సీఎం జగన్‌పై దాడి: నిందితుల్ని పట్టిస్తే పోలీసుల నగదు బహుమతి | AP Police Announced Reward for Give Information On CM Jagan Vijayawada Incident | Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌పై దాడి: నిందితుల్ని పట్టిస్తే పోలీసుల నగదు బహుమతి

Published Mon, Apr 15 2024 1:56 PM | Last Updated on Mon, Apr 15 2024 3:54 PM

AP Police Announced Reward for Give Information On CM Jagan Vijayawada Incident - Sakshi

సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం వేశారు. ఈ క్రమంలో దాడికి సంబంధించి నిందితుల వివరాల చెప్పిన వారికి ఎన్టీఆర్‌ జిల్లా పోలీసులు నగదు బహుమతిని ప్రకటించారు. 

కాగా, సీఎం జగన్‌పై గుర్తు తెలియని వ్యక్తి/వ్యక్తులు గురించి ఏదైనా సమాచారం ఉన్నా, తెలిసినా తమకు తెలపాలని ఎన్టీఆర్‌ జిల్లా పోలీసులు కోరారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌పై దాడికి సంబంధించి కచ్చితమైన సమాచారం ఇచ్చిన వారిని నగదు బహుమతి ఇస్తామని స్పష్టం చేశారు. దాడిపై సమాచారం ఇచ్చిన వారికి రూ.2లక్షలు నగదు బహుమతి ఇవ్వనున్నట్టు పోలీసులు తెలిపారు. వారి వివరాలను ఈ కింది నంబర్లకు సమాచారం ఇవ్వాలని సూచించారు. వివరాల తెలిపిన వారి పేపర్లను గోప్యంగా ఉంచుతామని పోలీసులు హామీ ఇచ్చారు. 
ఫోన్‌ నంబర్లు ఇవే..
9490619342, 9440627089

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement