హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎయిర్‌పోర్టులు, విద్యుత్, రోడ్లు తదితర ఇన్‌ఫ్రా కార్యకలాపాలు నిర్వహిస్తున్న జీఎంఆర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ స్టాండెలోన్ ప్రాతిపదికన మార్చితో ముగిసిన క్యూ4లో రూ. 262 కోట్ల నష్టాన్ని నమోదుచేసింది. గతేడాది ఇదేకాలంలో కంపెనీ రూ. 209 కోట్ల నికరలాభాన్ని సంపాదించింది. కంపెనీ మొత్తం ఉదాయం కూడా 206 కోట్ల నుంచి రూ. 180 కోట్లకు తగ్గింది. 2014-15 పూర్తి ఏడాదిలో రూ. 353 కోట్ల నికరనష్టం వచ్చినట్లు కంపెనీ విడుదల చేసిన ప్రకటన తెలిపింది.
అంతక్రితం ఆర్థిక సంవత్సరం రూ. 166 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. పూర్తి సంవత్సరంలో కంపెనీ ఆదాయం రూ. 791 కోట్ల నుంచి రూ. 669 కోట్లకు తగ్గింది. గ్రూప్ కంపెనీలతో కలిసి జీఎంఆర్ కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ4లో రూ. 892 కోట్ల నష్టాన్ని చవిచూడగా, గతేడాది ఇదేకాలంలో రూ. 1,170 కోట్ల నికరలాభాన్ని తెచ్చుకుంది. కన్సాలిడేటెడ్ ఆదాయం రూ. 3,067 కోట్ల నుంచి రూ. 2,998 కోట్లకు తగ్గింది. 2013-14లో రూ. 10 కోట్ల స్వల్పలాభాన్ని నమోదుచేసిన జీఎంఆర్ గ్రూప్ 2014-15లో రూ. 2,733 కోట్ల భారీనష్టాన్ని చవిచూసింది.
జీఎంఆర్‌కు రూ. 262 కోట్ల నష్టం
Published Mon, Jun 1 2015 4:24 AM | Last Updated on Sun, Sep 3 2017 3:01 AM
Advertisement
Advertisement