న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా దాదాపు 34 విద్యుదుత్పత్తి ప్రాజెక్టులు భారీ రుణాల భారంతో సతమతమవుతున్నాయి. వీటిలో ల్యాంకోకి చెందిన ప్రాజెక్టులు 4, జీఎంఆర్ ఎనర్జీకి చెందినవి మూడు, జీవీకే ఇండస్ట్రీస్ ప్రాజెక్టు ఒకటి ఉన్నాయి. విద్యుత్ రంగంలో తీవ్ర ఆర్థిక ఒత్తిడిలో ఉన్న/నిరర్థక ఆస్తులుగా మారిన ప్రాజెక్టులపై పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో స్టాండింగ్ కమిటీ (విద్యుత్ రంగం) ఈ విషయాలు పొందుపర్చింది. 2017 జూన్ నాటికి ఆర్‌బీఐ గణాంకాల ప్రకారం వీటి విలువ సుమారు రూ. 1.74 లక్షల కోట్లుగా ఉంది.
అదానీ, ఎస్సార్, జేపీ ప్రాజెక్టులు కూడా వీటిలో ఉన్నాయి. నివేదిక ప్రకారం ల్యాంకోకి చెందిన అమర్ కంటక్ ప్రాజెక్టు రుణ బకాయి రూ.8,782 కోట్లు, అన్‌పారా (రూ. 3,071 కోట్లు), విదర్భ (రూ. 4,762 కోట్లు), బాబంధ్ రుణాలు రూ. 6,976 కోట్లు మేర ఉన్నాయి. అటు జీఎంఆర్ ఎనర్జీ వరోరా ప్రాజెక్టు రుణభారం రూ. 2,905 కోట్లు, రాయ్‌ఖేడా (రూ. 8,174 కోట్లు), కమలాంగా ప్రాజెక్టు రుణం రూ. 4,100 కోట్లుగా ఉంది. జీవీకే ఇండస్ట్రీస్‌కి చెందిన గోయింద్వాల్ సాహెబ్ ప్రాజెక్టు బకాయిలు రూ. 3,523 కోట్ల మేర ఉన్నాయి. కేఎస్‌కే మహానది పవర్ కంపెనీకి చెందిన అకల్తారా ప్రాజెక్టు రుణభారం ఏకంగా రూ. 17,194 కోట్లు ఉంది. అదానీ గ్రూప్, జేపీ గ్రూప్‌కి చెందిన కొన్ని ప్రాజెక్టుల రుణ బాకీలు రూ. 11,000 కోట్ల పైగా ఉన్నాయి.
అప్పుల కుప్పలు... ఈ పవర్ ప్రాజెక్టులు
Published Fri, Mar 9 2018 5:39 AM | Last Updated on Fri, Mar 9 2018 5:39 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment