Courier
-
స్మగ్లింగ్ కేరాఫ్ కొరియర్స్
సాక్షి, హైదరాబాద్: బెంగళూరులో తయారైన మాదకద్రవ్యం ఎఫిడ్రిన్‌ను నగరంలోని అక్బర్‌బాగ్ నుంచి కొరియర్ ద్వారా ఆస్ట్రేలియా పంపాలని చూసిన ముఠాను నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు పట్టుకున్నారు.⇒ ఢిల్లీలోని ఓ కొరియర్ సంస్థ హిమాయత్‌నగర్‌లోని వ్యాపారికి వజ్రాలను పార్శిల్ చేసింది. వీటిని కొరియర్ ఉద్యోగులే తస్కరించడంతో ఏళ్లుగా జరుగుతున్న అక్రమ రవాణా వెలుగులోకి వచ్చింది.⇒ ఓ కొరియర్ సంస్థ ద్వారా హాంకాంగ్ వెళ్తున్న ఓ పార్శిల్‌ను ఎయిర్‌పోర్ట్‌లోని కస్టమ్స్ అధికారులు స్కానింగ్ చేశారు. ఫలితంగా అందులో రూ.5 లక్షల విలువైన ఎర్ర చందనం ఉన్నట్లు తేలడంతో అటవీ శాఖ అధికారులకు అప్పగించారు.⇒ హైదరాబాద్ నుంచి న్యూజిలాండ్‌కు కొరియర్ ద్వారా అక్రమంగా ఎఫిడ్రిన్ రవాణా చేస్తున్నారంటూ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌కు (డీఆర్ఐ) సమాచారం అందింది. శనివారం ఓ కొరియర్ కార్యాలయంలో సోదాలు చేసి మూడు కేజీలు స్వాధీనం చేసుకున్నారు.⇒ ఈ ఉదంతాలే కాదు.. తెరపైకి రాకుండా చాపకింద నీరులా కొరియర్స్ ద్వారా సాగిపోతున్న బంగారం, వజ్రాలు, ఎర్రచందనం, మాదకద్రవ్యాల దందాకు నగరంలో కొదవేలేదు. ఏళ్లుగా ‘బులియన్ మార్కెట్’ అక్రమ దందా సాగుతుండగా.. కొన్నేళ్లుగా ఎర్ర చందనాన్నీ కొరియర్స్ ద్వారా దేశం దాటించడం మొదలుపెట్టారు. ఇటీవల కాలంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణాకూ కొరియర్స్‌ను వాడుతున్నారని వెలుగులోకి వచ్చింది.అవి ఇక్కడికి.. ఇవి అక్కడికి..హోల్‌సేల్‌గా బంగారాన్ని కిలోల లెక్కన మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు, వజ్రాలను ముంబై, ఢిల్లీ తదితర ప్రాంతాల నుంచి హైదరాబాద్ తీసుకువచ్చి రిటైలర్స్‌కు, జ్యువెలరీ దుకాణ యజమానులకు విక్రయిస్తుంటారు. కొన్ని సందర్భాల్లో తీసుకుని రావడానికీ వెనుకంజ వేస్తున్న వ్యాపారులు ఏకంగా పార్శిల్స్ చేసి పంపిస్తున్నారు. అలాగే నగర శివార్లతో పాటు చుట్టు పక్కల రాష్ట్రాల్లోనూ ఖాయిలా పడ్డ ఫార్మా పరిశ్రమలు అనేకం ఉన్నాయి. వీటితో పాటు కొందరి ఇళ్లూ డ్రగ్స్ కార్ఖానాలుగా మారిపోతున్నాయి. ప్రధానంగా ఎఫిడ్రిన్, ఆల్ఫాజోలం తదితరాలు వీటిలో తయారవుతున్నాయి. వీటి ధర ఇక్కడ కిలో రూ.లక్షల్లో ఉండగా.. విదేశీ విపణిలో మాత్రం రూ.కోట్లు పలుకుతోంది. దీంతో ఆ సరుకులు కొరియర్స్ ద్వారా సిటీకి వస్తుండగా.. ఎఫిడ్రిన్, సూడో ఎఫిడ్రిన్ వంటి డ్రగ్స్ సిటీ నుంచి బయటకు వెళ్లిపోతున్నాయి.ఆర్థిక లావాదేవీలకు అక్రమ మార్గంలో..వీటిలో ఏవి ఎటు వచ్చినా, వెళ్లినా... చెల్లింపులు మాత్రం నేరుగా, బ్యాంకు ఖాతాల ద్వారా సాగించరు. దీనికి అనేక మంది వ్యాపారులు, స్మగ్లర్లు అక్రమ ద్రవ్య మార్పిడైన హుండీ, హవాలాలను ఆశ్రయిస్తున్నారు. నగరంలో ఉన్న ఏజెంట్లకు డబ్బు అప్పగించే వ్యాపారులు, అది చేరాల్సిన వ్యక్తి వివరాలు చెప్పి కమీషన్ ఇస్తే చాలు. గంటలోపే డెలివరీ అయిపోతుంది. ఇక్కడకు రావాలన్నా ఇదే పంథా కొనసాగుతోంది. ఈ విధానమే తమకు సురక్షితమని భావిస్తున్న స్మగ్లర్లు, వ్యాపారస్తులు దీన్నే అవలంబిస్తున్నారు. నగరంలోని బేగంబజార్, పాతబస్తీ, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో ఇప్పటికీ రోజూ రూ.కోట్లలో ఈ అక్రమ ద్రవ్యమార్పిడి బిజినెస్ నడుస్తోందని పోలీసులే అంగీకరిస్తున్నారు. ప్రతి రూ.లక్షకు కేవలం రూ.300 నుంచి రూ.600 వరకు మాత్రమే కమీషన్‌గా ఉండటం వీరికి కలిసి వస్తోంది. ఏవైనా ఉదంతాలు చోటు చేసుకున్న సందర్భంలో మాత్రమే ఏజెన్సీల రికార్డుల్లోకి ఈ వ్యవహారాలు ఎక్కుతున్నాయి. డ్రగ్స్ రవాణా వ్యవహారాల్లో పాత్రధారులు మినహా సూత్రధారులు దొరుకుతున్న సందర్భాలు లేవు.అన్నీ స్కానింగ్ సాధ్యం కాదుకొరియర్ పార్శిల్స్ ద్వారా డ్రగ్స్, పేలుడు పదార్థాలు, డబ్బు, నగలు, మానవ అవయవాలు, మత్తు పదార్థాలు తదితరాలను పార్శిల్ చేయడంపై పూర్తి నిషేధం ఉంది. అయినా పట్టుబడిన నిందితులు చెప్పిన వివరాలు, దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన అంశాల ప్రకారం అనేక కొరియర్స్ ద్వారా ఈ రవాణా జరుగుతోంది. ఇలాంటి అంశాల్లో పూర్తి వివరాలను వెలికితీసే అవకాశం పోలీసు, ఏజెన్సీలకు ఉండట్లేదు. ఎయిర్‌కార్గో ద్వారా రవాణా అయ్యే ప్రతి పార్శిల్‌ను స్కానింగ్ చేయడం, క్షుణ్ణంగా పరిశీలించడం సాధ్యం కాదు. సంబంధిత విభాగంలో ఆ సాంకేతిక పరిజ్ఞానం, మానవవనరులు లేవు. నిరంతర నిఘా, ప్రతి కేసులోనూ మూలాలను అన్వేషించడం ద్వారానే ఇలాంటి వాటికి చెక్ చెప్పగలం.– శ్రీనివాస్, కస్టమ్స్ విభాగం మాజీ అధికారి -
ల్యాప్‌టాప్ అనుకుంటే బండరాయి వచ్చింది!
అనంతపురం ఎడ్యుకేషన్: కొరియర్లో ల్యాప్‌టాప్ వచ్చిందనుకుంటే బండరాయి కనిపించిన సంఘటన నగరంలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. సమగ్ర శిక్ష రాష్ట్ర కార్యాలయం నుంచి అన్ని జిల్లాల సమగ్ర శిక్ష డీపీసీ, ఏపీసీలకు హెచ్‌పీ కంపెనీ 12 జనరేషన్, 16 జీబీ ర్యామ్, 1టీబీ ఎస్ఎస్డీ, స్క్రీన్ విండోస్ 11 ప్రో, ఎంఎస్ ఆఫీస్ అడాప్టర్ క్యారీ కేస్ సామర్థ్యం కల్గిన ల్యాప్టాప్స్ కొనుగోలు చేశారు. హైదరాబాద్‌కు చెందిన కంప్యూటర్ ఇండియా అనే సంస్థ ఈ ల్యాప్‌టాప్స్‌ను సరఫరా చేసింది. మే 31న జిల్లాకు వచ్చాయి. డీపీసీగా ఉన్న డీఈఓ తనకు అందిన ప్యాకింగ్ ఓపెన్ చేయగా, ల్యాప్‌టాప్ ఉంది. ఈ క్రమంలోనే జిల్లాకు పంపిన రెండు ల్యాప్‌టాప్‌ల్లో ఒకదానిని అందుకున్నట్లు సమాచారం పంపారని, రెండో దాని వివరాలు పంపాలంటూ బుధవారం సమగ్ర శిక్ష రాష్ట్ర కార్యాలయం నుంచి ఫోన్ వచ్చింది. దీంతో సమగ్ర శిక్ష ఏపీసీకి వచ్చిన పార్శిల్‌ను ఓపెన్ చేయగా.. అందులో బండరాయి దర్శనం ఇచ్చింది. ఆ రాయికే కవర్లు కప్పి ఉంది. అందులోనూ దాదాపు ల్యాప్‌టాప్ బరువు ఏ మేర ఉంటుందో అంతేస్థాయి బరువున్న రాయి ఉంచారు. అయితే, ఈ విషయాన్ని వెంటనే రాష్ట్ర కార్యాలయ అధికారుల దృష్టికి స్థానిక సిబ్బంది తీసుకెళ్లారు. ల్యాప్‌టాప్ పార్శిల్ కవరుపై ఉన్న కంప్యూటర్ ఇండియా సంస్థ ఫోన్ నంబరుకు కాల్ చేసి ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేయనున్నట్లు పేర్కొన్నారు. -
అనుమానాస్పద స్థితిలో కొరియర్ బాయ్ మృతి
ద్వారకాతిరుమల: తిరుమలంపాలెంకు చెందిన దివ్యాంగుడైన ఓ కొరియర్ బాయ్ ఈ నెల 18న అదృశ్యం కాగా, శనివారం గ్రామం శివారులో ఉన్న ఓ కొబ్బరితోటలో చెట్టుకు వేలాడుతూ విగతజీవిగా కనిపించాడు. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన దివ్యాంగుడైన నాయుడు శివదుర్గ ప్రసాద్ (26) ద్వారకాతిరుమలలోని ఈ–కార్ట్‌లో కొరియర్ బాయ్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల 18న శివదుర్గ ప్రసాద్ అదృశ్యం కాగా, సోదరుడి ఫిర్యాదు మేరకు ఈ నెల 19న మిస్సింగ్ కేసు నమోదైంది. ఇదిలా ఉంటే తిరుమలంపాలెం శివారులోని ఒక కోకో, కొబ్బరి తోటలోకి శనివారం పనులకు వెళ్లిన కూలీలకు ఓ మృతదేహం చెట్టుకు వేలాడుతూ కనిపించింది. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించగా, ఎస్సై టి.సుధీర్ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి ప్రసాద్‌గా గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు తరలించారు. క్రికెట్ బెట్టింగ్‌ల కారణంగా శివదుర్గ ప్రసాద్ అప్పులపాలై ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని స్థానికులు చెబుతున్నారు. -
కొరియర్ చేసేందుకు వెళ్తుండగా.. కళ్లల్లో కారం కొట్టి.. కత్తితో గాయపరిచి..
సాక్షి, రాంగోపాల్‌పేట్: కొరియర్లో పంపించేందుకు రూ. 27.12 లక్షల విలువ చేసే గోల్డ్, డైమండ్ నగలను తీసుకెళుతున్న యవకుడి కళ్లల్లో కారంకొట్టి, కత్తితో దాడి చేసి నగలను దోచుకెళ్లిన సంఘటన మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ కావేటి శ్రీనివాస్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. వెస్ట్ మారేడుపల్లి రైల్వే కాలనీకి చెందిన సతీష్ కుమార్ సైనీ పాట్ మార్కెట్లో జై మాతా లాజిస్టిక్ పేరుతో కొరియర్ నిర్వహిస్తూ బంగారు నగలను ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తున్నాడు. అతడి వద్ద పవన్‌కుమార్ కొరియర్ బాయ్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం సాయంత్రం సతీష్‌కుమార్ ఆదేశాల మేరకు పవన్‌కుమార్ జీరాలోని శ్రీ జై అంబే కొరియర్స్ నుంచి రూ.8.65 లక్షల విలువైన 80 గ్రాముల బంగారు బిస్కెట్లను తీసుకున్నాడు. అనంతరం హయత్‌నగర్‌లోని శ్రీ రాధే డైమండ్స్‌కు వెళ్లి రూ.18,47,472 విలువైన 148.492 గ్రాముల డైమండ్ నెక్లెస్‌ను తీసుకుని బైక్‌పై పాట్‌మార్కెట్‌కు బయలుదేరాడు. ఈ ఆభరణాలను ముంబైకి పంపాల్సి ఉంది. రాత్రి 9.45 ప్రాంతంలో పవన్‌కుమార్ ఆర్పీరోడ్‌లోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్దకు రాగానే బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు అతడి కళ్లలో కారంపొడిని చల్లారు. అయితే అతను హెల్మెట్ పెట్టుకోవడంతో కారంపొడి కళ్లలో పడలేదు. దీంతో అప్రమత్తమైన పవన్‌కుమార్ వేగంగా బైక్‌ను ముందుకు నడిపించాడు. అదే సమయంలో సిటీలైట్ చౌరస్తాలో సిగ్నల్ పడటంతో ట్రాఫిక్ ఆగిపోయింది. హెచ్‌పీ పెట్రోల్ బంకు సమీపంలో ఆటోను ఢీకొట్టడంతో అతను వాహనంతో సహా కిందపడిపోయాడు. దీంతో వెనక నుంచి వచ్చిన ఇద్దరు దుండగుల్లో ఒకరు వాహనం దిగి పవన్‌కుమార్ దగ్గర ఉన్న బ్యాగును లాక్కునేందుకు యత్నించగా అతను తీవ్రంగా ప్రతిఘటించాడు. దీంతో అతను కత్తితో పవన్‌కుమార్ ఎడమవైపు చేతిపై పొడిచి బైక్‌పై పరారయ్యాడు. ట్రాఫిక్, వాహనాల మధ్య క్షణాల్లో జరిగిపోయింది. గాయపడిన పవన్‌కుమార్ యజమానికి సమాచారం అందించడంతో అతను మహంకాళి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితుడిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్ అపోలోకు తరలించారు. ప్రస్తుతం పవన్‌కుమార్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఘటనా స్థలాన్ని ఉత్తర మండలం డీసీపీ చందనా దీప్తి, ఏసీపీ రమేష్, ఇన్స్పెక్టర్ కావేటి శ్రీనివాస్ పరిశీలించారు. బాధితుడితో మాట్లాడి వివరాలు సేకరించారు. సతీష్ కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. ఇటీవల నాగోల్‌లో బంగారం షాపు యజమానిపై కాల్పులకు తెగబడి దోపిడీకి యతి్నంచిన గ్యాంగుకు దీనికి సంబంధం లేదని పోలీసులు పేర్కొన్నారు. (చదవండి: అదృశ్యమైన వ్యక్తి శవమై తేలాడు.! ప్రియుడితో కలిసి భార్యే..) -
ఇక నేరుగా అంతర్జాతీయ కొరియర్ నిర్వహణ
శంషాబాద్: ఇతర మెట్రోనగరాలపై ఆధారపడ కుండా ఇక అంతర్జాతీయ కొరియర్ నిర్వహణ జీఎంఆర్ ఎయిర్ కార్గో చేయబోతోంది. దీని కోసం అంతర్జాతీయ కొరియర్ ఎక్స్‌ప్రెస్ కార్గో నూతన కేంద్రాన్ని సంస్థ ఏర్పాటు చేసింది. హైదరాబాద్ కస్టమ్స్ కమిషనర్ బి.విశనాగకుమారి, ఎయిర్‌పోర్టు సీఈఓ ప్రదీప్‌ఫణీకర్, చీఫ్ ఇన్నో వేషన్ అధికారి ఎస్జికే కిశోర్‌లు ఈ కేంద్రాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ సదుపాయంతో కార్గో రవాణా లో హైదరాబాద్ దక్షిణ భారత దేశానికి గేట్వేగా మారనుందని వారు చెప్పారు. కార్గో రంగంలో ఇదో కొత్త అధ్యాయమని, హైదరాబాద్ ఎయిర్ కార్గో తన పరిధి ఏటా విస్తరిస్తోందని తెలిపారు. కార్గో ఇటీవల సంచార శీతలీకరణ కూడాప్రారంభించిందని చెప్పారు. -
మావోయిస్టుల్లో కలవరం..వంద మందికి పైగా కరోనా
సాక్షి, హైదరాబాద్: అసలే ఎండాకాలం.. పైగా అది అడవి.. దాహార్తి తీర్చుకోవడమే గగనం.. మరోవైపు బీపీ, షుగర్, ఆస్తమా.. వీటికితోడు ఇప్పుడు కరోనా, లాక్డౌన్.. కొరియర్లు కలవలేకపోతున్నారు.. మందులు అందడంలేదు.. వెరసి దయనీయస్థితిలో మావోయిస్టులు. కనిపించే శత్రువుపైకి కాలుదువ్వే మావోయిస్టులు ఇప్పుడు కనిపించని శత్రువును ఎలా ఎదుర్కోవాలో తెలియక సతమతమవుతున్నారు. ఇప్పుడు రూటు మార్చి మందుల కోసం వేట మొదలుపెట్టారు. ఛత్తీస్‌గఢ్ అడవుల్లో మావోలకు కొత్తకష్టం వచ్చి పడింది. కరోనా వైరస్ రూపంలో వారు ఇప్పుడు కొత్త శత్రువుతో పోరాటం చేస్తున్నారు. మొదటి కరోనా వేవ్‌ను విజయవంతంగా ఎదుర్కొన్నారు. కానీ, సెకండ్‌వేవ్‌తో విలవిల్లాడుతున్నారు. ఇప్పటికే 100 మందికిపైగా మావోయిస్టులు కరోనా బారిన పడ్డారని సమాచారం. అందులో పదిమంది వరకు మృతి చెందారు. కొరియర్లు, ప్రజాకోర్టులు.. కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ మావోయిస్టులు ఏప్రిల్ 26న భారత్‌బంద్‌కు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా పలుమార్లు బీజాపూర్, సుకుమా జిల్లాల్లోని పలు ఆదివాసీ గ్రామాల్లో వేలాదిమందితో సభలు, సమావేశాలు నిర్వహించారు. వందల సంఖ్యలో దళాల సభ్యులు, అగ్రనేతలు పాల్గొన్నారు. అక్కడక్కడా ప్రజాకోర్టులు నిర్వహించేవారు. తరచూ కొరియర్లు వచ్చి కలిసేవారు. ఈ కారణాల వల్ల దళాల సభ్యులకు వైరస్ పాకిందని పోలీసులు అనుమానిస్తున్నారు. వారు పారాసిటమాల్ మాత్రలతోనే సరిపెట్టుకుంటున్నారు. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్నవారిలో కరోనా లక్షణాలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయని, అదే మరణాలకు దారితీస్తోందని పోలీసులు తెలిపారు. అందుకే, తెలంగాణలోకి తమ కొరియర్లను పంపి కరోనా మాత్రలను సమకూర్చుకోవడం, వయసు మీద పడిన మావోయిస్టు నేతలను సాధారణ గ్రామస్థుల రూపంలో తీసుకువచ్చి వ్యాక్సిన్ వేయించడంపై వారు దృష్టి పెట్టారని నిఘావర్గాలు గుర్తించాయి. మరణాలకు కారణాలు ఇవే..! దండకారణ్యంలో సంచరించే మావోల్లో వ్యాపిస్తున్న స్ట్రెయిన్ చాలా ప్రమాదకరమైనదని సమాచారం. అయితే అది ఏంటన్నది ఇంతవరకూ గుర్తించలేదు. ఆస్తమా, బీపీ, షుగర్, గుండెజబ్బులు తదితర దీర్ఘకాలిక వ్యాధులతో ఉన్న మావోయిస్టులలో కరోనా తీవ్రత అధికంగా ఉంది. మహారాష్ట్ర, తెలంగాణలో లాక్డౌన్ కారణంగా కొరియర్లు, సానుభూతిపరుల కదలికలు కష్టమవడంతో వారి నుంచి మందులు సకాలంలో అందడంలేదు. కొందరికి మాత్రలతో వ్యాధి అదుపులోకి రాక ఆక్సిజన్ సిలిండర్లు, వెంటిలేటర్లు పెట్టాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతోంది. వేసవి కావడంతో అడవుల్లో తాగునీటి కొరత ఏర్పడింది. డెంగీ, మలేరియా లక్షణాలకు కరోనా లక్షణాలకు పెద్దగా తేడా లేకపోవడంతో వ్యాధి నిర్ధారణలో జాప్యం జరుగుతోంది. ర్యాంకుల ఆధారంగా మందులు ప్రస్తుతం మావోయిస్టుల దళాల్లో వైరస్ తీవ్రత అధికంగా ఉంది. వారికోసం తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌లో మందుల సేకరణ జరుగుతున్నట్లు మాకు కూడా సమాచారం ఉంది. ఇప్పుడు లాక్డౌన్ వల్ల ఆ ప్రయత్నాలకు బ్రేక్ పడింది. గ్రామాల్లోకి మావోలు సాధారణ ప్రజల రూపంలో వచ్చి వ్యాక్సిన్లు వేయించుకుంటున్నారు. కేడర్‌లోని ర్యాంకులను బట్టే వ్యాక్సిన్లు వేయస్తున్నారు, మందులు సరఫరా చేస్తున్నారు. ఇటీవల భారత్‌బంద్ నేపథ్యంలో వారు వేలాదిమందిని సమీకరించి ఏర్పాటు చేసిన సమావేశాల అనంతరం దళాల్లో వైరస్ తీవ్రత పెరిగింది. కరోనా పాజిటివ్ ఉన్న సభ్యులెవరైనా లొంగిపోతే, వారికి ఎలాంటి హానీ తలపెట్టం. కావాల్సిన చికిత్స అందజేస్తాం. –అభిషేక్ ఎస్పీ, దంతెవాడ (చదవండి: ‘సిటీమార్’ స్టెప్పులతో డాక్టర్ల డ్యాన్స్.. దిశా పటాని కామెంట్) -
కొరియర్లో మద్యం.. తెలంగాణ టు గాజువాక
ఎంవీపీకాలనీ(విశాఖ తూర్పు): నగరంలో పొరుగు రాష్ట్రాల మద్యం వరదలా పారుతోంది. దీని కోసం వ్యాపారుల ఏకంగా కొరియర్ సెంటర్‌ను కేంద్రంగా చేసుకున్నారు. గుట్టు చప్పుడు కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన మద్యం విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. తెలంగాణ నుంచి కొరియర్ ద్వారా గాజుకవాక తెప్పించి అక్కడ నుంచి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్టు ఎఈబీ అధికారులు తేల్చారు. ఇదీ పరిస్థితి మద్య నియంత్రణలో భాగంగా రాష్ట్రప్రభుత్వం 33 శాతం మద్యం దుకాణాలను మూసి వేయడంతో పాటు ధరలు పెంచడంతో కొందరు సరిహద్దు ప్రాంతాల నుంచి మద్యం దిగుమతి చేస్తున్నారు. దొడ్డి దారిన విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. అయితే ఎస్ఈబీ అధికారులు అప్రమత్తంగా వ్యవహరించి అక్రమ వ్యాపారులకు చెక్ పడుతున్నారు. నగరంలో ఎస్ఈబీ (స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో) దాడుల్లో బుధవారం భారీగా పక్క రాష్ట్రాల మద్యం బాటిల్స్ పట్టుబడింది. ఎంవీపీ సర్కిల్–2 ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని ఎస్ఈబీ అధికారులు బుధవారం అక్రమ రవాణాపై నిఘా పెట్టగా పెద్ద ఎత్తున మద్యం సీసాలు పట్టుబడ్డాయి. ఎస్ఐ మురళీ తెలిపిన వివరాలు .. ఎంవీపీ ఎస్ఈబీకి వచ్చిన విశ్వసనీయ సమాచారంతో మద్దిలపాలెం కూడలిలో సిబ్బంది మాటువేశారు. మధ్యాహ్నం మీసాల ఆదినారాయణ అనే వ్యక్తి ద్విచక్రవాహనంపై వస్తుండగా పట్టుకున్నారు. అతని నుంచి ఒడిశాకు చెందిన 7 రాయల్‌స్టాగ్ సీసాలతో పాటో ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతన్ని స్టేషన్‌కు తరలించి విచారించగా తెలంగాణ నుంచి కూడా అక్రమంగా మద్యాన్ని దిగుమతి చేస్తున్నట్లు తెలిపాడు. గాజువాకలోని ఒక కొరియర్ సెంటర్‌కు తెలంగాణ నుంచి మద్యం సీసాలు వస్తున్నట్లు వెల్లడించాడు. దీంతో అతన్ని తీసుకొని గాజువాక వెళ్లిన పోలీసులు కొరియర్ సెంటర్‌కు అతని పేరు మీద వచ్చిన పార్సిల్‌ను తీసుకొని చూడగా అందులో 192 మద్యం సీసాలు బయటపడ్డాయి. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే నగరంలో వేర్వు వేర్వు ప్రాంతాలకు చెందిన మరో ఇద్దరు వ్యక్తులు ఇతనికి సహకరిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. వీరంతా బృందంగా ఏర్పడి ఇతర రాష్ట్రాల నుంచి ట్రావెల్, కొరియర్ సర్వీసులతో పాటు పలు పద్ధతుల ద్వారా మద్యాన్ని దిగుమతి చేస్తున్నట్లు తెలిపారు. ఇక్కడ మద్యం విక్రయాలపై నియంత్రణ ఉండటంతో అధిక ధరలకు విక్రయాలు చేస్తున్నట్లు వివరించారు. నగరంలో ఇలాంటి మరిన్ని గ్రూపులు మద్యం రవాణా, దిగుమతులు చేస్తున్నట్లు ఎస్ఐ మురళీ తెలిపారు. ఎస్ఈబీ ద్వారా అక్రమ రవాణాపై నిఘా పెట్టినట్లు వెల్లడించారు. ప్రస్తుత వ్యవహారంలో మిగతా ఇద్ధరి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. కేసు నమోదుతో పాటు దర్యాప్తుపై పూర్తిస్థాయిలో దృష్టిసారిస్తామన్నారు. ఈ దాడుల్లో ఎస్ఐ అప్పారావు, హెచ్‌సీ శ్రీధర్ సిబ్బంది పాల్గొన్నారు. -
దొంగతనం చేశాడు; కానీ
చెన్నై: అవసరం మనిషిని దొంగను చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కానీ అవసరం తీరిన తర్వాత దొంగిలించిన వస్తువును తిరిగి దాని యజమానికి అప్పగించడమే విశేషం. తంజావూరులోని మన్నార్గుడికి చెందిన ప్రశాంత్ అనే వ్యక్తి సూలూర్‌లోని ఓ బేకరీ షాపులో పనికి కుదిరాడు. లాక్డౌన్ వల్ల పని కూడా లేకపోవడంతో ఖాళీగా ఉన్నాడు. అటు అతని కుటుంబం కూడా నగరానికి వచ్చి అక్కడే చిక్కుకుపోయింది. ఎలాగైనా ఫ్యామిలీతో కలిసి ఇంటికి వెళ్లాలని భావించాడు. కానీ అందుకు సరైన మార్గం తోచలేదు. దీంతో అతను ఓ చోట పార్క్ చేసి ఉన్న బైక్ ఎత్తుకెళ్లాడు. దాని ద్వారానే స్వగృహానికి చేరుకున్నాడు. ఇదిలా వుండగా సదరు బైకు యజమాని సురేశ్ కుమార్ మే18న తన వాహనం చోరీకి గురైందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. (ఇలాంటి దొంగతనం ఎప్పుడూ చూడలేదు) ప్రస్తుతం కరోనా డ్యూటీలో మునిగి తేలుతున్న పోలీసులు లాక్డౌన్ తర్వాత విచారణ చేపడతామని బాధితుడితో పేర్కొన్నారు. దీంతో స్వయంగా రంగంలోకి దిగిన సురేశ్ చోరీ అయిన బైకు గురించి వెతుకులాట మొదలు పెట్టాడు. ఈ క్రమంలో అతడికి సీసీటీవీ కెమెరాల్లో బైకు చోరీ అయిన దృశ్యాలు కనిపించాయి. ఆ దృశ్యాల్లో ఉన్న వ్యక్తి కోసం ఆరా తీయగా పూర్తి వివరాలు తెలిశాయి. అయితే అప్పటికే ఇంటికి చేరుకున్న ప్రశాంత్ అవసరం తీరిపోవడంతో రెండు వారాల తర్వాత బైకును తిరిగి దాని యజమానికి కొరియర్ ద్వారా పంపించాడు. దీంతో తిరిగి తన బైకు కనిపించగానే ఆ యజమాని ఆశ్చర్యానందాలకు లోనయ్యాడు. పైగా తన బైకు ఎప్పటిలాగే ఉండటంతో ఈ ఘటనపై కేసు పెట్టదలచుకోలేదని తెలిపాడు. (కరోనా ఎఫెక్ట్: మెట్రో కీలక నిర్ణయం) -
ఛత్తీస్‌గఢ్ ఎఫెక్ట్!
