సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఊరట లభించింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీ ముందస్తు బెయిల్ దాఖలు చేశారు. ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం ఏపీ హైకోర్టు విచారణ జరిపింది.
ఈ సందర్భంగా.. ఈ నెల 20 వరకు ఎటువంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను హూకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 20కి న్యాయస్థానం వాయిదా వేసింది.
చదవండి: నాడు అత్యుత్సాహం.. నేడు అతి వినయం
Comments
Please login to add a commentAdd a comment