
సాక్షి, హైదరాబాద్: మహత్మా గాంధీ టెంపుల్ ట్రస్ట్ (హైదరాబాద్) ప్రతినిధుల బృందం ఆదివారం తెలంగాణ గవర్నర్ సీపీ రాధాకృష్ణను కలిశారు. ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో తమ బృందం ఇటీవల జరిగిన ఎన్నికల్లో ‘‘ఒటర్ అవేర్‌నెస్ అండ్ ఎథికల్ ఓటింగ్ క్యాంపెయిన్’’ పేరుతో అవగాహన కార్యక్రమాన్ని మే 1 నుంచి మే 13 వరకు నిర్వహించామని గవవర్నకు తెలియజేశారు.
ఈ అవగాహన కార్యక్రమం నిర్వహించినందుకు వారికి గవర్నర్ అభినందనలు తెలిపారు. అదేవిధంగా మద్యపాన నిషేధంపై కూడా అవగాహాన కార్యక్రమం చేపట్టాలని గాంధీ టెంపుల్ ట్రస్ట్ బృందానికి ఆయన సూచించారు. ఇక.. ఎన్నికల్లో పోటీ చేసే నాయకులు, ఓటు వేసే ఓటర్లు.. మద్యం, డబ్బు ముట్టుకోమని ప్రతిజ్ఞ చేయాలన్నారు. అయితే తాను కూడా ఒకసారి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీచేశాని తెలిపారు. ఓటర్లకు ఎట్టిపరిస్థితులు డబ్బు పంచకూడదని ఒక నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. అయితే ఆ ఎన్నికల్లో తాను ఓడిపోయినట్లు తెలిపారు.
ఈ ట్రస్ట్ బృంద ఏపీ, తెలంగాణలోని 22 ప్రాంతాల్లో ఓటర్లకు అవగాహన కల్పించారు. తెలంగాణలో హైదరాబాద్, సికింద్రాబాద్, ఖమ్మం, వరంగల్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, కరీంనగర్ ప్రాంతాల్లో అవగాహన కల్పించారు. ఏపీలో వైజాగ్, రాజమండ్రీ, కాకినాడ, ఏలూరు, భీమవరం, విజయవాడ, గుంటూరు, తెనాలి, నార్సరావుపేట, ఒంగోల్, నెల్లూరు, కర్నూల్, తిరుపతి, చిత్తూరు, కడప ప్రాంతాలో గాంధీ టెంపుల బృందం ఎన్నికల అవగాహన కార్యక్రమం నిర్వహించింది.
గవర్నర్ కలిసిన బృందంలో మహత్మా గాంధీ టెంపుల్ ట్రస్ట్ (హైదరాబాద్) అధ్యక్షులు భోపాల్ మోరా, సెక్రటరీ వీపీ కృష్ణారావు, సలహాదారులు వీపీ రావు, నగేంద్రరెడ్డి, ట్రస్టీలు డా. సీత, నర్సిరెడ్డిలు ఉన్నారు.