అది ఒక ఆఫీసు.‘‘సార్... మీకు కొరియర్’’ అన్న పిలువుతో బయటికి వచ్చాడు పిచ్చయ్య.ప్యాకెట్ విప్పి చూశాడు. ఆశ్చర్యం! ఒక వస్తువుతో పాటు చిన్న చీటీ కూడా ఉంది.∙∙ బద్దం బాలశేఖర్...బ్యాండ్ మేళం అనే కంపెనీకి బాసు. అతనికి ఆరోజు కొరియర్ వచ్చింది. తన కంపెనీ నుంచి రాజీనామా చేసిన పిక్కేష్ నుండి అది వచ్చింది. ప్యాక్ విప్పి చూశాడు. వస్తువుతో పాటు చిన్నచీటీ కూడా ఉంది.కవి కప్పడప్పుల అప్పారావు ఇల్లు. ‘కొరియర్’ అనే కేకతో హడావిడిగా బయటికి వచ్చాడు అప్పారావు.ప్యాక్ విప్పి చూశాడు. వస్తువుతో పాటు చిన్న చీటీ. కేవలం వీరికి మాత్రమే కాదు....తెలుగు రాష్ట్రాల్లో ఏ మూల చూసినా ఇలాంటి కొరియర్లే. ‘‘మీకు కొరియర్ వచ్చింది’’ అనే మాట విని ప్రజలు బెంబేలెత్తుతున్నారు! ‘‘రాజా! కొరియర్ అనే పిలువు వినబడగానే...మనసులో ఆనందం తొంగిచూస్తుంది.... అలాంటిది... కొరియర్ అనే మాట వినగానే ప్రజలు ఎందుకు బెంబేలెత్తుతున్నారు? ఈ ప్రశ్నకు జవాబు తెలిసి కూడా చెప్పలేకపోయావో....నీకు అర్జంటుగా కొరియర్లో ప్యాకెట్ వస్తుంది...’’ అని బెదిరించాడు బేతాళుడు.‘‘ఈమాత్రం దానికి కొరియర్ దాకా ఎందుకు వెళతావు...చెబుతాను’’ అంటూ చెప్పడం మొదలు పెట్టాడు విక్రమార్కుడు...‘‘ఒక్కో టైమ్‌లో ఒక్కో ట్రెండ్ రాజ్యం ఏలుతుంది. ఇప్పుడు కూడా అదే జరిగింది. ఆమధ్య కాలంలో లగేరహా మున్నాభాయి సినిమా ఎఫెక్ట్‌తో ఎదుటివారికి తమ నిరసనను పూలు ఇచ్చిప్రదర్శించేవారు. ఇప్పుడు అద్దాలు వచ్చాయి. ఒక్కసారి వెనక్కి వెళదాం....పిచ్చయ్య ప్యాకెట్ విప్పి చూశాడు.అద్దం!చీటీ చదివాడు. అందులో ఇలా ఉంది....‘‘ప్రియమైన శ్రీవారికి...మీ ఫేసును అద్దములో ఎప్పుడైనా చూసుకున్నారా? చూసుకోకపోతే ఇప్పుడు చూసుకోండి.లేకుంటే ఏమిటి! పొద్దున నేను చేసిన టిఫిన్‌కు వంకలు పెడతారా!ఇట్లు మీ శ్రీమతికాంతం(బీయే) బాస్ బద్దం బాలేశేఖర్ కొరియర్లో వచ్చిన అద్దాన్ని చూసి ఆశ్చర్యపోయి ‘‘ఈ అద్దాన్ని ఎవరు పంపించారు. ఎందుకు పంపించారు?’’ అనుకుంటూనే చీటీ చదివాడు. అందులో ఇలా ఉంది...‘‘మొన్న ఆఫీసుకు పది నిమిషాలు ఆలస్యంగా వచ్చినందుకు...పది గంటల పాటు నాన్‌స్టాప్‌గా తిట్టారు. అందుకే జాబ్‌కు రిజైన్ చేశాను. ఇప్పుడు హాయిగా ఉంది. నా హాయి సంగతి సరేగానీ...నీ ఫేస్‌ను ఎప్పుడన్నా అద్దంలో చూసుకున్నావా? అసలు నీది మనిషి ఫేసేనా? నాకు ఎందుకో డౌటుగా ఉంది. ఒక్కసారి నీ ఫేసు అద్దంలో చూసుకొని చెప్పగలవు.ఇట్లుమీ మాజీ ఉద్యోగిమక్కి పిక్కేష్ కవిగారు ప్యాకెట్లో వచ్చిన అద్దాన్ని చూసి...‘నాకు మామూలుగా కొరియర్లో పుస్తకాలు వస్తాయి. ఇదేమిటి ఈరోజు అద్దం వచ్చింది’ అనుకుంటూ చీటీ చదివాడు. అందులో ఇలా ఉంది...‘నిన్న మీ కవితలు విని అందరూ ఆహో ఒహో అన్నారు. కానీ నేను అనలేకపోయాను. నా వైపు అదోలా చూశారు. అసలు నువ్వు కవివేనా? నీ ఫేసు ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా?‘‘దూరంగా చూస్తే దోమనేఇక్కడి నుంచి చూస్తే ఈగనేకానీ...నేను పులినినిన్ను నిలువెల్లా చెక్కే ఉలిని’’ఇది కవితా? నీ పిండాకూడా!ఇట్లుకె.పాఠక్రావు, పాయకరావుపేట కొరియర్లో వచ్చిన అద్దాన్ని చూసి ‘మా ఇంట్లోనే బోలెడు అద్దాలు ఉన్నాయి. షూటింగ్ స్పాట్ నుంచి దొంగచాటుగా ఎత్తుకొచ్చిన అద్దాల సంగతి సరే సరి. ఈ అద్దాన్ని ఎవరు పంపించారు?’ అనుకుంటూ చీటీచదివాడు కొత్త హీరో పోత పాపారావు. అందులో ఇలా ఉంది...‘‘అయ్యా! నేను డైరెక్టర్ క్లాప్కుమార్ని. వరుసగా తొమ్మిది హిట్లు ఇచ్చి సంచలనం సృష్టించాను. నా ఖర్మగాలి పదో సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. బొత్తిగా అవకాశాలు లేకపోవడంతో నా ఖర్మగాలి...మీకు కథ చెప్పాను.ఏమన్నారు?!‘రౌడీలను చితక్కొట్టి బోర్ కొడుతుందయ్యా...ఈసారి కొత్తగా ప్లాన్ చేద్దాం. వంద ఏనుగులు ఒకవైపు...నేను ఒకవైపు...చితక్కొట్టేస్తాను...ది గ్రేట్ ఎలిఫెంట్ ఫైట్‌గా ఈ ఫైట్ చరిత్రలో నిలిచిపోతుంది.’‘వాన పాటలేంటీ, వేరీ బోర్! ఈసారి వెరైటీగా నిప్పుల పాట పెడదాం. పైన వేడి వేడిగా నిప్పులు కురుస్తుంటే...హీరోయిన్‌తో నేను కూల్ కూల్‌గా డ్యాన్స్ చేస్తాను.’అయ్యా! మీ క్రియేటివ్ ఐడియాలు గుర్తు తెచ్చుకుంటుంటే కడుపులో డోకు వస్తుంది. మీరు హీరో ఏమిటండీ ఖర్మగాకపోతే! ఎందుకైనా మంచిది మీ ఫేస్ ఒకసారి అద్దంలో చూసుకోండి.ఇట్లుకె.క్లాప్ కుమార్, డైరెక్టర్ (లేస్తే మనిషిని కాను ఫేమ్)∙∙ ‘‘బేతాళా! ఇవి కొన్ని మాత్రమే. ఇంకా చాలా ఉన్నాయి. ఇంతకీ విషయం ఏమిటంటే...మొన్నటి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఛత్తీస్‌గఢ్‌లో ‘అద్దాల ఉద్యమం’ అని ఒక ఉద్యమం నడిచింది, ప్రత్యర్థికి ఒక అద్దం పంపి ‘నీకు అంతసీన్ లేదు. ఒకసారి నీ ఫేస్ అద్దంలో చూస్కో’ అని మెసేజ్ చేస్తుంటారు. ఇదే ఛత్తీస్‌గఢ్ అద్దాల ఉద్యమం’’అని ముగించాడు విక్రమార్కుడు. – యాకుబ్ పాషా -
కొరియర్లో పులి పిల్ల!
సాధారణంగా కొరియర్లో మనం ఏమేం పంపిస్తుంటాం.. పుస్తకాలో, ఫోన్లో, ఇతరత్రా వస్తువులో.. కానీ మెక్సికోలో మాత్రం స్మగ్లర్లు పులిపిల్లను కొరియర్ చేశారు. దానికి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు కూడా తీసుకున్నారు. పులి పిల్లను పంపిన ప్లాస్టిక్ డబ్బాలో మెత్తదనం కోసం పేపర్లు నింపి ఊపిరాడేందుకు డబ్బాకు రంధ్రాలు పెట్టారు. మెక్సికో పశ్చిమ రాష్ట్రం జాలిస్కో నుంచి మధ్య రాష్ట్రం క్వెరెటారోకు ఈ కొరియర్‌ను ఆర్డర్ చేశారు. ఇంత జాగ్రత్త పడినా దొరికిపోయారు. ఎలాగంటారా.. జాలిస్కోలోని ట్లాక్వుపాగ్యు నగరలో బస్ స్టేషన్లో తనిఖీలు చేస్తున్నపుడు ఓ ప్లాస్టిక్ కంటెయినర్లో శబ్దం, కదలికలు, వాసనను గుర్తించాయి పోలీసు జాగిలాలు. అందులో ఏముందో అని తనిఖీ చేసిన అధికారులకు రెండు నెలల బెంగాల్ టైగర్ కనిపించింది. డీహైడ్రేషన్‌తో బాధపడుతున్న పులి పిల్లను చూసిన అధికారులు తొలుత కంగారుపడినా.. వెంటనే తేరుకొని జంతుసంరక్షణ అధికారులకు అప్పగించారు. దీన్ని బట్టి కొరియర్‌కు కాదేదీ అనర్హం అనాలేమో.. -
కొరియర్ ద్వారా దేశంలోకి రద్దయిన నోట్లు
బనశంకరి (బెంగళూరు): ప్రభుత్వం రద్దు చేసిన పెద్ద నోట్లను వాడుకలోకి తెచ్చేందుకు విదేశాల్లోని భారతీయులు అక్రమ మార్గాల బాట పట్టారు. కొరియర్ పార్సిళ్లలో నోట్లు ఉంచి రవాణా చేశారు. డిసెంబర్ 30 వరకు బెంగళూరులోని కెంపేగౌడ విమానాశ్రయంలో రూ.1.24కోట్ల విలువైన పాత కరెన్సీని పట్టుబడ్డాయి. విదేశాల్లో ఉన్న కొంత మంది తమ వద్ద ఉన్న పాతపెద్దనోట్లను మొబైల్ ఫోన్ బాక్సులు, పుస్తకాలు ఇతర వస్తువుల్లో దాచి కొరియర్ ద్వారా బెంగళూరులోని తమ వారికి చేరవేస్తున్నట్లు కస్టమ్స్ అధికారులకు సమాచారమందింది. దీంతో వారు వివిధ దేశాల నుంచి బెంగళూరు విమానాశ్రయానికి చేరిన కొరియర్ పార్శిళ్లను తనిఖీ చేయగా నోట్లు బయటపడ్డాయి. ఐటీ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. -
ఫ్లేవరేట్.. చాక్లెట్
నగరంలో నయామాల్ రకరకాల ఆకృతుల్లో తయారీ ∙ ఫేస్బుక్, ఫోన్ ద్వాకా బుకింగ్.. కొరియర్ ద్వారా విదేశాలకు ఎగుమతి నగరంలో సరికొత్త ట్రెండ్ చాక్లెట్ల తయారీలో రాణిస్తున్న వరంగల్ వాసి సుప్రియ చిన్నపిల్లలు మారాం చేస్తే చాక్లెట్.. సంతోషంలో అదే పిల్లలకు ఇవ్వాలన్నా చాక్లెట్.. పుట్టిన రోజు, పెళ్లి రోజు, ఇలా చెప్పుకుంటూ పోతూ వేడుక ఏదైనా అప్పటికప్పుడు నోరు తీపి చేయాలంటే గుర్తుకొచ్చేది చాక్లెట్టే! కొన్నేళ్ల క్రితం ఆశ, న్యూ్రట్రిన్.. ఆపై కాడ్బరీస్.. కొన్నాళ్లకు మరికొన్ని కంపెనీల చాక్లెట్లు మార్కెట్‌కు వచ్చాయి. కానీ అవి కంపెనీ నుంచి వచ్చిన రూపంలోనే ఉంటాయి. మనకు కావాల్సినట్లు కావాలంటే సాధ్యం కాని పరిస్థితి. అయితే, యువతీయువకులే కాదు అన్ని వర్గాల ప్రజలు చాక్లెట్లు కూడా తమకు నచ్చిన రీతిలో, రూపంలో ఉండాలని ఆశిస్తున్నారు. ఇలాంటి వారి ఆశల మేరకు వరంగల్‌కు చెందిన కుక్కడపు సుప్రియ చాక్లెట్లు తయారు చేస్తున్నారు. ఏ రూపంలో కావాలి, ఎంత బరువులో ఉండాలనే విషయాన్ని కొద్దిరోజుల ముందు చెబితే చాక్లెట్ తయారుచేసి ఇస్తారు. అంతేనా.. అనుకోకండి! ఫోన్లో లేదా ఫేస్ బుక్ పేజీలో ఆర్డర్ ఇస్తే చాలు చాక్లెట్ రెడీ అవుతోంది. ఏ ప్రాంతంలో ఉన్నా సరే ఆర్డర్ ఇస్తే కొరియర్ ద్వారా చాక్లెట్లు పంపిస్తున్న సుప్రియ సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టారు. – వరంగల్ వరంగల్‌లోని దుర్గేశ్వర స్వామి ఆలయ సమీపంలో ఉండే కుక్కడపు సుప్రియ నగరవాసులకు కొత్త మోడల్ చాక్లెట్లను పరిచయం చేశారు. హైదరాబాద్‌లో ఇంటీరియల్ డిజైనిం గ్ కోర్సుతో పాటు బీఎస్సీ కంప్యూటర్స్ చదివిన ఆమె చాక్లెట్ల తయారీపై ఆసక్తితో ముంబైలో చాక్లెట్ మేకింగ్ శిక్షణ పొందారు. ఆ తర్వాత సొంత ప్రతిభతో మెళకువలు నేర్చుకుని ఆమె ఎంతో ఆసక్తిగా చాక్లెట్లు తయారు చేస్తున్నారు. మిల్క్ మేడ్, బిస్కోటీస్, హనిఫిల్స్, ఫెరెరో, చాక్లెట్ బొకే వంటి వివిధ రకాల చాక్లెట్లను తయారు చేస్తూ నగరవాసుల మన్ననలు పొందుతున్నారు. వివిధ ఆకారాల్లోని చాక్లెట్లపై బర్త్‌డే గ్రీటింగ్స్, పేర్లు పొందుపరుస్తుం డడంతో సుప్రియ తయారుచేసే చాక్లెట్లు చూడగానే నోరూరేలా ఉంటాయి. చాక్లెట్లను తయారు చేయడమే కాకుండా ప్యాకింగ్ సైతం అందంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బహుమతులుగా చాక్లెట్లు ఇచ్చేందుకు వీలుగా వెరైటీ బాక్స్‌ల్లో అం దంగా ప్యాక్ చేసి వినియోగదారులకు ఇస్తున్నారు. వినియోగదారులకు కావాల్సిన మోడల్లో తయారు చేసి తెలిపిన అడ్రస్‌కు కొరియర్ ద్వారా చాక్లెట్లను పంపిస్తున్నారు. నేనే పరిచయం చేశా నగరవాసులకు కొత్త రకం చాక్లెట్లను నేనే పరిచయం చేశా. నాకంటూ ఓ ప్రత్యేకత ఉండాలన్న భావనతో వెరైటీ ఫ్లేవర్లు, ఆకారాల్లో చాక్లెట్లు తయారుచేస్తుండడంతో ఆర్డర్లు బాగా వస్తున్నాయి. మొదట్లో చాలా తక్కువగా వచ్చేవి. ఫేస్బుక్లో పేజీ ప్రారంభించాక ఇతర జిల్లాల నుంచి ఆర్డర్లు బాగా వచ్చాయి. ఇప్పుడు నగరవాసులు సైతం ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. – కుక్కడపు సుప్రియ ఫోన్ : 8008018686 అద్భుతమైన ప్యాకింగ్ చాక్లెట్ తయారు చేయడమే కాకుండా ప్యాకింగ్ సైతం ఆకట్టుకునేలా రూపొందిస్తున్నారు సుప్రియ. ప్యాకింగ్‌కు ఉపయోగించిన బాక్స్‌ను బయట పడేకుండా ఇంట్లో షోకేస్‌లో పెట్టుకునేలా ఉండడం వీటి ప్రత్యేకత. చిన్న పిల్లలకు ఇష్టమైన కార్టున్ బొమ్మల మాదిరిగా, సైకిళ్లు, బొకేల రూపంలో తయారు చేసి అందజేస్తుండడంతో వినియోగదారుల నుంచి ఆదరణ లభిస్తోంది. ఇతర దేశాల నుంచి సైతం మన జిల్లా నుంచే కాదు ఇతర దేశాల నుంచి సైతం చాక్లెట్లు కావాలని సుప్రియకు ఆర్డర్లు వస్తున్నాయి. డిజైన్లు, ధర ఇత్యాది వివరాలు పొందుపరుస్తూ ఆమె ఫేస్బుక్ పేజీ క్రియేట్ చేశారు. దీంతో ఇతర దేశాలు, రాష్ట్రాల్లో స్థిరపడిన నగర వాసులు.. వారి స్నేహితుల ద్వారా చాక్లెట్లు ఆర్డర్ చేస్తున్నారు. ఇప్పటి వరకు అమెరికా, రాజస్థాన్, అసోం, చెన్నై, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు ఆమె చాక్లెట్లు పంపించారు. -
తీగ దొరికినా.. డొంక కదలదు
కొరియర్ పద్ధతిలో.. వాహనాల్లో గంజాయి రవాణా ఒక కొరియర్‌తో మరొకరికి పరిచయం ఉండదు గంజాయి రవాణాదారుల విచారణలో వెల్లడైన ఆసక్తికర విషయాలు తీగ లాగితే డొంక కదిలిందంటారు. గంజాయి స్మగ్లింగ్ విషయంలో పోలీసులకు రవాణాదారుడు దొరికినా అసలు స్మగ్లర్లు దొరకడం లేదు. కారణం రవాణాదారుల తో అసలు స్మగ్లర్లకు నేరుగా సంబంధం ఉండకపోవడమే. పకడ్బందీగా కొరియర్ వ్యవస్థతో స్మగ్లర్లు గంజాయి రవాణా చేస్తున్నారు. – అన్నవరం అన్నవరంలో శుక్రవారం 75 కిలోల గంజాయితో పట్టుబడిన ముగ్గురు నిందితులను శనివారం అన్నవరం పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా గంజాయి రవాణా చేయడానికి స్మగ్లర్లు అనుసరిస్తున్న కొత్త పద్ధతిని ప్రత్తిపాడు సీఐ సత్యనారాయణ వివరించారు. ఒకరికొకరు తెలియకుండా.. మధ్యాహ్నం 12 గంటలు. విశాఖపట్నం వైపు నుంచి గంజాయి ప్యాకెట్ల లోడు లారీ వచ్చి ప్రత్తిపాడు హైవే మీద పెట్రోల్ బంక్ పక్కన ఆగింది. అందులో నుంచి డ్రైవర్ దిగి బంక్‌కు సమీపంలోని దాబాలో టీ తాగి, అక్కడే కూర్చున్నాడు. గంట తర్వాత మరో వ్యక్తి వచ్చి ఆ లోడు లారీ ఎక్కి దానిని రాజమండ్రి వైపు తీసుకెళ్లిపోయాడు. ఇదంతా చూస్తున్న ఆ లారీ డ్రైవర్ తన లారీని మరొకరు పట్టుకుపోతున్నారని గట్టిగా అరవలేదు. పోలీసులకూ ఫోన్ చేయలేదు. కొంతసేపు అక్కడే ఉండి, తర్వాత ఎటో వెళ్లిపోయాడు. మరుచటి రోజు అదే సమయానికి మరలా అదే లారీ (ఈసారి లోడు లేదు) హైవేపై మరో పెట్రోల్ బంక్ వద్ద ఆగింది. అందులో డ్రైవర్ కిందకు దిగి వెళ్లిపోయాడు. కొంతసేపటికి మరో వ్యక్తి వచ్చి ఆ లారీని విశాఖపట్నం వైపు తీసుకెళ్లిపోయాడు. ఇటీవల కాలంలో గంజాయి అక్రమ రవాణాకు స్మగ్లర్లు అనుసరిస్తున్న కొత్త రకం పద్ధతి ఇది. కొరియర్ వ్యవస్థలాంటి స్మగ్లింగ్ విధానమిది. ఇందులో పనిచేసే వారిలో ఒక వ్యక్తికి మరొకరికి ఎలాంటి సంబంధం ఉండదు. ఒకవేళ లారీతో పట్టుబడితే, ఆ లారీ డ్రైవర్ మినహా మరెవరి పేరూ వెలుగులోకి రాదు. లారీ అనే కాదు, చిన్న కార్లకు కూడా ఇదే పద్ధతిని అవలంబిస్తున్నట్టు పోలీసు దర్యాప్తులో వెలుగుచూసింది. గంజాయి పౌడర్‌గా మారితే రూ.లక్షలే.. గంజాయి ధర ఆకుగా ఉన్నప్పుడు కిలో వందల రూపాయల్లో ఉంటుంది. దానిని గట్టిగా నొక్కి ప్యాకింగ్ చేస్తే వేల రూపాయలు పలుకుతుంది. అదే గంజాయిని పౌడర్ (హెరాయిన్)గా మారిస్తే లక్షల రూపాయల విలువ చేస్తోంది. అందువల్లే స్మగ్లర్లు ఖరీదైన వాహనాలను కూడా గంజాయి స్మగ్లింగ్‌కు ఉపయోగిస్తున్నట్టు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. పోలీసులకు అవి పట్టుబడితే సీజ్ చేస్తారని తెలిసినా వెనుకాడడం లేదు. నిందితులు కోర్టుకు తరలింపు గంజాయి రవాణా చేస్తూ పట్టుబడిన నిందితులు విశాఖ జిల్లా రోలుగుంట మండలం, వెన్నగోపాలపట్నం గ్రామానికి చెందిన మేలాసు సూర్యనారాయణ, చిటికెల ఈశ్వర వెంకటరావు, ఇదే జిల్లా వి.మాడుగుల మండలం గాదరాయికి చెందిన కారు డ్రైవర్ మట్టా శ్రీనును పోలీసులు శనివారం ప్రత్తిపాడు కోర్టులో హాజరుపరిచారు. శ్రీనుది సొంత కారు కాదు. అతడు మరొకరి వద్ద డ్రైవర్‌గా పనిచేస్తూ.. రూ.60 వేల కిరాయికి ఆశపడి గంజాయిని కారులో తరలిస్తూ పోలీసులకు దొరికిపోడు. రూ.8 లక్షల విలువైన కారును, రూ.75 వేల విలువైన 75 కిలోల గంజాయిని కోర్టుకు అప్పగించారు. గత వారం ఎర్రవరం వద్ద వ్యాన్‌లో 624 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు సీఐ సత్యనారాయణ తెలిపారు. ఆయన వెంట అన్నవరం ఎస్సై కె.పార్థసారధి ఉన్నారు. -
పోస్టల్‌శాఖలో ‘పార్శిల్’ మాఫియా!
డమ్మీ కొరియర్లతో సిబ్బంది ఒప్పందం ఎన్ఓసీ, డిక్లరేషన్ లేకుండానే ‘మందుల’ రవాణా కొరియర్ సర్వీసులదీ అదే దారి.. ‘సాక్షి’ పరిశీలనలో వెలుగులోకి వాస్తవాలు ఓ వస్తువును దూర ప్రాంతానికి చేరవేయాలంటే పోస్టులో పంపేస్తాం. త్వరగా వెళ్లాలంటే కొరియర్ చేస్తాం. పంపే వస్తువును బట్టి పోస్టల్ శాఖ ధర, కొన్ని నిబంధనలు విధించింది. ఇప్పుడు ఈ ‘నిబంధన’లనేఅడ్డుపెట్టుకుని కొందరు పోస్టల్ శాఖ ఉద్యోగులు అడ్డదారిలో సొమ్ము చేసుకుంటున్నారు. కొన్ని డమ్మీ కొరియర్ సంస్థలతో చేతులు కలిపి.. ‘మందులు’ పంపేందుకు సొంత శాఖ నిబంధనలకు తూట్లు పొడిచి జేబులు నింపుకుంటున్నారు. సిటీబ్యూరో: సిటీ నుంచి ఔషధాలను విదేశాలకు పోస్టులో పంపాలంటే పోస్టల్ శాఖ కొన్ని నిబంధనలు పాటిస్తోంది. వైద్యుడు రాసిచ్చిన మందుల చీటీ, ఔషధాలు ఖరీదు చేసిన బిల్లుతో పాటు ఔషధ నియంత్రణ శాఖ నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) తప్పనిసరి చేసింది. మందులు పంపేవారికి ఇవన్నీ పాటించడం కొంత కష్టంగా మారింది. దీన్ని ఆసరాగా చేసుకున్న పోస్టల్ శాఖ ఉద్యోగులు కొన్ని డమ్మీ కొరియర్ సంస్థలతో సంబంధాలు పెట్టుకున్నారు. ఎలాంటి పత్రాలు లేకుండానే ఔషధాల పార్శిల్స్‌ను యథేచ్ఛగా విదేశాలకు పంపేస్తున్నారు. ఇందుకోసం వీరు పోస్టల్ శాఖ కంటే రెట్టింపు డబ్బు వసూలు చేస్తూ ‘కొరియర్ నిర్వాహకులతో’ కలిసి పంచుకుంటున్నారు. మరోపక్క ఔషధాల రవాణాకు సంబంధించి ప్రైవేట్ కొరియర్ సంస్థలు మరో దందాకు తెరలేపాయి. ఇవన్నీ వెరసి ఔషధాలు పంపే వ్యక్తికి ఆర్థిక భారం, నిబంధనలకు తూట్లు తప్పట్లేదు. ఈ ‘డ్రగ్ పార్శిల్ మాఫియా’పై ‘సాక్షి’ చేసిన పరిశీలనలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. అక్కడ ‘వైద్యం’ చాలా ఖరీదు.. హైదరాబాద్ సహా రాష్ట్రంలోని అనేక ప్రాంతాలకు చెందిన వేల మంది ప్రస్తుతం విదేశాల్లో నివసిస్తున్నారు. అమెరికా సహా మరికొన్ని దేశాల్లో వైద్యం అత్యంత ఖరీదైన అంశం. అమెరికానే తీసుకుంటే.. మనదేశంలో మాదిరిగా చిన్నచిన్న ఆరోగ్య సమస్యలకు నేరుగా ఫార్మసీకి వెళ్లి ఔషధాలు ఖరీదు చేసుకోవడం సాధ్యం కాదు. వైద్యుడు రాసిచ్చిన మందుల చీటీ ఉంటే తప్ప వీటిని విక్రయిం చరు. ఆ దేశంలో సాధారణ డాక్టర్‌ను సంప్రదిస్తే కనీసం 350 డాలర్లు, ఎండీ స్థాయి వైద్యుడి దగ్గరకు వెళితే 500 డాలర్లు చెల్లించాలి. ఈ కన్సల్టేషన్‌కు తోడు ఆయా వైద్యులు పూర్తి పరీక్షలు చేస్తే తప్ప మందులు రాయరు. దీంతో భారీ మొత్తం వెచ్చించాల్సిందే. ఇంతా చేసినా అక్కడ లభించే ఔషధాలు సైతం అత్యం త ఖరీదుతో కూడి ఉంటాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికీ తమలో అనేక మంది ఇండియాలోని వైద్యులను సంప్రదించి, ఔషధాలను సైతం పార్శిల్లో తెప్పించుకుంటామని ప్రవాస భారతీయులు చెబుతున్నారు. తాజాగా మారిన నిబంధనలు.. నగరంలో నివసిస్తున్న ప్రవాస భారతీయులకు అవసరమైన ఔషధాలను పార్శిల్ చేయడానికి వారి బంధువులు ప్రాథమికంగా పోస్టాఫీసులనే సంప్రదిస్తుం టారు. ప్రధానంగా అబిడ్స్‌లోని జనరల్ పోస్టాఫీస్‌కు (జీపీఓ) వీరి తాకిడి ఎక్కువగా ఉంటోంది. అక్కడి అధికారులు ఈ పార్శిల్స్‌ను నేరుగా తీసుకోవడానికి లేదు. పోస్టల్ ద్వారా భారత్ నుంచి విదేశాలకు వెళ్లే పార్శిల్స్ అన్నీ ముంబైలోని ప్రధాన పోస్టల్ కార్యాలయం ద్వారానే వెళ్తుంటాయి. ఇటీవల ముంబైలోని ఆ కార్యాలయం నుంచి పోస్టల్ అధికారులు ఓ సర్క్యులర్ వచ్చింది. దీని ప్రకారం... {దవ రూపంలో ఉండే టానిక్స్, ఆయింట్మెం ట్స్‌ను పార్శిల్ చేయడానికి అంగీకరించకూడదు. మాత్రలు (పిల్స్) సైతం ఒక్క డోస్ మాత్రమే పంపాలి. సదరు ఔషధంతో పాటు వైద్యుడు రాసిచ్చిన మందుల చీటీ, ఔషధాలు ఖరీదు చేసిన బిల్లు, ఔషధ నియంత్రణ శాఖ నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) తీసుకువచ్చి జీపీఓ అధికారులకు చూపించాలి ఆపై పార్శిల్ చేస్తున్న వ్యక్తి తన గుర్తింపు పత్రాలతో పాటు డిక్లరేషన్ ఇవ్వాలి. పోస్టల్ పార్శిల్ ఓ నరకం.. ఈ నిబంధనలు పార్శిల్స్ చేసే వ్యక్తులకు ‘బంధనాలు’గా మారుతున్నాయి. ప్రచారం లేని కారణంగా వీటి విషయం తెలియక ఔషధాలను (పిల్స్ సైతం) పక్కాగా పార్శిల్ చేసి జీపీఓను సంప్రదిస్తే వాటిని పం పేందుకు అంగీకరించడం లేదు. తాజా మార్పుల ప్రకారం అవసరమైన పత్రాలు తీసుకురమ్మంటూ చెప్తున్న అధికారులు.. ముందే పార్శిల్ చేసి తీసుకువస్తే కుదరదని, తాము చూసిన తర్వాత పార్శిల్‌కు సీల్ వేయాలని స్పష్టం చేస్తున్నారు. నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) కోసం ఆయుష్ విభాగాన్ని ఆశ్రయించమని సూచిస్తున్నారు. అక్కడకు వెళ్లిన వారికీ చేదు అనుభవమే ఎదురవుతోంది. తాము ఆ తరహా ఎన్ఓసీలు జారీ చేయట్లేదని, చట్టప్రకారం తమకు ఆ అధికారం లేదని చెప్పి, డ్రగ్ కంట్రోల్ విభాగాన్ని సంప్రదించమని సూచిస్తున్నారు. ఔషధాలు విదేశాలకు పంపడమనేది అత్యవసర అంశం కావడంతో వినియోగదారులు తప్పనిసరి పరిస్థితుల్లో ‘పక్కదారులు’ వెదుకుతున్నారు. ఏ పత్రం లేకుండానే పార్శిల్.. సరిగ్గా ఇదే సమయంలో జీపీఓ చుట్టూ ఉండే ‘డమ్మీ కొరియర్’ నిర్వాహకులు తెరపైకి వస్తున్నారు. తమకు పోస్టల్ శాఖకు చెందిన ఉద్యోగులతో సంబంధాలు ఉన్నాయని చెబుతున్నారు. ఔషధాలు పార్శిల్ చేయడానికి ఎలాంటి పత్రాలు అవసరంలేదని, కోరినంత ఇస్తే టానిక్స్, ఆయింట్‌మెంట్స్‌ను విదేశాలకు పార్శిల్ చేస్తామంటున్నారు. ఇందుకు అవసరమైన స్టాంపులన్నీ పోస్టల్ ఉద్యోగులే వేస్తారని హామీ కూడా ఇస్తున్నారు. ఈ విషయాన్ని ధ్రువీకరించేందుకు ‘సాక్షి’ కొన్ని ఔషధాల్ని అమెరికాకు పార్శిల్ చేసింది. జూన్ మొదటి వారంలో డమ్మీ కొరియర్ సంస్థ నిర్వాహకులు పార్శిల్‌ను అంగీకరిస్తూ రూ.1250 వసూలు చేసి రసీదు ఇచ్చారు. ఎన్ఓసీ, డిక్లరేషన్ సహా ఏ పత్రాన్నీ కోరలేదు. ఈ పార్శిల్‌ను సదరు ‘డమ్మీ కొరియర్’ నిర్వాహకుడు జూబ్లీహిల్స్‌లోని పోస్టల్ ప్రధాన కార్యాలయం నుంచి విదేశాలకు పంపేశాడు. ఆ పార్శిల్ వివరాలకు ట్రాక్ చేసుకోవచ్చంటూ దానికి సంబంధించిన నెంబర్‌ను సైతం ‘సాక్షి’కి అందించాడు. ‘ఇండియా పోస్ట్’ వెబ్సైట్ ద్వారా ఈ నెంబర్‌ను ట్రాక్ చేస్తే సదరు ఔషధాల పార్శిల్ జూబ్లీహిల్స్ నుంచి ముంబై మీదుగా అమెరికా చేరినట్లు స్పష్టమైంది. పోస్టల్ శాఖ రికార్డుల ప్రకారం దీని ధర (టారిఫ్) రూ.670గా ఉంది. మిగిలిన రూ.580 పోస్టల్ ఉద్యోగులు, డమ్మీ కొరియర్ నిర్వాహకులు పంచుకుంటున్నారని స్పష్టమైంది. ఒక్క హైదరాబాద్ నుంచే ఈ విధంగా రోజూ వందల పార్శిల్స్ వెళ్తుండటంతో ఆయా సిబ్బంది అక్రమార్జన రోజుకు రూ.వేలల్లోనే ఉంటోందని తెలుస్తోంది. ప్రముఖ సంస్థలది మరోదారి.. తాజాగా అమలులోకి వచ్చిన పోస్టల్ నిబంధనలను ఆసరాగా చేసుకుంటున్న ప్రముఖ కొరియర్ సంస్థలూ అడ్డదారి తొక్కుతున్నాయి. డమ్మీ కొరియర్ ద్వారా పోస్ట్‌లో పార్శిల్ పంపిన ‘సాక్షి’.. ఈ విషయంపై కొన్ని ప్రముఖ కొరియర్ సంస్థలను సంప్రదించింది. తొలుత ఔషధాల పార్శిల్స్ సేకరించమని చెప్పిన ఆయా నిర్వాహకులు.. కార్యాలయాలకు వచ్చి కలవాల్సిందిగా కోరుతున్నారు. అలా వెళ్తే 250 గ్రాముల కంటే తక్కువ బరువు ఉండే పార్శిల్‌ను అమెరికాకు పంపడానికి రూ.2100 ఖర్చవుతుందని చెప్తున్నారు. ఔషధాలు పంపేందుకు నిబంధనలు అంగీకరించవని, అయినప్పటికీ తాము రిస్క్ తీసుకుని పంపిస్తామని హామీ ఇస్తున్నారు. దీని నిమిత్తం అదనంగా రూ.750 చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. ఈ రకంగా అమలులో ఉన్న నిబంధనలకు తూట్లు పొడుస్తున్న కొరియర్ నిర్వాహకులు, పోస్టల్ శాఖ ఉద్యోగులు అవసరంలో ఉన్న వారిని అడ్డంగా దోచుకుంటున్నారు. నిబంధనల్ని సరళీకరించి, వాటిపై ప్రచారం కల్పిస్తే వినియోగదారులు ‘పక్క దారులు’ పట్టాల్సిన అవసరమే ఉండదు. సంబంధిత అధికారులు ఈ విషయంపై దృష్టిపెట్టి చర్యలు తీసుకోవాల్సి ఉంది. -
అంతా శ్రీరంగడి సతీమణి దయే!
ఏమిచేతురా రంగా అన్నా దిక్కుండదు... ఇంటి వరండాలో కూర్చుని ఓ చేత్తో పేపర్ పట్టుకుని... అంతర్జాతీయ ద్రవ్యనిధీ, భారత విత్త విధానం- దాని లోపాలు... అంటూ తన ఫ్రెండ్‌తో దేశ ఆర్థిక విధానాల్లోని లోటుపాట్లు చర్చిస్తున్నారు శ్రీవారు. అంతలోనే కొరియర్ కుర్రాడు వచ్చి, ఏదో లెటర్ లాంటిది ఆయన చేతిలో పెట్టాడు. అంతే! అప్పటివరకూ సీరియస్‌గా ఏవేవో చర్చించుకుంటున్న ఆ ఫ్రెండ్‌తో తర్వాత కలుస్తానంటూ ఇంట్లోకి వచ్చారు. వచ్చీ రాగానే... ‘‘ఏవోయ్... ఇది చూశావా? పెద్దదానికి ఇంజనీరింగ్ సీట్ కన్ఫర్మ్ అయ్యిందట. మొదటి టర్మ్‌లో లక్షా నలభైవేలు కట్టాలట. ఇంత పెద్ద మొత్తం ఎలా పూలప్ చేస్తాం? ఏదో ఆ పై నలభయ్యో, యాభయ్యో అంటే సర్దగలను కానీ... దాదాపుగా లక్షన్నర... అదీ ఇప్పటికిప్పుడు ఎలా’’ అంటూ దిగులుపడిపోయారు. ‘‘ఇప్పటివరకూ దేశ ఆర్థిక పరిస్థితినంతా మీ భుజస్కంధాల మీదే మోస్తున్నట్లు మాట్లాడారు కదండీ. ఇంతలోనే ఇలా డీలా పడిపోవడం ఎందుకు?’’అడిగ్గాన్నేను. ‘‘అవన్నీ అంతర్జాతీయ విత్త వ్యవహారాలూ, ద్వైపాక్షిక వాణిజ్య ద్రవ్యవిధానాలు. చెప్పినా నీకర్థం కావు. కానీ ఈ డబ్బు వ్యవహారం ఎలా చేద్దామో చెప్పు’’ అన్నారు. మౌనంగా నేను వంటింట్లోకి వెళ్లబోతుంటే... ‘‘చెట్టంత మనిషిని ఇలా దిగాలు పడిపోతూ ఉంటే నిమ్మకు నీరెత్తినట్టుగా నీ దగ్గర్నుంచి ఓ చడీ చప్పుడూ, ఓ ఆందోళనా గీందోళనా ఏదీ లేదేంటి?’’ అంటూ ఉక్రోషపడిపోయారు. ‘‘ఏదో, ఎలాగో చేద్దాం లేండి. మీరిప్పట్నుంచే ఆందోళనపడకండి. ముందు మీరు తెస్తానన్న ఆ నలభై వేలూ ఏటీఎమ్నుంచి డ్రా చేసి తీసుకురండి’’ అంటూ అప్పటికి ఆయనను సముదాయించా. పెద్దదాని ఇంజనీరింగ్ సీటు కోసం చెల్లించాల్సిన అడ్మిషన్ ఫీజు డబ్బు సర్దుబాటు చేసి ఆయన చేతిలో పెట్టా. ఆ డబ్బు కట్టి వచ్చాక ‘‘అవునూ... ఒక్కసారిగా లక్ష రూపాయలు ఎలా పూలప్ చేశావ్’’ అడిగారాయన ఆసక్తిగా. ‘‘నాకు ఐఎమ్మెఫ్లూ, విత్త విధానాలూ, ద్రవ్య వ్యవహారాలూ తెలియదుగానీ... దిగుల్లేకుండా ఇల్లు ఎలా గడపాలన్న చింత మాత్రం ఉంటుంది. ఆ ఆలోచనే చాలామంది ఆడవాళ్లలో మొగుడికి తెలియకుండా ఏదో చేయిస్తుంది’’ ఉపోద్ఘాతంగా అన్నాన్నేను. ‘‘చెప్పు... అంత డబ్బు ఎలా సర్దుబాటు చేశావ్’’ అంటూ సముదాయింపుకీ, లాలనకీ దిగారాయన! ‘‘అప్పట్లో మీకేవో ఎరియర్స్ వచ్చాయనీ, బంగారం కొనుక్కోమనీ నాకు లక్షరూపాయలిచ్చారు గుర్తుందా. అది మన ఇంటి ఓనర్‌గారికి రెండు రూపాయల వడ్డీకి ఇచ్చా. ఆయన ఇచ్చే వడ్డీని ఖర్చు చేయకుండా మళ్లీ మన కాలనీలోనే ఒకరి దగ్గర చిట్టీ వేసి ఆ వడ్డీనే దీనికి ప్రీమియంగా పే చేస్తూ వచ్చా. ఆ అమౌంట్ మెచ్యూర్ అయ్యాక దాన్ని డ్రా చేసి బ్యాంకులోఎఫ్డీ చేశా. అయితే దీర్ఘకాలికంగా కాకుండా 45రోజులూ, 90 రోజుల కోసమే డిపాజిట్ చేస్తూ ఎప్పుడు అవసరం వచ్చినా తీసుకునేలా ప్లాన్ చేశా. మన లక్ష అలాగే ఉంది. అదనంగా వచ్చిన ఆ లక్షా సమయానికి అందించగలిగా’’ అంటూ అసలు విషయం చెప్పాను. ‘‘ఇప్పుడు తెలిసింది... నాకోసంగతి’’ అన్నారాయన. ‘‘ఏవిటో అది?’’ అడిగాను ఆసక్తిగా. ‘‘హోటళ్లూ, దుకాణాలూ, ఫ్యాన్సీ కొట్లూ... వీటన్నింటిలోనూ లక్ష్మీదేవి పద్మం మీద ఆసీనురాలై అరచేతిలోంచి డబ్బు రాలుస్తూ ఉన్న ఫొటోయే పెడతారుగానీ... విష్ణుమూర్తి సైడుకు పడుకోగా... లక్ష్మీదేవి కాళ్లొత్తుతున్న ఫొటో మాత్రం పెట్టరు. అలాంటి ఫొటోలు పూజగదుల్లోనే ఎందుకుంచుతారో ఇప్పటికి తెలిసింది’’ అన్నారాయన. ‘‘ఎందుకంటారూ?’’ ఉత్సాహంతో అడిగా. ‘‘ఆడవాళ్లెప్పుడూ... ఇల్లు ఏ కష్టం లేకుండా, చేతిలో డబ్బు గలగలలాడుతూ గడిచిపోవాలని కోరుకుంటూ ఉంటారు. అందుకే అరచేతిలోంచి కాసులు రాలుస్తున్న లక్ష్మీదేవి ఫొటోలనే బట్టల దుకాణాల్లో, ఫ్యాన్సీ షాపుల్లో పెడుతుంటారు. ఏమో అనుకున్నాగానీ... నువ్వు ఫొటోలో లేకుండా ఉన్న వాకింగ్ మహాలక్ష్మివే సుమా’’ అంటూ మొదటిసారిగా నన్ను మెచ్చుకున్నారు మావారు. -వై! -
ఆన్లైన్లో..అనుబంధం..
ఒకప్పుడు రాఖీ పండుగ అంటే.. రాఖీ కొనాలి... దానిని పోస్ట్ లేదా కొరియర్ ద్వారా పంపించేందుకు సెంటర్‌కు వెళ్లడం, కవర్లు కొనడం వంటి ఇబ్బందులు ఉండేవి. ఇంత చేసినా చిరిగిపోకుండా ఆత్మీయులైన సోదరులకు రాఖీలు అందుతాయా, అదీ సమయానికి చేరుతాయా, లేదా అనే అనుమానాలతో అక్కాచెల్లెళ్లు మధనపడేవారు. ఇలాంటి ఇబ్బందులను తీర్చేందుకు ఆన్లైన్ ద్వారా రాఖీలు పంపించే పద్ధతి అందుబాటులోకి వచ్చేసింది. కేవలం ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న కంప్యూటర్ లేదా స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు.. ఒక్క క్లిక్ ద్వారా నిర్ణీత చిరునామాకు రాఖీ చేరిపోతుంది. జిల్లా, రాష్ట్రం, దేశం, విదేశాల్లో ఎక్కడికైనా రాఖీ పంపించే సౌకర్యాన్ని పలు వెబ్సైట్లు అందుబాటులోకి తెచ్చాయి. దీంతో వరంగల్ నగరంలోని పలువురు మహిళలు, యువతులు ఈసారి తమ సోదరులకు ఆన్లైన్లో రాఖీలు పంపించేందుకు సిద్ధమయ్యారు. షాపుల్లో మాదిరిగానే... రాఖీలు అమ్మే షాప్‌నకు వెళ్తే వేల రకాలు.. బంగారు, వెండి రాఖీలు ఇలా ఎన్నో అందుబాటులో ఉంటాయి. మనకు నచ్చిందే కొనుగోలు చేసే వెసులుబాటు ఉంటుంది. అయితే ఆన్లైన్లో అన్ని రకాలు ఉంటాయా, లేదా అనే బెంగ కొందరికి ఉంది. కానీ ఆన్లైన్లో కూడా వేల సంఖ్యలో రకాల రాఖీలు అందుబాటులో ఉంచడంతో మహిళలు, యువతులు ఈసారి ఇంటర్నెట్ రాఖీకే తమ ఓటు అంటున్నారు. దీంతో ఈ సారి నగరం నుంచి సుమారుగా 10వేల మందికి పైగానే తమ సోదరులకు ఆన్లైన్ ద్వారా రాఖీలు పంపించనున్నట్లు మార్కెట్ వర్గాల అంచనా. వేల రకాలు తక్కువ నాణ్యత గల వజ్రాలు పొదిగిన రాఖీ, బంగారు పూతతో చేసిన రాఖీ, ముత్యాల జర్దోసి రాఖీ.. ఇలా చెప్పుకుంటే పోతే ఆన్లైన్లో కూడా వెయ్యికి పైగా రకాల రాఖీలు దర్శనమిస్తున్నాయి. ఇక చిన్నపిల్లల మనస్సు దోచే చోటా బీమ్, మిక్కీ మౌస్, యాంగ్రీ బర్డ్స్ బొమ్మలతో కూడిన రాఖీలకు కొదువే లేదు. రూ.300 నుంచి రూ.10వేల వరకు ధరలో విభిన్న రాఖీలు ఆన్లైన్లో సిద్ధంగా ఉన్నాయి. -
అడవి బాట వీడి..సర్కారు కొలువుకు
17 ఏళ్ల ఉద్యమ జీవితం లొంగుబాటు తర్వాత మళ్లీ చదువు ఇంజనీరింగ్ విద్య పూర్తికి ప్రత్యేక అనుమతి ఇచ్చిన ప్రభుత్వం తోడ్పాటు అందించిన పోలీసు అధికారి కాళిదాసు ఎంటెక్ పూర్తి.. ఆ వెంటనే ఉద్యోగం ఇదీ.. గసికంటి రాజమౌళి ప్రస్థానం మీడియూకు పరిచయం చేసిన ఎస్పీ వరంగల్ క్రైం, న్యూస్‌లైన్ : తెలంగాణ రాఘవ... ఇప్పుడు ఈ పేరు చెబితే ఎవరికీ తెలియదు. 1990 నుంచి 2007 వరకు మాత్రం ఈ పేరు కొన్ని ప్రాంతాల్లో చాలా మందికి తెలిసి ఉండేది. నల్లమల, దండకారణ్యం, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఈ పేరు తెలిసినవారు ఎక్కువగానే ఉండేవారు. ముఖ్యంగా పోలీసు శాఖ వారికి బాగా తెలిసిన పేరు ఇది. తెలంగాణ రాఘవ పేరుతో 17 ఏళ్లపాటు పీపుల్స్‌వార్ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న ఈ వ్యక్తి అసలు పేరు గసికంటి రాజమౌళి. కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ సొంత ఊరు. పేద కుటుంబంలో జన్మించిన రాజమౌళి కష్టపడి చదివి ఉస్మానియా యూనివర్సిటీలో సివిల్ ఇంజనీరింగ్ కోర్సులో సీటు సంపాదించాడు. అయితే 1990లో ఇంజనీరింగ్ ఆఖరు సంవత్సరంలో ఉన్నప్పుడు ఉద్యమబాట పట్టాడు. పీపుల్స్‌వార్‌లో చేరి వికారాబాద్, అనంతపురం, కర్నూలు ప్రాంతాల్లో కొరియర్‌గా, డిప్యూటీ కమాండర్‌గా, కమాండర్‌గా పనిచేశారు. పుపుల్స్వార్ అగ్రనేతలు పులి అంజన్న(సాగర్), అక్కిరాజు హరగోపాల్(ఆర్కె)లకు కొరియర్‌గా కూడా ఆయన పని చేశారు. టైగర్ ప్రాజెక్టు దళంలోనూ కొనసాగారు. మహానంది, ఉరవకొండ దళాలకు డిప్యూటీ కమాండర్‌గా, ఉరవకొండ దళానికి కమాండర్‌గా పని చేశారు. 