ఎయిర్ పోర్ట్ లో వల్లభనేని వంశీ వీరంగం
కృష్ణా: టీడీపీ నేత వల్లభనేని వంశీ గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో వీరంగం సృష్టించారు. గన్నవరం ఎయిర్‌పోర్ట్ లోపలికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను అనుమతించలేదని అధికారులతో వంశీ వాగ్వాదానికి దిగారు.
వంశీకి కార్యకర్తల కూడా జత కలవడంతో పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. దాంతో వంశీతోపాటు, కార్యకర్తలకు పోలీసుల మధ్య తోపులాట జరిగింది. దాంతో గన్నవరం ఎయిర్ పోర్ట్ లో కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది.
కార్యకర్తలను చెదరగొట్టి, వంశీకి నచ్చచెప్పి పరిస్థితిని పోలీసులు అదుపులోకి తెచ్చారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. రాజకీయ నాయకుల, కార్యకర్తల అత్యుత్సాహం కారణంగా గన్నవరం, రాజమండ్రి, రేణిగుంట విమానాశ్రాయాల్లో అడపాదడపా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే.