ప్రభాస్‌ కొత్త సినిమా.. 30 కోట్లతో 8 సెట్లు | Prabhas And Radha Krishna Movie Sets Cost 30 Crores | Sakshi
Sakshi News home page

ప్రభాస్‌ కొత్త సినిమా.. 30 కోట్లతో 8 సెట్లు

Published Sat, May 18 2019 10:13 AM | Last Updated on Sat, May 18 2019 10:13 AM

Prabhas And Radha Krishna Movie Sets Cost 30 Crores - Sakshi

బాహుబలి స్టార్ ప్రభాస్‌ ప్రస్తుతం జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. అందుకే ప్రభాస్‌ హీరోగా తెరకెక్కే సినిమాలన్నీ అదే స్థాయిలో రూపొందిస్తున్నారు. ప్రస్తుతం సాహోతో పాటు రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు ప్రభాస్‌. సాహో  షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ సినిమాను హాలీవుడ్ స్థాయి యాక్షన్‌ ఎపిసోడ్స్‌తో భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు.

రాధకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాను కూడా అదే స్థాయిలో రూపొందిస్తున్నారు. పీరియాడిక్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను కూడా భారీ బడ్జెట్తో రూపొందిస్తున్నారు. ఈ సినిమా కోసం రామోజీ ఫిలిం సిటీలో పురాతణ ఇటలీని తలపించేలా 8 సెట్స్‌ను వేశారు.

కేవలం ఈ సెట్స్‌ కోసం 30 కోట్ల వరకు ఖర్చు చేసినట్టుగా తెలుస్తోంది. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను ప్రభాస్‌ పెదనాన సీనియర్ హీరో కృష్ణం రాజు గోపి కృష్ణ మూవీస్ బ్యానర్‌పై రూపొందిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement