బాహుబలి తరువాత సాహో సినిమా పనుల్లో బిజీగా ఉన్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఆ సినిమా రిలీజ్ కాకముందే మరో సినిమాను ప్రారంభించాడు. జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ పీరియాడిక్ లవ్ స్టోరిలో నటిస్తున్నాడు డార్లింగ్. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ఇటలీలో ప్రారంభమైంది. తాజాగా హీరో ప్రభాస్ కూడా ఇటలీలో యూనిట్‌తో జాయిన్ అయ్యారు.
తాజా లోకేషన్‌లో ప్రభాస్ ఫొటో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. అక్కడి స్థానిక అధికారులతో కలిసి ఉన్న ఫొటోలో ప్రభాస్ డిఫరెంట్ లుక్‌లో విభిన్న కాస్ట్యూమ్స్‌లో కనిపిస్తున్నాడు. ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ సంస్థతో కలిసి గోపికృష్ణ మూవీస్ బ్యానర్ నిర్మిస్తోంది. ఎక్కువ భాగం ఇటలీలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా 2019 చివర్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment