ద్వారకాతిరుమల: తిరుమలంపాలెంకు చెందిన దివ్యాంగుడైన ఓ కొరియర్ బాయ్ ఈ నెల 18న అదృశ్యం కాగా, శనివారం గ్రామం శివారులో ఉన్న ఓ కొబ్బరితోటలో చెట్టుకు వేలాడుతూ విగతజీవిగా కనిపించాడు. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన దివ్యాంగుడైన నాయుడు శివదుర్గ ప్రసాద్ (26) ద్వారకాతిరుమలలోని ఈ–కార్ట్‌లో కొరియర్ బాయ్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల 18న శివదుర్గ ప్రసాద్ అదృశ్యం కాగా, సోదరుడి ఫిర్యాదు మేరకు ఈ నెల 19న మిస్సింగ్ కేసు నమోదైంది.
ఇదిలా ఉంటే తిరుమలంపాలెం శివారులోని ఒక కోకో, కొబ్బరి తోటలోకి శనివారం పనులకు వెళ్లిన కూలీలకు ఓ మృతదేహం చెట్టుకు వేలాడుతూ కనిపించింది. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించగా, ఎస్సై టి.సుధీర్ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి ప్రసాద్‌గా గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు తరలించారు. క్రికెట్ బెట్టింగ్‌ల కారణంగా శివదుర్గ ప్రసాద్ అప్పులపాలై ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని స్థానికులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment