యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఇటలీలో షూటింగ్ చేస్తున్నాడు. సాహో సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి కావటంతో కొత్త సినిమాను మొదలు పెట్టాడు. జిల్ ఫేం రాధకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను గోపీకృష్ణ మూవీస్, యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
ఇటలీ నేపథ్యంలో పీరియాడిక్ రొమాంటిక్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్‌కు వాహనాలు సమకూర్చటం చిత్రయూనిట్ కు భారంగా మారుతుందట. ఇటలీలో బిల్డింగ్స్ అన్ని ఇప్పటికే వింటేజ్ లుక్‌తో కనిపిస్తున్నా వాహానాలు మాత్రం మోడ్రన్‌గా మారిపోయాయి. దీంతో వింటేజ్ కార్లు, బస్సులు సేకరించే పనిలో ఉన్నారు చిత్రయూనిట్. ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment