బాహుబలి తరువాత సాహో సినిమాతో బిజీగా ఉన్న యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ తన తదుపరి చిత్రాన్ని ప్రారంభించారు. చాలా రోజులుగా ప్రచారంలో ఉన్నట్టుగానే కేకే రాధకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ తదుపరి చిత్రం రూపొందనుంది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయని తెలిపారు. ఈ సినిమాను ఒకేసారి మూడు భాషల్లో తెరకెక్కించనున్నారని వెల్లడించారు.
గోపిచంద్ హీరోగా తెరకెక్కిన జిల్ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన రాధకృష్ణ అప్పటి నుంచి ప్రభాస్ డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. సాహో షూటింగ్ చివరి దశకు చేరుకోవటంతో తదుపరి చిత్ర రెగ్యులర్ షూటింగ్‌ను త్వరలోనే ప్రారభించనున్నారు. ఎక్కువ భాగం యూరప్‌లో చిత్రీకరించినున్న ఈ సినిమా పీరియాడిక్ లవ్ స్టోరిగా తెరకెక్కనుందన్న టాక్ వినిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment