న్యూఢిల్లీ: జాతీయ రహదారుల డెవలపర్లు ప్రీమియాల చెల్లింపులను కొంతకాలం వాయిదా వేసేలా రీషెడ్యూల్ చేసే ప్రతిపాదనను కేంద్ర క్యాబినెట్ మంగళవారం ఆమోదించింది. దీన్ని సమగ్రంగా తీర్చిదిద్దాలని ప్రత్యేక కమిటీకి సూచించింది. హైవేస్ శాఖ అధికారి ఒకరు ఈ విషయాలు తెలిపారు. ప్రాజెక్టుల్లో జాప్యం జరుగుతూ, అధిక ప్రీమియాలు చెల్లించడంలో సమస్యలు ఎదుర్కొంటున్న జీవీకే, జీఎంఆర్, అశోక బిల్డ్‌కాన్ వంటి ఇన్‌ఫ్రా దిగ్గజాలకు ఈ నిర్ణయం కాస్త ఊరటనివ్వనుంది. బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్‌ఫర్ ప్రాజె క్టులు దక్కించుకున్న సంస్థలు.. ఎన్‌హెచ్‌ఏఐ (నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా)కి ప్రీమియాలు చెల్లించాల్సి ఉంటుంది.
సాధారణంగా ఆయా ప్రాజెక్టులపై వచ్చే టోల్ ఫీజు అంచనాల ఆధారంగా ఎంత ప్రీమియం చెల్లిస్తాయనేది బిడ్డింగ్ సమయంలోనే కంపెనీలు తెలియజేయాలి. వివిధ సమస్యలు ఎదుర్కొంటున్న సుమారు 23 ప్రాజెక్టులకు సంబంధించి రూ. 1 లక్ష కోట్ల ప్రీమియాల రీషెడ్యూలింగ్‌కి అనుమతి కోరుతూ హైవేస్ శాఖ ..క్యాబినెట్‌కి ప్రతిపదన పంపింది. దానిమీదే క్యాబినెట్ తాజా ఆమోదముద్ర వేసింది. అన్ని ప్రాజెక్టులను ఒకే గాటన కట్టకుండా.. ప్రాజెక్టును బట్టి రీషెడ్యూల్ అవకాశాన్ని పరిశీలించడం జరుగుతుందని అధికారి తెలిపారు. మరోవైపు, ఈ విషయంలో వివక్ష చూపకుండా అందరినీ సమానంగా చూడాలంటూ నెషనల్ హైవేస్ బిల్డర్స్ ఫెడరేషన్ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు గతవారం లేఖ రాసింది.
హైవే ప్రాజెక్టుల ప్రీమియం వాయిదాకు ఆమోదం
Published Wed, Oct 9 2013 2:02 AM | Last Updated on Fri, Sep 1 2017 11:27 PM
Advertisement