ఢిల్లీ ఎయిర్ పోర్టులో సోలార్ ప్లాంట్ సామర్థ్యం పెంపు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఐజీఐ) సౌర విద్యుత్ ప్లాంటు సామర్థ్యాన్ని 7.84 మెగావాట్లకు పెం చినట్లు జీఎంఆర్ కన్సార్షియం సారథ్యంలోని ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు (డీఐఏఎల్) తెలిపింది. 2020 నాటికి దీన్ని 20 మె.వా.కు పెంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు సంస్థ సీఈఓ ఐ ప్రభాకరరావు పేర్కొన్నారు. ఇప్పటిదాకా ఈ ప్లాంటు 2.14 మె.వా. సామర్థ్యంతో పనిచేస్తోంది. యునెటైడ్ నేషన్స్ పర్యావరణ అనుకూల వ్యవస్థ (యూఎన్‌ఎఫ్‌సీసీసీ) కింద ప్రపంచంలోనే తొలిసారిగా నమోదైన ఎయిర్‌పోర్టు తమదేనని ప్రభాకరరావు పేర్కొన్నారు.