యూట్యూబ్‌లో దూసుకుపోతున్న కలెక్టర్‌ భక్తి పాట | IAS Officer Rakhee Gupta Releases a Devotional song on YouTube | Sakshi
Sakshi News home page

యూట్యూబ్‌లో దూసుకుపోతున్న కలెక్టర్‌ భక్తి పాట

Published Thu, Oct 22 2020 8:37 AM | Last Updated on Thu, Oct 22 2020 9:50 AM

IAS Officer Rakhee Gupta Releases a Devotional song on YouTube - Sakshi

ఐఏఎస్ (ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్) అధికారిణి, సీనియర్ సివిల్ సర్వెంట్ రాఖీ గుప్తా ఇటీవల విడుదల చేసిన భక్తి గీతం ‘మై తోహ్ రతుంగి రాధా నామ్’ ప్రస్తుతం ఇంటర్‌నెట్‌లో వైరల్ అవుతోంది. నాలుగన్నర నిడివి గల ఈ పాటను అక్టోబర్ 18వ తేదీన యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేశారు.  ఇప్పటి వరకు ఈ వీడియోను లక్షకు పైగా వీక్షించారు.  ఈ వీడియో రాధా కృష్ణలకు సంబంధించింది. ఇది కృష్ణుని పట్ల భక్తులకు ఉండే భావాన్ని తెలియజేస్తోంది. ఈ వీడియోని రాఖీ గుప్తా ఆమె తల్లికి, తన కుటుంబ సభ్యులకు అంకితమిచ్చింది. శ్రీకృష్ణుడు జన్మించిన బృందావనంలోనే ఈ వీడియోను చిత్రీకరించారు.

ఈ వీడియో తీయాలని గత ఏడాదే అనకున్నప్పటికీ కరోనా కారణంగా వాయిదా పడింది. దీనికి గౌరవ్‌ దేవ్‌, కార్తీక్‌ దేవ్‌ సంగీతమందించారు. ఆన్‌లైన్‌లో వైరల్‌ అవుతున్న ఈ వీడియోను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. చాలా బాగా నటించారు అని కొందరు నెటిజన్లు ప్రశంసించగా, మీ స్వరంతో మమ్మల్ని మంత్రముగ్ధుల్ని చేశారు మేడం అంటూ మరికొంతమంది కామెంట్‌ చేస్తున్నారు. 

చదవండి: అక్కడ గెలిస్తే.. అధికారం చేతికొచ్చినట్టే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement