
జహీర్ ఖాన్ నిశ్చితార్థం...
భారత మాజీ క్రికెటర్, ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు కెప్టెన్ జహీర్ ఖాన్ త్వరలో ఓ ఇంటివాడు కానున్నాడు. తన ప్రియురాలు, బాలీవుడ్ నటి సాగరిక ఘాట్గెతో జహీర్ నిశ్చితార్థం సోమవారం జరిగింది. ‘మీ భార్య ఎంపికలపై నవ్వకండి. ఎందుకంటే అందులో మీరు కూడా ఉన్నారు. ఇక నుంచి జీవితాంతం భాగస్వాములం’ అని సాగరిక చేతికి ఉంగరం పెట్టిన ఫొటోను జహీర్ ట్వీట్ చేశాడు.
Never laugh at your wife's choices. You are one of them !!! Partners for life. #engaged @sagarikavghatge pic.twitter.com/rUOtObFhiX
— zaheer khan (@ImZaheer) 24 April 2017