2004 నుంచి 2007 వరకు దండకారణ్యంలో మావోయిస్టు పత్రిక క్రాంతి కొంత కాలం పనిచేశారు. ఆ తర్వాత అనార్యోగం కారణంగా 2007లో ఏప్రిల్ 9న రాజమౌళి కరీంనగర్లో లొంగిపోయారు. ఉద్యమ పంథాలో అలవడిన పట్టుదలతో మళ్లీ చదువు కొనసాగించాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఇంజనీరింగ్ కోర్సును ఎనిమిదేళ్లలోనే పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆయన విద్యలో 17 ఏళ్ల విరామం రావడంతో నిబంధనలు అంగీకరించ లేదు. దీంతో లొంగుబాటు సమయంలో తీవ్రవాద నియంత్రణ విభాగంలో ఎస్పీ స్థాయి అధికారిగా ఉన్న ఎల్.కాళిదాసు (ప్రస్తుతం వరంగల్ రూరల్ ఎస్పీ)తో రాజమౌళికి పరిచయం ఉండడంతో రాఘవ.. కాళిదాసును సంప్రదించారు. కాళిదాసు చొరవతో అదే ఏడాది ప్రభుత్వం ఆయనకు ఇంజనీరింగ్ విద్య పూర్తిచేయడానికి ప్రత్యేకంగా అనుమతి ఇచ్చింది. రాజమౌళి ఉస్మానియాలో ఇంజనీరింగ్ ఫైనలియర్ పూర్తి చేశారు. ఆ వెంటనే గేట్ ఉత్తీర్ణత సాధించి ఉస్మానియా యూనివర్సిటీలోనే ఎంటెక్ పూర్తి చేశారు. 2008లో సాగు నీటిపారుదల శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టుల భర్తీ కోసం ఏపీసీఎస్సీ నోటిఫికేషన్ రాగా.. పరీక్ష రాసి ఉత్తీర్ణుడయ్యూరు. 2012లో రాజమౌళికి పోస్టింగ్ వచ్చింది. గసికంటి రాజమౌళి ప్రస్తుతం జనగామలో ఎస్ఆర్ఎస్పీ రెండో దశ విభాగంలో ఏఈఈగా పని చేస్తున్నారు. గసికంటి రాజమౌళిని వరంగల్ రూరల్ ఎస్పీ కాళిదాసు, ఓఎస్డీ అంబర్‌కిశోర్‌ఝా బుధవారం మీడియాకు పరిచయం చేశారు. ఉస్మానియా వర్సిటీ నుంచి జనగామకు వచ్చిన తన నేపథ్యంపై రాజమౌళి ఈ సందర్భంగా వివరించారు. తన జీవితంలో మంచి ఉంటే ఎవరికైనా ఉపయోగపడాలని ఆకాంక్షతోనే మీడియా మందకు వచ్చినట్లు తెలిపారు. వరంగల్ రూరల్ ఎస్పీ కాళిదాసు ప్రోత్సాహంతోనే తాను ప్రస్తుతం ఈ స్థితిలో ఉన్నానని రాజమౌళి చెప్పారు. కాళిదాసు తనకు అన్ని రకాలుగా అండగా నిలిచారని పేర్కొన్నారు. చాలా వ్యవస్థల మాదిరిగానే పీపుల్స్వార్లోనూ గసికంటి రాజమౌళి వివక్ష ఎదుర్కొన్నారని రూరల్ ఎస్పీ కాళిదాసు వివరించారు. -
ఇకమొబైల్ కామర్స్ హవా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రాబోయే రోజుల్లో మొబైల్ కామర్స్ (ఎం-కామర్స్) భారీగా పెరుగుతుందని ఆన్లైన్ రిటైలింగ్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ సహ-వ్యవస్థాపకుడు సచిన్ బన్సల్ తెలిపారు. ల్యాప్‌టాప్‌లు వంటి సాధనాల ద్వారా ఈ-కామర్స్ లావాదేవీలు జరపడం కన్నా మొబైల్ యాప్స్ వంటి వాటి ద్వారా షాపింగ్ చేయడం పెరుగుతుందన్నారు. దీంతో, ప్రస్తుతం సుమారు పది శాతంగా ఉన్న ఎం-కామర్స్ వాటా రాబోయే రెండేళ్లలో యాభై శాతానికి పెరగగలదని పేర్కొన్నారు. ఈ మార్పులకు అనుగుణంగా తమను తాము మార్చుకోగలిగిన కంపెనీలే మనుగడ సాగించగలవని చెప్పారు. శుక్రవారం ఏఐఈఎస్ఈసీ ఆధ్వర్యంలో ఇక్కడ జరిగిన యూత్ టు బిజినెస్ ఫోరమ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా సచిన్ బన్సల్ మీడి యాకు ఈ వివరాలు తెలిపారు. దేశీయంగా ఈ-కామర్స్ మార్కెట్లో నిలదొక్కుకోవాలంటే కంపెనీలు కేవలం రిటైలింగ్కి మాత్రమే పరిమితం కాకుండా రవాణా తదితర అంశాలపై కూడా దృష్టి పెట్టాల్సి ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో దీర్ఘకాలిక దృష్టితో సర్వీసులను పెద్ద స్థాయిలో విస్తరించేందుకు మౌలిక సదుపాయాలు (గిడ్డంగులు మొదలైనవి), టెక్నాలజీపైన భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నామని ఆయన చెప్పారు. మారు మూల ప్రాంతాలకు కూడా ఈ-కామర్స్ విస్తరించేలా చూడటం ధ్యేయంగా పనిచేస్తున్నామని బన్సల్ వివరించారు. వృద్ధిపైనే దృష్టి.. ఈ-కామర్స్‌లో మార్జిన్లు చాలా స్వల్పంగా ఉంటాయని, అయితే ప్రస్తుతం లాభదాయకత గురించి ఆలోచించడం కన్నా వేగంగా వృద్ధి సాధించడంపైనే దృష్టి పెట్టినట్లు బన్సల్ వివరించారు. ప్రస్తుతం బిలియన్ డాలర్ల స్థాయికి ఎదిగే దిశగా కంపెనీ అడుగులు వేస్తోందని, త్వరలోనే దీన్ని సాధించగలమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఫ్లిప్‌కార్ట్‌లో జరిగే లావాదేవీల విషయానికొస్తే ట్యాబ్లెట్స్ మొదలైన ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులు అత్యధికంగా అమ్ముడవుతున్నట్లు బన్సల్ చెప్పారు. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో 1,000 పైగా విక్రేతలు ఉన్నారని, ఈ సంఖ్యను మరింత పెంచే విధంగా టెక్నాలజీ ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేస్తున్నామన్నారు. అంతకు ముందు.. యువతలో నాయకత్వ ధోరణి పెంపొందించేందుకు ఏర్పాటు చేసిన ఏఐఈఎస్ఈసీ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా బన్సల్ల్తో పాటు టాటా సన్స్ చీఫ్ ఎథిక్స్ ఆఫీసర్ ముకుంద్ గోవింద్ రాజన్, కోకకోలా ఇండియా వైస్ ప్రెసిడెంట్ దీపక్ జోలీ, మైక్రోసాఫ్ట్ ఇండియా డెరైక్టర్ రజనీష్ మీనన్ వ్యాపార రంగంలో తమ అనుభవాలను వివరించారు. -
ఆగని ‘కొరియర్’ దందా
సాక్షి,సిటీబ్యూరో: నగరంలో ఎన్ని ఉదంతాలు చోటుచేసుకుంటున్నా..దుండగులు ఎన్నిసార్లు పంజా విసిరినా...బంగారం వ్యాపారుల్లో మాత్రం మార్పు రావట్లేదు. యంత్రాంగాలు పట్టనట్లు వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఇప్పటికీ కొరియర్ సంస్థల ద్వారా రూ.కోట్ల విలువైన బంగారం,వజ్రాలను తెప్పించేస్తున్నారు. ముం బై సెంట్రల్ రైల్వేస్టేషన్‌కు చెందిన గవర్నమెంట్ రైల్వే పోలీసు (జీఆర్పీ) అధికారులు గురువారం ముగ్గురు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకోవడంతో ఈ విషయం మరోసారి తెరపైకి వచ్చింది. సూరత్ నుంచి హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ జ్యువెలరీ దుకాణంలో డెలివరీ ఇచ్చేందుకు వీరు తీసుకొస్తున్న రూ.కోటి విలువైన బంగారం వజ్రాలను జీఆర్పీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముంబై సెంట్రల్ స్టేషన్లో జైపూర్ సూపర్ ఫాస్ట్ఎక్స్ప్రెస్ దిగిన కౌషల్ తివారీ,భరత్ పటేల్, శైలేంద్రసింగ్ వెనుక గేటు ద్వారా స్టేష న్ దాటేందుకు యత్నిస్తుండగా జీఆర్పీ సిబ్బ ంది అదుపులోకి తీసుకొని తనిఖీ చేశారు. వాటిలో ఎలాంటి బిల్లులు, పత్రాలు లేని రూ. కోటి విలువైన బంగారం,వజ్రాలు ఉండటంతో స్వాధీనం చేసుకున్నారు. విచారణ నేపథ్యంలో తాము బీవీ చినాయ్ అనే కొరియర్ సంస్థ ఉద్యోగులమని, సూరత్‌లోని బీడీ జ్యువెలర్స్ నుంచి హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ జ్యువెలరీ సంస్థకు ఈ సొత్తును డెలివరీ చేయడానికి వెళ్తున్నామని చెప్పడంతో విషయాన్ని ఐటీశాఖకు చేరవేశారు. అయితే ఇక్కడ జీఆర్పీ అధికారులకు అంతుచిక్కని విషయం వారు ప్రయాణిస్తున్న మార్గమే. సూరత్‌కు చెందిన అనేక మంది బంగారం వ్యాపారులు పన్నుల్ని తప్పించుకోవడానికి బంగారం,వజ్రాలను ఇలానే డెలివరీ చేస్తున్నారంటూ ఈ త్రయం బయటపెట్టారు. దీంతో ఈ కేసును జీఆర్పీ పోలీసులు ఐటీ అధికారులకు అప్పగించారు.