
వేణుమాధవ్, ఉదయభానులతో ఉన్న ఈ బక్కపల్చని కుర్రాడిని గుర్తుపట్టారా? ఎక్కడుంటే అక్కడ రచ్చే!

కమెడియన్ వేణుమాధవ్, యాంకర్ ఉదయభానుల మధ్యలో ఉన్న ఈ బక్కపల్చని కుర్రాడు బుల్లితెర ప్రేక్షకులకు బాగా సుపరిచితుడు. 'తీస్కోలే రెండు లచ్చల కట్నం..', 'ఆగుతవా రెండు నిమిషాలు' వంటి డైలాగులతో ఈయన చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.

అతడే జబర్దస్త్ కమెడియన్ రచ్చ రవి. ఇతడు కెరీర్ ప్రారంభంలో మిమిక్రీ ఆర్టిస్టుగా వన్స్ మోర్ ప్లీజ్ అనే టీవీ షోలో పాల్గొని తన అదృష్టం పరీక్షించుకున్నాడు. ఆ సమయంలో దిగిన ఫోటోనే ఇది.

టాలీవుడ్‌లో కమెడియన్లుగా వెలుగుతున్న ఎంతోమంది ఈ టీవీ ప్రోగ్రామ్‌లో పార్టిసిపేట్ చేసినవారే! ఈ షోకి వేణుమాధవ్, ఉదయభాను యాంకర్స్‌గా వ్యవహరించారు.

ఇక రచ్చరవి విషయానికి వస్తే.. కామెడీ షోతో బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ఇతడు సినిమాల్లోనూ జోరు చూపిస్తున్నాడు. చిన్నాపెద్ద తేడా లేకుండా అన్ని సినిమాల్లోనూ తళుక్కుమని మెరుస్తున్నాడు.

వరంగల్‌లోని మారుమూల గ్రామం నుంచి వచ్చిన రచ్చరవి ఎన్నో కష్టాలను దాటుకుని కమెడియన్‌గా పేరుప్రతిష్టలు సంపాదించాడు.

గతేడాది ఎఫ్ 3, వాల్తేరు వీరయ్య, బలగం, మ్యాడ్, భగవంత్ కేసరి చిత్రాల్లో నటించిన ఇతడు ఈ ఏడాది ఓం భీమ్ బుష్, లగ్గం, ఉత్సవం వంటి సినిమాలతో అలరించాడు.

రామ్‌చరణ్ 'గేమ్ చేంజర్', సన్నీడియోల్ 'జాట్' సహా దాదాపు అరడజను సినిమాల్లో నటిస్తున్నాడు. 2024 సైమా అవార్డ్స్ లో బెస్ట్ కమెడియన్‌గా, 2024 ఐఫా అవార్డ్స్‌కు గాను బెస్ట్ సపోర్టింగ్ ఆర్టిస్టుగా నామినేట్ అయ్యాడు.








