ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషన్ నుంచి దర్శక నిర్మాత పోసాని కృష్ణమురళికి నోటీసులు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని పోసాని స్వయంగా ప్రెస్‌మీట్ పెట్టి మీడియాకు తెలియజేశారు. అయితే ఈ వార్తను ఏబీయన్ ఆంధ్రజ్యోతి వక్రీకరించి ప్రసారం చేసిందని పోసాని కృష్ణమురళి ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై అబద్ధాలు ప్రసారం చేసిన ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణపై పోసాని విరుచుకుపడ్డారు.