సాక్షి, హైదరాబాద్: ప్రముఖ హాస్య నటుడు వేణుమాధవ్ మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ‘వేణుమాధవ్ తొలిసారి నాతో కలిసి మాస్టర్ సినిమాలో నటించాడు. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి హాస్య నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకున్నాడు. కొన్ని పాత్రలు తనకోసమే పుట్టాయా అనేలా నటించేవాడు. ఆ పాత్రకే వన్నె తీసుకొచ్చేవాడు . వయసులో చిన్నవాడు. సినీ పరిశ్రమలో తనకింకా బోలెడంత భవిష్యత్తు ఉందని అనుకుంటున్న సమయంలో దేవుడు చిన్నచూపు చూశాడు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడ్ని ప్రార్ధిస్తున్నాను’ అని చిరంజీవి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అనారోగ్యం కారణంగా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వేణుమాధవ్ కన్నుమూసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment