sagarika
-
రాజ్‌కుంద్రాపై ఆరోపణలు: చంపుతామంటూ నటికి బెదిరింపులు
Sagarika Shona Suman: ప్రముఖ నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రాపై ఆరోపణలు చేసిన మోడల్, నటి సాగరిక ఇబ్బందుల్లో పడింది. తనను అత్యాచారం చేసి, చంపేస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయని వాపోయింది. ఈ మేరకు గురువారం నాడు ఓ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. "కొందరు వ్యక్తులు నాకు ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడుతున్నారు. అత్యాచారం చేసి చంపుతామంటూ బెదిరింపులకు దిగుతున్నారు. అసలు రాజ్ కుంద్రా ఏం తప్పు చేశాడని ప్రశ్నిస్తున్నారు. మీరు పోర్న్ చిత్రాలు చూస్తారు కాబట్టే మేము వాటిని చిత్రీకరిస్తున్నామని దబాయించారు. ఈ చీకటి వ్యాపారానికి ముగింపు పడటానికి కారణం నేనేనని నిందిస్తున్నారు. వేర్వేరు నంబర్ల నుంచి ఈ ఫోన్లు వస్తూనే ఉన్నాయి. ఇదంతా నాకు చాలా ఇబ్బందిగా అనిపించడమే కాక నా జీవితం ప్రమాదంలో పడినట్లు అనిపిస్తోంది. దీనికి కారణమైనవారిపై నేను పోలీసులకు ఫిర్యాదు చేస్తాను" అని చెప్పుకొచ్చింది. కాగా రాజ్ కుంద్రా దగ్గర పనిచేసే ఉమేశ్ కావత్ నుంచి తనకు వెబ్ సిరీస్ కోసం పిలుపు వచ్చిందంటూ సాగరిక ఇంటర్వ్యూ ఒకటి వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. అయితే వీడియో కాల్ ద్వారా ఆడిషన్ ఉంటుందని, ఈ వీడియోకాల్‌లో నగ్నంగా కనిపించాలని చెప్పడంతో దాన్ని తిరస్కరించానని చెప్పింది. -
సినీ నిర్మాత సాగరికపై ఫిర్యాదు
పంజాగుట్ట: ఒప్పందం ప్రకారం రెమ్యునరేషన్ చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న సినీ నిర్మాతపై చర్యలు తీసుకోవాలంటూ ఓ నటుడు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హైదరాబాద్ ఎల్లారెడ్డిగూడాలోని పడాల రామిరెడ్డి లా కాలేజీ సమీపంలో నివాసముంటున్న సినీ నటుడు కెప్టెన్ చౌదరీ 2018లో రాధాకృష్ణ అనే చిత్రంలో నటించాడు. ఇందుకుగాను నటించే సమయంలో రోజుకు 30000 రూపాయలు రెమ్యూనరేషన్ అందించడంతోపాటు రవాణా, అసిస్టెంట్లకు సైతం వేతనాలు చెల్లించాలని ఒప్పందం కుదుర్చుకున్నామని కెప్టెన్ చౌదరి పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ సినీమాలో 14రోజులపాటు నటించిన తనకు ఇప్పటి వరకు రెమ్యూనరేషన్ చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న సినీ నిర్మాత సాగరికపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని అయన కోరారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పంజాగుట్ట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: కెనడా నుంచి వచ్చి ఇంట్లో ఉరేసుకుని.. -
జహీర్ ఖాన్ నిశ్చితార్థం...
-
జహీర్ ఖాన్ నిశ్చితార్థం...
భారత మాజీ క్రికెటర్, ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు కెప్టెన్ జహీర్ ఖాన్ త్వరలో ఓ ఇంటివాడు కానున్నాడు. తన ప్రియురాలు, బాలీవుడ్ నటి సాగరిక ఘాట్గెతో జహీర్ నిశ్చితార్థం సోమవారం జరిగింది. ‘మీ భార్య ఎంపికలపై నవ్వకండి. ఎందుకంటే అందులో మీరు కూడా ఉన్నారు. ఇక నుంచి జీవితాంతం భాగస్వాములం’ అని సాగరిక చేతికి ఉంగరం పెట్టిన ఫొటోను జహీర్ ట్వీట్ చేశాడు. Never laugh at your wife's choices. You are one of them !!! Partners for life. #engaged @sagarikavghatge pic.twitter.com/rUOtObFhiX — zaheer khan (@ImZaheer) 24 April 2017 -
సాగరిక-జహీర్‌ల ప్రేమాయణం?
ముంబై: భారత క్రికెట్ తో బాలీవుడ్ బంధం విడదీయలేనిదిగానే చెప్పొచ్చు. భారత క్రికెటర్లతో బాలీవుడ్ భామలు ప్రేమాయణం నడిపిన సందర్భాల్లో చాలానే ఉన్నాయి. ఇందులో కొంతమంది జంటలుగా ఒక్కటైతే, మరికొంతమంది ప్రేమతోనే వారి బంధానికి ఫుల్ స్టాప్ పెట్టేశారు. అయితే తాజాగా టీమిండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్-బాలీవుడ్ నటి సాగరిక ఘట్గెలు ప్రేమాయణం సాగిస్తున్నరనే వార్త ప్రస్తుతం హల్ చల్ చేస్తోంది. గతేడాది నవంబర్ లో టీమిండియా క్రికెటర్ యువరాజ్ సింగ్-హాలీవుడ్ నటి హజల్ కీచ్ ల పెళ్లికి జహీర్-సాగరికాలు హాజరుకావడం అప్పట్లో చర్చనీయాంశమైంది. 'చక్ దే ఇండియా' ఫేమ్ సాగరికతో జహీర్ ప్రేమలోపడ్డాడని రూమర్లు వెలుగుచూశాయి. అయితే తాజాగా ఇందుకు మరింత బలాన్నిస్తూ సాగరిక నటించిన సినిమా 'ఇరాదా' ప్రమోషన్ లో భాగంగా నిర్వహించిన ఓ కార్యక్రమానికి జహీర్ హాజరయ్యాడు. దాంతో ఆ ఇద్దరూ డేటింగ్ లో ఉన్నారనే అనుమానం మరింత బలపడింది. ఈ కార్యక్రమానికి యువరాజ్ సింగ్ తన భార్య హజల్ కీచ్ తో కలిసి హాజరుకాగా, మరో ఇద్దరు వెటరన్ క్రికెటర్లు ఆశిష్ నెహ్రా, అజిత్ అగార్కర్ లు కూడా ఈ వేదికపై మెరిశారు. రియల్ లైఫ్ లో కాదు కదా: యువీ శుక్రవారం 'ఇరాదా' సినిమా విడుదల సందర్భంగా సాగరికకు యువరాజ్ సింగ్ ముందుగా శుభాకాంక్షలు తెలియజేశాడు. ఈ సినిమా హిట్ కావాలనే ఆకాంక్షించిన యువీ.. సాగరికను ఆట పట్టించే యత్నం చేశాడు. ఈ మేరకు తన ట్విట్టర్ అకౌంట్ లో సాగరికను ఉద్దేశిస్తూ ఆసక్తికర ట్వీట్ చేశాడు. 'చక్ దే ఇండియా మూవీ హాకీ క్రీడాకారిణిగా నటించిన నీవు, భారత్ క్రికెట్ వైస్ కెప్టెన్ తో డేటింగ్ చేసి పాత్రను పోషించావు. ఇంతవరకూ బాగానే ఉంది. ఈ డేటింగ్ అనేది నిజ జీవితంలో లేదు కదా!'అని యువీ చమత్కరించాడు. మరి యువీ ఏ ఉద్దేశంతో అలా అన్నాడో అతనికే తెలియాలి. -
‘ప్రేమ’ విషాదం
జిల్లాలో వేర్వేరు ఘటనల్లో ప్రేమికుల రోజు విషాదం చోటు చేసుకుంది. దేవరుప్పుల మండలం పడమటితండాకు చెందిన బానో తు కృష్ణ(23) పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అదేవిధంగా రేగొండ మండలం పెద్దంపల్లికి చెందిన సాగరిక(20) ఉరివేసుకుని మృతి చెందింది. - దేవరుప్పుల/రేగొండ కుటుంబ కలహాలతో యువకుడు.. పడమటితండా (దేవరుప్పుల) : కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని పడమటితండా శివారులో శనివారం చోటుచేసుకుంది. హెడ్ కానిస్టేబుల్ సుభాష్ కథనం ప్రకారం.. పడమటితండా గ్రామ పంచాయతీ శివారు దొనేబండతండాకు చెందిన బానోతు కృష్ణ (23) జనగామలో డిగ్రీ చదువుతుండగా.. అదే కళాశాలలో చదువుతున్న లింగాలఘనపురం మండలంలోని కుందారం శివారు దేవరకుంట తండాకు చెందిన అనిత పరిచయమైంది. దీంతో ఇరువురు ప్రేమించుకుని పెద్దల అంగీకారంతో ఎనిమిది నెలల క్రితం పెళ్లి చేసుకున్నారు. కాగా, మూడు నెలల క్రితం బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు వెళ్లారు. అయితే ఇటు చదువు.. అటు సంసార బాధలు తట్టుకోలేని పరిస్థితుల్లో స్వగ్రామానికి వెళ్లి బతుకుదామనే విషయంలో భార్యాభర్తల మధ్య కొద్ది రోజులుగా గొడవ జరుగుతుంది. దీంతో ఈనెల 13వ తేదీన కృష్ణ హైదరాబాద్ నుంచి భార్యను తీసుకొచ్చి ఆమె తల్లిగారింటిలో వదిలాడు. అనంతరం అక్కడి నుంచి తన తండాకు వచ్చి వాడిక కల్లుతాగాడు. కాగా, రాత్రి అన్నం తిన్న తర్వాత మూత్రవిసర్జనకు వెళ్లిన కృష్ణ ముందస్తుగా తెచ్చుకుని చెలకలో దాచి పెట్టుకున్న పురుగుల మందుతాగి వచ్చి పడుకున్నాడు. అయితే మధ్య రాత్రి తల్లి లక్ష్మీకి పురుగుల మందువాసన రావడంతో అనుమానం వచ్చి కొడుకు కృష్ణను గమనించగా నోటినుంచి నురుగులు వచ్చాయి. దీంతో ఆమె కేకలు వేసి చుట్టూ పక్కల వారిని పిలిచి డాక్టర్ వద్దకు తీసుకెళ్లి పరీక్షలు చేయించగా కృష్ణ అప్పటికే మృతిచెందాడు. కాగా, మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేస నమోదు చేసుకున్నట్లు హెడ్ కానిస్టేబుల్ సుభాష్ తెలిపారు. ఉరి వేసుకుని యువతి.. రేగొండ : ఉరి వేసుకుని ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండల కేంద్రం శివారులోని పెద్దంపల్లిలో శనివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... రేగొండ పోలీస్‌స్టేషన్‌లో గతంలో పనిచేసిన కానిస్టేబుల్ సారయ్య, సరోజన దంపతులకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. అయితే పెద్ద కూతురు సాగరిక (20) గత ఏడాది ఫిబ్రవరి 14వ తేదీన మండల కేంద్రం శివారుకు చెందిన సకినాల మహేష్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. కాగా, కొంతకాలంగా తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్న సాగరిక మండల కేంద్రంలోని వాణివిద్యానికేతన్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుంది. ఈ క్రమంలో శనివారం ఇంట్లో ఎవరులేని సమయంలో సాగరిక ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కాగా, భర్త మహేష్ పరకాలకు వెళ్లి వచ్చి చూసే సరికి ఇంటి తలుపులు వేసి ఉన్నాయి. దీంతో అనుమానం వచ్చి ఆయన తలుపులను తీసి చూడగా సాగరిక ఉరివేసుకుని ఉంది. ఇదిలా ఉండగా, సంఘటనా స్థలాన్ని డీఎస్పీ సంజీవరావు, సీఐ శ్రీనివాస్, ఎస్సై శాదుల్లాబాబా సందర్శించారు. కాగా, సాగరిక మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.