ప్రభాస్
‘బాహుబలి, సాహో’ లాంటి యాక్షన్ సినిమాల తర్వాత ప్రభాస్ ఓ ఫుల్ లెంగ్త్ లవ్‌స్టోరీలో కనిపిస్తారని తెలిసిందే. సుజీత్ దర్శకత్వంలో రూపొందుతోన్న యాక్షన్ థ్రిల్లర్ ‘సాహో’ వచ్చే ఏడాది విడుదలవుతుంది. ఆ తర్వాత ఇటలీలో జరిగే పీరియాడికల్ లవ్‌స్టోరీతో ప్రభాస్ ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధం అవుతున్నారు. ఈ చిత్రానికి ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకుడు. ఇందులో ప్రభాస్ ప్రేయసిగా పూజా హెగ్డే కనిపించనున్నారు. కొరియన్ రొమాంటిక్ కామెడీ చిత్రం ‘మై సాసీ గాళ్’ కథాంశానికి దగ్గరగా ఈ చిత్రకథ ఉండబోతోందని టాక్.
చిన్న చిన్న తగాదాలతో మొదలయి ఎలా ప్రేమలో పడ్డారనే ప్రేమకథలా ఈ సినిమా ఉంటుందట. ఇది సాదా సీదా ప్రేమకథ కాదట. గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై కృష్ణంరాజు, వంశీ, ప్రమోద్‌లు నిర్మిస్తున్న ఈ పీరియాడికల్ లవ్‌స్టోరీ కొన్నిరోజులు ఇటలీలో షూటింగ్ జరుపుకున్న సంగతి తెలిసిందే. అందుకోసం పురాతన వాహనాలను ఎక్కువగా అద్దెకు తీసుకున్నారు టీమ్. హిందీ, తెలుగు, తమిళంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం 2020లో రిలీజ్ కానుంది. ఈ లవ్‌స్టోరీకు అమిత్ త్రివేది సంగీతం సమకూరుస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment