సాగరిక-జహీర్ల ప్రేమాయణం? | Rumoured boyfriend Zaheer Khan joins Sagarika Ghatge for Irada screening | Sakshi
Sakshi News home page

సాగరిక-జహీర్ల ప్రేమాయణం?

Published Sat, Feb 18 2017 3:26 PM | Last Updated on Tue, Sep 5 2017 4:02 AM

సాగరిక-జహీర్ల ప్రేమాయణం?

సాగరిక-జహీర్ల ప్రేమాయణం?

ముంబై: భారత క్రికెట్ తో బాలీవుడ్ బంధం విడదీయలేనిదిగానే చెప్పొచ్చు. భారత క్రికెటర్లతో  బాలీవుడ్ భామలు ప్రేమాయణం నడిపిన సందర్భాల్లో చాలానే ఉన్నాయి. ఇందులో కొంతమంది జంటలుగా ఒక్కటైతే, మరికొంతమంది ప్రేమతోనే వారి బంధానికి ఫుల్ స్టాప్ పెట్టేశారు. అయితే తాజాగా టీమిండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్-బాలీవుడ్ నటి సాగరిక ఘట్గెలు ప్రేమాయణం సాగిస్తున్నరనే వార్త ప్రస్తుతం హల్ చల్ చేస్తోంది. గతేడాది నవంబర్ లో టీమిండియా క్రికెటర్ యువరాజ్ సింగ్-హాలీవుడ్ నటి హజల్ కీచ్ ల పెళ్లికి జహీర్-సాగరికాలు హాజరుకావడం అప్పట్లో చర్చనీయాంశమైంది. 'చక్ దే ఇండియా' ఫేమ్ సాగరికతో జహీర్ ప్రేమలోపడ్డాడని రూమర్లు వెలుగుచూశాయి. అయితే తాజాగా ఇందుకు మరింత బలాన్నిస్తూ సాగరిక నటించిన సినిమా 'ఇరాదా' ప్రమోషన్ లో భాగంగా నిర్వహించిన ఓ కార్యక్రమానికి జహీర్ హాజరయ్యాడు. దాంతో ఆ ఇద్దరూ డేటింగ్ లో ఉన్నారనే అనుమానం మరింత బలపడింది. ఈ కార్యక్రమానికి యువరాజ్ సింగ్ తన భార్య హజల్ కీచ్ తో కలిసి హాజరుకాగా, మరో ఇద్దరు వెటరన్ క్రికెటర్లు ఆశిష్ నెహ్రా, అజిత్ అగార్కర్ లు కూడా ఈ వేదికపై మెరిశారు.



రియల్ లైఫ్ లో కాదు కదా: యువీ

శుక్రవారం 'ఇరాదా' సినిమా విడుదల సందర్భంగా సాగరికకు యువరాజ్ సింగ్ ముందుగా శుభాకాంక్షలు తెలియజేశాడు. ఈ సినిమా హిట్ కావాలనే ఆకాంక్షించిన యువీ.. సాగరికను ఆట పట్టించే యత్నం చేశాడు. ఈ మేరకు తన ట్విట్టర్ అకౌంట్ లో సాగరికను ఉద్దేశిస్తూ ఆసక్తికర ట్వీట్ చేశాడు. 'చక్ దే ఇండియా మూవీ హాకీ క్రీడాకారిణిగా నటించిన నీవు, భారత్ క్రికెట్ వైస్ కెప్టెన్ తో డేటింగ్ చేసి పాత్రను పోషించావు. ఇంతవరకూ  బాగానే ఉంది. ఈ డేటింగ్ అనేది నిజ జీవితంలో లేదు కదా!'అని యువీ చమత్కరించాడు. మరి యువీ ఏ ఉద్దేశంతో అలా అన్నాడో అతనికే తెలియాలి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement