
అంతర్జాతీయ ఎక్స్‌ప్రెస్ కార్గో కేంద్రాన్ని ప్రారంభిస్తున్న కస్టమ్స్, ఎయిర్‌పోర్టు అధికారులు
శంషాబాద్: ఇతర మెట్రోనగరాలపై ఆధారపడ కుండా ఇక అంతర్జాతీయ కొరియర్ నిర్వహణ జీఎంఆర్ ఎయిర్ కార్గో చేయబోతోంది. దీని కోసం అంతర్జాతీయ కొరియర్ ఎక్స్‌ప్రెస్ కార్గో నూతన కేంద్రాన్ని సంస్థ ఏర్పాటు చేసింది. హైదరాబాద్ కస్టమ్స్ కమిషనర్ బి.విశనాగకుమారి, ఎయిర్‌పోర్టు సీఈఓ ప్రదీప్‌ఫణీకర్, చీఫ్ ఇన్నో వేషన్ అధికారి ఎస్‌జికే కిశోర్‌లు ఈ కేంద్రాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ సదుపాయంతో కార్గో రవాణా లో హైదరాబాద్ దక్షిణ భారత దేశానికి గేట్‌వేగా మారనుందని వారు చెప్పారు. కార్గో రంగంలో ఇదో కొత్త అధ్యాయమని, హైదరాబాద్ ఎయిర్ కార్గో తన పరిధి ఏటా విస్తరిస్తోందని తెలిపారు. కార్గో ఇటీవల సంచార శీతలీకరణ కూడాప్రారంభించిందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment