాస్్క ఫోర్స్ ఎస్సై మల్లికార్జున్ అదే నెల 22న ఉద యం 5.30 గంటలకు వేణును తమ సిబ్బందితో కలిసి కిడ్నాప్ చేసి సికింద్రాబాద్‌లోని టాస్క్‌ఫోర్స్ కార్యాలయానికి తరలించారు. -
‘ధిక్కరణ’ వేయండి.. చర్యలు తీసుకుంటాం
సాక్షి, హైదరాబాద్: గతేడాది రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం జారీ చేసిన ఆదేశాలను ఉల్లంఘించి హుస్సేన్‌సాగర్‌లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్(పీఓపీ)తో తయారు చేసిన వినాయక విగ్రహాలను నిమజ్జనం చేశారన్న ఆధారాలుంటే...ధిక్కరణ పిటిషన్ వేయాలని న్యాయవాది వేణుమాధవ్‌ను హైకోర్టు ఆదేశించింది. సరైన ఆధారాలతో పిటిషన్ వేస్తే చర్యలు తీసుకుంటామని వ్యాఖ్యానించింది. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన చిన్నచిన్న కొలనుల్లో మాత్రమే పీఓపీ విగ్రహాలను నిమజ్జనం చేయాలన్న మధ్యంతర ఉత్తర్వులు ఇంకా అమల్లోనే ఉన్నాయని పేర్కొంది. తదుపరి విచారణను ఈ నెల 25కు వాయిదా వేసింది. పీఓపీతో తయారు చేసే విగ్రహాలపై నిషేధం ఎత్తివేయాలని, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) నిబంధనలను కొట్టివేయాలని కోరుతూ ధూళ్‌పేటకు చెందిన తెలంగాణ గణేశ్‌మూర్తి కళాకా రుల సంక్షేమ సంఘంతో పాటు మరికొందరు హైకోర్టు లో 2022లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్వీ శ్రావణ్‌కుమార్ ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరఫున స్పెషల్ జీపీ హరేందర్ పరిషద్ వాదనలు వినిపిస్తూ.. పీవోపీ విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయలేదని, తాత్కాలిక కొలనుల్లో చేశామని తెలిపారు. ఈ క్రమంలో న్యాయవాది వేణుమాధవ్ వాదిస్తూ.. కోర్టు ఆదేశాలున్నా పీవోపీ విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌లోనే నిమజ్జనం చేశారని చెప్పారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. ఆధారాలతో పిటిషన్ వేస్తే చర్యలు తీసుకుంటామని పేర్కొంటూ, విచారణను వాయిదా వేసింది. -
వేణుమాధవ్ నన్ను బావా అని పిలిచేవాడు
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ మరణం ఇండస్ట్రీకి తీరని లోటని ప్రముఖ కథానాయకుడు, యాంగ్రీ స్టార్ రాజశేఖర్ అన్నారు. వేణుమాధవ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అతనితో తనకున్న అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. రాజశేఖర్ మాట్లాడుతూ.. ‘‘వేణుమాధవ్ మా కుటుంబానికి ఎంతో సన్నిహిత మిత్రుడు. నన్ను బావా అని, జీవితను అక్క అని పిలిచేవాడు. ప్రతి పండక్కి తప్పకుండా ఫోన్ చేసేవాడు. అంతకు ముందే మెసేజ్ చేసి విష్ చేసేవాడు. మేమంటే తనకు అంత అభిమానం, ప్రేమ. మేమిద్దరం కలిసి సుమారు పది చిత్రాల్లో నటించాం. ‘మనసున్న మారాజు’, ‘రాజ సింహం’, ‘ఒక్కడు చాలు’, ‘గోరింటాకు’ చిత్రాల్లో తన నటనకు, హాస్యానికి మంచి పేరు వచ్చింది. ప్రతి ఒక్కరినీ వరుసలు పెట్టి పిలుస్తూ కుటుంబంలా కలుపుకుని వెళ్లేవారు. అంత మంచి మనిషి ఇంత త్వరగా లోకాన్ని విడిచి వెళతాడని అనుకోలేదు. ‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్’ (మా) ఎన్నికల సమయంలోనే వేణుమాధవ్‌కి ఆరోగ్యం బాలేదట! కానీ, ఎవరికీ తెలియన్విలేదు. సాటి కళాకారుల కోసం ముందడుగు వేశాడు. ఎన్నికల్లో విజయం సాధించాడు. తర్వాత వ్యక్తిగతంగా కొన్ని కార్యక్రమాలకు హాజరు కాకపోయినా.. ‘మా’కు సంబంధించి ఏం వచ్చినా వెంటనే స్పందించేవాడు. తన అభిప్రాయం చెప్తాడు. గత వారం ఆయన హాస్పిటల్లో ఉంటే వెళ్లి కలిశాను. సోమవారం సాయంత్రం డిశార్జ్ అయ్యారు. మళ్లీ సీరియస్ అయిందని మంగళవారం అడ్మిట్ చేశారు. అందరినీ ఎన్నో ఏళ్లుగా నవ్వించి, నవ్వించి ఈ రోజు లోకాన్ని విడిచి వెళ్లి ఏడిపిస్తున్నారు’’ అని అన్నారు. -
వేణుమాధవ్ మృతి: చిరంజీవి దిగ్భ్రాంతి
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ హాస్య నటుడు వేణుమాధవ్ మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ‘వేణుమాధవ్ తొలిసారి నాతో కలిసి మాస్టర్ సినిమాలో నటించాడు. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి హాస్య నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకున్నాడు. కొన్ని పాత్రలు తనకోసమే పుట్టాయా అనేలా నటించేవాడు. ఆ పాత్రకే వన్నె తీసుకొచ్చేవాడు . వయసులో చిన్నవాడు. సినీ పరిశ్రమలో తనకింకా బోలెడంత భవిష్యత్తు ఉందని అనుకుంటున్న సమయంలో దేవుడు చిన్నచూపు చూశాడు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడ్ని ప్రార్ధిస్తున్నాను’ అని చిరంజీవి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అనారోగ్యం కారణంగా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వేణుమాధవ్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. -
ఒక్క అధికారి.. ఆరు బాధ్యతలు
రంగారెడ్డి, తాండూరు టౌన్ : ఒకే అధికారి.. ఆరు బాధ్యతలు అప్పగించారు. ఉన్న ఒకే ఒక్క ఉద్యోగానికి పూర్తి సమయాన్ని కేటాయిస్తేనే అనేక సమస్యలు మిగిలిపోతుంటాయి. మరి ఓ అధికారి ఆరు ఉద్యోగాలు ఒకేసారి చేయాలంటే ఎంత ఇబ్బందో ఆలోచించండి. ఈ విచిత్ర పరిస్థితి తాండూరు ఆర్డీఓ వేణుమాధవరావుకు ఎదురైంది. ఇప్పటికే ఆయన తాండూరు ఆర్డీఓగా, మున్సిపల్ ఇన్చార్జి కమిషనర్‌గా, మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. దీనికి తోడుగా వికారాబాద్ ఇన్చార్జి ఆర్డీఓగా, పరిగి, కొడంగల్ మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్‌గా అదనపు బాధ్యతలు చేపట్టారు. మొత్తం ఆరు ఉద్యోగాలను నిర్వర్తించడానికి వేణుమాధవరావు ఉన్నారు. ఈ బాధ్యతలతో వేణుమాధవరావు ఏ ఒక్క దానిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించడం లేదు. ఈయన ఒక్కరే పలు శాఖల అధికారులు కూడా తమ విధులతో పాటు అదనపు విధులు చేస్తున్నారు. ఒక అధికారి రిటైర్డ్ అవుతారని గానీ, ఒకరిని బదిలీ చేసినపుడు మరొకరిని నియమించకుండా ప్రభుత్వం ఉన్నవారికే ఇన్చార్జి బాధ్యతలు అప్పగించడంతో సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఒక అధికారికి ఇన్నేసి బాధ్యతలు అప్పగిస్తే దేనిపై దృష్టి సారిస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. -
ఎ టు ఎ
అమీర్‌పేట నుంచి ఎన్నో ఆశలతో అమెరికాలో అడుగుపెట్టాలనుకునే యువత ఆశయాలు ఏంటి? అమెరికా వెళ్లడానికి ఎలాంటి తిప్పలు పడ్డారు? అనే కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘ఎ టు ఎ’(అమీర్‌పేట టు అమెరికా). బ్రహ్మానందం, తనికెళ్ల, వేణు మాధవ్, వైవా హర్ష తదితరులు నటించారు. భానుకిరణ్ చల్లా దర్శకత్వంలో మదన్ కొమండూరి, పద్మజ కొమండూరి నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ చిత్రానికి కర్త, కర్మ, క్రియ అయిన రామ్మోహన్ కొమండూరి మాట్లాడుతూ– ‘‘యూత్‌ఫుల్ లవ్ అండ్ కామెడీ రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రమిది. ప్రీ ప్రొడక్షన్ నుంచి పోస్ట్ ప్రొడక్షన్ వరకూ నేను సహకారం అందించడంవల్ల కర్త, కర్మ, క్రియ అన్నాం. 80 శాతం చిత్రీకరణ అమెరికాలో జరిపాం. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా ఈ చిత్రంలో బోనాల పాట తీశాం. త్వరలో ప్రీ–రిలీజ్ ఫంక్షన్ నిర్వహిస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: స్వప్న కొమండూరి, కెమెరా: అరుణ్, జి.ఎల్.బాబు, సంగీతం: కార్తీక్ కొడగండ్ల. -
నేరెళ్ల వేణుమాధవ్‌పై ప్రత్యేక తపాలా కవర్ ఆవిష్కరణ
సాక్షి, హైదరాబాద్: మిమిక్రీలో 70 ఏళ్ల కళా జీవితాన్ని పూర్తి చేసుకున్న మిమిక్రీ దిగ్గజం, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ నేరెళ్ల వేణుమాధవ్ 86వ జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత తపాలా శాఖ తెలంగాణ సర్కిల్ ఆయనపై ప్రత్యేక తపాలా కవర్‌ను ఆవిష్కరించింది. మంగళవారం హైదరాబాద్ జనరల్ పోస్టాఫీసులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలంగాణ సర్కిల్ చీఫ్ పోస్టుమాస్టర్ జనరల్ బ్రిగేడియర్ బి.చంద్రశేఖర్ ఈ తపాలా కవర్‌ను ఆవిష్కరించి విడుదల చేశారు. అనంతరం నేరెళ్ల వేణుమాధవ్‌ను సన్మానించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ.. తన అసమాన ధ్వని అనుకరణ ప్రతిభతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తెలుగు జాతికి పేరుప్రతిష్టలు తెచ్చిపెట్టిన దిగ్గజం వేణుమాధవ్ అని కొనియాడారు. మిమిక్రీలో 70 ఏళ్ల పాటు చేసిన కృషికి గుర్తుగా తపాలా శాఖ ఈ అరుదైన గౌరవం ఇస్తోందన్నారు. నాలుగు దశాబ్దాల క్రితం తాను విద్యార్థి దశలో ఉన్నప్పుడు దివంగత సంజయ్ గాంధీ సభలో వేణుమాధవ్ మిమిక్రీ ప్రదర్శనను చూసి మంత్రముగ్ధుడిని అయ్యానని, ఇప్పుడు ఆయన పక్కన కూర్చోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా వేణుమాధవ్ మాట్లాడుతూ.. కళాకారులకు సన్మానాలు, సత్కారాలు మామూలేనని, అయితే తపాలా శాఖ ఇచ్చిన ఈ అరుదైన గౌరవానికి మాటలు రావడం లేదన్నారు. తన పేరుపై ప్రత్యేక పోస్టల్ కవర్‌ను విడుదల చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ పోస్టుమాస్టర్ జనరల్ ఎం.రాజేంద్రప్రసాద్, సినీనటుడు రావి కొండల్రావు, పోస్ట్‌మాస్టర్ జనరల్ ఏలిషా, డైరెక్టర్ వెన్నం ఉపేంద్ర, వీవీవీ సత్యనారాయణరెడ్డి, ఆశాలత, జీవీఎన్ రాజు తదితరులు పాల్గొన్నారు. -
స్టార్ కమెడియన్ పోలీస్ కంప్లైంట్
టాలీవుడ్ ప్రముఖ కమెడియన్ వేణుమాధవ్ మంగళవారం పోలీసులను ఆశ్రయించారు. ఓ తెలుగు న్యూస్ ఛానల్‌తో పాటు మరో రెండు సోషల్ మీడియా వెబ్సైట్లలో తాను చనిపోయినట్టుగా వచ్చిన వార్తలపై ఆయన కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇటీవల చాలా సందర్భంలో మీడియా అత్యుత్సాహం మూలంగా సెలబ్రీటిలపై తప్పుడు వార్తలు ప్రచారం అవుతున్నాయి. తమిళ కమెడియన్ సెంథిల్ చనిపోయినట్టుగా వార్తలు రావటం, తరువాత ఆయన వీడియో మెసేజ్ ద్వారా తాను బతికే ఉన్నట్టుగా వివరణ ఇచ్చి, రెండు రోజులు కూడా గడవక ముందే తెలుగు నటుడు వేణుమాధవ్‌కు అలాంటి అనుభవమే ఎదురైంది. దీంతో మానసిక వేదనకు గురైన ఈ స్టార్ కమెడియన్ అందుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులను కోరారు.