'2024 ఎన్నికల నోటిఫికేషనింకా రాకముందే చంద్రబాబు ఓటమి ఖరారైపోయింది!! అదెలా? ఎవరన్నారు? ఎవరో అనడం కాదు. చంద్రబాబు చేతికింది రెండు న్యూస్ పేపర్లు రాసింది అదే. బాబు పనైపోయిందని! ‘‘ఏడాదిలో 30 లక్షల ఓట్లు తొలగించేశారు’’ – అని ‘ఛీనాడు’ రాసింది. ‘‘జడ్జికి వజ్రాలు పొదిగిన బంగారు వాచ్’’ – అని బాధాకృష్ణ రాశాడు. వీటికి చంద్రబాబుకు సంబంధమేంటీ? మరి చంద్రబాబు ఓటమి ఖాయం అవడం ఏమిటి? సమాధానం సింపుల్.'
చంద్రబాబు ఓటమి ఖాయం అని డిసైడ్ చేసుకున్నప్పుడే ‘ఛీమోజీ’ గానీ, ‘బాధాకృష్ణ’గాని ఇలాంటి కుళ్లు, కక్కుళ్ల వార్తలు మొదలుపెడతారు. 2019 ఎన్నికలకు ముందు కూడా వీళ్లద్దరు చేసింది ఇదే. ఆనాడు ఛీమోజీ తప్పుడు వార్తలు రాస్తే, బాధాకృష్ణ చిల్లర వార్తలు రాశాడు. చంద్రబాబును లేపడానికి వీళ్లు ఎన్ని కట్టెలు పెట్టి, ఎన్ని కట్టుకథలు అల్లినా చివరికి జనం జగన్‌మోహన్‌రెడ్డికే పట్టం కట్టటం, చంద్రబాబు పార్టీకి పటం కట్టి పూలదండ వేయటం ఈ కళ్లతోనే చూశాం కదా. ఏపీ సీఎంగా జగన్‌మోహన్‌రెడ్డి 2019 మే 30న ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజు నుంచి, ఇప్పటి వరకు.. గత ఐదేళ్లుగా జగన్‌మోహన్‌రెడ్డిపై తప్పుడు రాతలు, చిల్లర కథనాలు కక్కుతున్న ఛీమోజీ, బాధాకృష్ణ.. ఇప్పుడు మరింతగా దిగజారి దగుల్బాజీ రాతలు రాయడం ప్రారంభించారంటే.. చంద్రబాబును ఎంత లేపి ప్రయోజనం లేదని వాళ్లకు లేటెస్టుగా ఉప్పో, టిప్పో అందిందని అర్థం.
అయినా ‘దింపుడుకల్లం’ ఆశ ఎక్కడికిపోతుంది. ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిష‍్టను దెబ్బతీయడం ద్వారా చంద్రబాబుకు వెంటిలేటర్ పై ఊపిరి ఎక్కించే వృధా ప్రయత్నాలు ప్రారంభించారు ఛీమోజీ, బాధాకృష్ణ. ‘బాధాకృష్ణ’వి చెల్లని చిల్లర కథనాలు. వాటిని పట్టించుకునే పని లేదు. ‘ఛీమోజీ’ కల్పనలు చిరిగిపోయిన కాగితాలు. అవీ చెలామణి అయ్యేవి కావు. కానీ ఆ చిరుగులకు సెలో టేప్ అంటించి ప్రజల్లోకి తోసేశాలని ఛీమోజీ చూస్తున్నారు కాబట్టి.. ఆయన ఇవాళ రాసిన 'ఓట్ల తొలగింపు’ ఏడుపుగొట్టు వ్యథపై మనం మాట్లాడుకోవలసిందే. చంద్రబాబు ‘బోగస్’ బతుకు ఏంటో కూడా తెలుసుకోవలసిందే.
చంద్రబాబు పెద్ద బ్లఫ్ మాస్టర్. తను ఓడిపోతున్నాని తెలిస్తే, లేదా తను గెలవలేనని తెలిస్తే ఎన్నికలకు ముందు నకిలీ ఓట్లతో తన బలం పెంచేసుకుంటారు. అందులో ఆయన ఎక్స్‌పర్ట్. అందుకు సాక్ష్యాధారాలు రాష్ట్ర ఎన్నికల కమిషన్ పాత ఫైళ్లలో దొరుకుతాయి. ఓటమి ఖాయం అని ఇప్పుడు తేలిపోయినట్లే.. (కొత్త మలుపు తిరిగిన ఛీమోజీ, బాధాకృష్ణల దిగజారుడు కథనాలను బట్టి), 2004 ఎన్నికలకు ముందూ.. చంద్రబాబు ఓడిపోయేది ఖాయం అని సర్వేలు తేల్చేశాయి. వెంటనే చంద్రబాబు ‘ఓట్ల జోడింపు’ వ్యూహం మొదలైంది. అంటే బోగస్ ఓటర్లను చేర్చడం! ఆ చేర్పులపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్షాలు నిరసన వ్యక్తం చేశాయి. ప్రదర్శనలు జరిపాయి.
‘‘బాబు ప్రకటించిన ప్రోగ్రెస్ రిపోర్టులే కాదు, ఆయన హయాంలో స్టాంపులు, మెడికల్ కాలేజీలు, ఆఖరికి ఓట్ల జాబితాలు కూడా నకిలీవే.. ’’ అని ప్రతిపక్షనేత వై.ఎస్.రాజశేఖర రెడ్డి ఎద్దేవా చేశారు. ‘‘అధికారాన్ని అంటిపెట్టుకుని ఉన్న తెలుగుదేశం పార్టీ, గద్దె మీద కొనసాగడానికి ఎంతకైనా దిగజారేందుకు సిద్ధంగా ఉంది..’’ అని నాటి టీఆర్‌ఎస్ నేత కేసీఆర్.. బోగస్ ఓట్లపై చంద్రబాబును తూర్పారా పట్టారు. ‘‘ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని గాడి తప్పించింది. ఎన్నికలు జరపడానికి ముందే ఈ అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది..’’ అని బోగస్ ఓట్ల పై నాటి రాష్ట్ర సీపీఐ ప్రధాన కార్యదర్శి సుధాకర్ రెడ్డి హెచ్చరించారు. చంద్రబాబుపై వాళ్ల విమర్శలను కానీ, ఎద్దేవాలను కానీ, హెచ్చరికలను ఛీనాడు లోపలి పేజీలలో నామ మాత్రంగా తప్ప ప్రముఖంగా ఎక్కడా ప్రచురించలేదు. ఎందుకంటే ‘తమవాడు’ మళ్లీ సీఎం అవడం కావాలి ఛీమోజీరావుకు.
ప్రతిపక్షాలన్నీ కలసికట్టుగా ఆరోపణ చేస్తుంటే కేంద్ర ఎన్నికల సంఘానికి చంద్రబాబు మీద డౌట్ వచ్చి, రాష్టంలో ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం జరపటంతో చంద్రబాబు దొంగ ఓట్ల వ్యవహారం బయటపడింది! ఓటు నమోదు కోసం ఎన్నికల కమిషన్‌కు అందిన 53,95,550 ల దరఖాస్తులలో 19,40,387 దరఖాస్తులు నకిలీవని తెలిసి, తెల్లబోయి, కమిషన్ వాటిని తొలగించింది. అంతేకాదు, పాత జాబితాలోని 1.21 కోట్ల ఓటర్ల నుంచి 55,32,713 మంది ఓటర్ల పేర్లను తొలగించింది. పాత, కొత్త బోగస్ ఓటర్ల సంఖ్య 74.13 లక్షలకు చేరుకున్నట్లు ఎన్నికల సంఘం గుర్తించి తొలగించింది! అప్పుడు తొలగించినట్లే కమిషన్ ఇప్పుడూ తొలగించింది. అందుకే ఛీనాడు పెడబొబ్బలు. బాధాకృష్ణ ‘వజ్రాల వాచీ’ అంటూ బూడిద రాతలు.
2003లో చంద్రబాబు చేసిన బోగస్ ఓట్ల స్కామ్ చిన్న సంగతి కాదు. అందుకే ఎన్నికల కమిషన్ కూడా ఆ లెవల్‌లో బోగస్ ఓట్ల తొలగింపు ప్రక్షాళనను చేపట్టాల్సి వచ్చింది. కమిషన్‌కు ఎంతో శ్రమ, ఖర్చు అయ్యాక 2004 జనవరి మూడో వారానికి జిల్లా కలెక్టర్లు పూర్తిగా బోగస్ ఓట్లను తొలగించగలిగారు. బోగస్ ఓటర్లకు కారణమైన ఐదుగురు మండల రెవెన్యూ అధికారుల మీద చర్యలకు కమిషన్ సిఫారసు చేసింది. ఓటర్ల జాబితాలో అవకతవకలేమీ లేవని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చంద్రబాబు మొదట బుకాయించినప్పటికీ కమిషన్ దర్యాప్తులో బోగస్ ఓట్ల సంఖ్య 75 లక్షలకు పైగా ఉన్నట్లు తేలడంతో ఆయనేమీ మాట్లాడలేకపోయారు. ఆయనే కాదు.. ‘ఛీమోజీ’ కూడా కుక్కిన పేనులా ఉండిపోయారు. ఇప్పుడేమో.. 30 లక్షల ఓట్లు తొలగించారని గుండెలు బాదుకుంటూ తీరూతెన్నూ లేని ఆంబోతు కథనాలు అచ్చోసి వదులుతున్నారు.
ఇంతకీ ఛీమోజీ ఏమిటంటాడూ.. తటస్థులు, ప్రతిపక్ష పార్టీ మద్దతుదారులు, సానుభూతిపరుల ఓట్లను తొలగించేందుకు తప్పుడు వివరాలతో వై.ఎస్.ఆర్.సీపీ ఫామ్–7 దరఖాస్తు చేసిందట! కమిషన్ అంత గుడ్డిగా తొలగిస్తుందా? ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డితో పాటుగా, కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా ఆడిపోసుకోడానికి ఛీమోజీ అండ్ చంద్రబాబు తయారైనట్లే ఉంది. వారికి వంతగా బాధాకృష్ణ!! (అన్నట్లూ.. ‘అపద్ధర్మ ముఖ్యమంత్రి’ అనే మాట బాబుగారికి నచ్చదు. ఆ మాటను తీసేయించడానికి రాజ్యాంగాన్నే మార్పించే ఆలోచన కూడా 2003లో చేశారు!!
Comments
Please login to add a commentAdd a comment