వల్లభనేని వంశీకి చంద్రబాబు పరామర్శ
గన్నవరం : గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌ను టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం పరామర్శించారు. ఎమ్మెల్యే వంశీ తండ్రి రమేష్‌చంద్ ఈ నెల 17న అనారోగ్యంగో మృతి చెందిన విషయం విదితమే. ఈ సందర్భంగా వంశీని పరామర్శించేందుకు సీఎం చంద్రబాబు ఈరోజు ఉదయం 11 గంటలకు హెలికాప్టర్‌లో ఉంగుటూరు వచ్చారు.