![Prabhas Role Revealed From Radha Krishna Film - Sakshi](/styles/webp/s3/article_images/2018/12/22/Prabhas.jpg.webp?itok=g8XygMKC)
బాహుబలి తరువాత మరోసారి లాంగ్ గ్యాప్ తీసుకున్న ప్రభాస్ ప్రస్తుతం సాహో సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. అంతర్జాతీయ స్థాయిలో భారీ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాతో పాటు మరో షూటింగ్‌లోనూ బిజీగా ఉన్నాడు ప్రభాస్. జిల్ ఫేం రాధకృష్ణ దర్శకత్వంలో మరో సినిమాలో నటిస్తున్నాడు. పిరియాడిక్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ పాత్రపై ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ సినిమాలో ప్రభాస్ యూరోప్‌లో వింటేజ్ కార్ల వ్యాపారిగా కనిపించనున్నాడట. ఓ కారు అమ్మే విషయంలో జరిగిన సంఘటనతోనే సినిమా కథ మలుపు తిరుగుతుందన్న టాక్ వినిపిస్తోంది. ప్రభాస్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను ప్రభాస్ పెదనాన్న, రెబల్ స్టార్ కృష్ణంరాజు గోపి కృష్ణమూవీస్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment