
పంజాగుట్ట: ఒప్పందం ప్రకారం రెమ్యునరేషన్ చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న సినీ నిర్మాతపై చర్యలు తీసుకోవాలంటూ ఓ నటుడు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హైదరాబాద్ ఎల్లారెడ్డిగూడాలోని పడాల రామిరెడ్డి లా కాలేజీ సమీపంలో నివాసముంటున్న సినీ నటుడు కెప్టెన్ చౌదరీ 2018లో రాధాకృష్ణ అనే చిత్రంలో నటించాడు. ఇందుకుగాను నటించే సమయంలో రోజుకు 30000 రూపాయలు రెమ్యూనరేషన్ అందించడంతోపాటు రవాణా, అసిస్టెంట్‌లకు సైతం వేతనాలు చెల్లించాలని ఒప్పందం కుదుర్చుకున్నామని కెప్టెన్ చౌదరి పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ సినీమాలో 14రోజులపాటు నటించిన తనకు ఇప్పటి వరకు రెమ్యూనరేషన్ చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న సినీ నిర్మాత సాగరికపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని అయన కోరారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పంజాగుట్ట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment