కృష్ణాజిల్లా: జిల్లాలోని గన్నవరంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. గన్నవరం మండలం కేసరపల్లిలో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పుట్టినరోజు వేడుకలకు కార్యకర్తలు ఏర్పాట్లు చేసుకుంటే... ఆ వేడుకల్ని పోలీసుల అడ్డుకున్నారు.
డీజే వాహనానికి అనుమతి లేదని అడ్డుకున్నారు. ఆ వాహనాన్ని స్టేషన్‌కు తరలించారు. చివరక కేక్ కటింగ్‌కు అనుమతి లేదని పోలీసులు ఓవరాక్షన్ చేశారు. వంశీ బర్త్ డే వేడుకలు ఏర్పాటు చేసిన వైఎస్సార్‌సీపీ నాయకులను స్టేషన్‌కు తరలించారు.


