
వల్లభనేని వంశీ, దేవినేని ఉమా మహేశ్వర రావు(పాత చిత్రం)
కృష్ణా జిల్లా : ఏపీ నీటి పారుదల శాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ మధ్య కోల్డ్ వార్ సాగుతోంది. పోలవరం కుడికాలువ పట్టిసీమపై ఏర్పాటు చేసిన పంపుసెట్లకు విద్యుత్తు సరఫరా విషయంలో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. మంత్రి ఉమ సొంత నియోజకవర్గం మైలవరంలో నీరు ఇచ్చి గన్నవరం నియోజకవర్గంలో రైతులకు నీరు ఇవ్వకపోవడంపై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.
గన్నవరం, బాపులపాడు, విజయవాడ రూరల్ మండలాల్లో పట్టిసీమ నీరు అందక నారుమళ్లు, వరినాట్లు ఎండిపోతున్నాయి. రైతుల ఇబ్బందుల విషయమై విద్యుత్ శాఖ ఎండీ, చైర్మన్ నాయక్‌కు ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ లేఖ రాశారు. దానికి ఉమ అడ్డుపడుతుండటంతో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు నాయుడిని కలిసి సమస్యల గురించి ప్రస్తావించనున్నారు. గత ఏడాది ఇదే సమస్య రావడంతో వల్లభనేని, సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లడంతో అధికారులు విద్యుత్ ఇచ్చారు.