![GMR Power arm receives order worth Rs 5,123 crore in Uttar Pradesh - Sakshi](/styles/webp/s3/article_images/2023/09/4/DOWNLOAD.jpg.webp?itok=6s9Rs9ca)
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జీఎంఆర్ పవర్ అనుబంధ సంస్థ జీఎంఆర్ స్మార్ట్ ఎలెక్ట్రిసిటీ డి్రస్టిబ్యూషన్ (జీఎస్‌ఈడీపీఎల్)కు పూర్వాంచల్ విద్యుత్ వితరణ్ నిగమ్ నుంచి రూ. 5,123 కోట్ల విలువ చేసే ఆర్డర్లు లభించాయి. వీటి కింద ఉత్తర్‌ప్రదేశ్‌లోని పూర్వాంచల్ (వారణాసి, ఆజమ్‌గఢ్ జోన్, ప్రయాగ్‌రాజ్, మీర్జాపూర్ జోన్)లో 50.17 లక్షల స్మార్ట్ మీటర్ల ఇన్‌స్టాలేషన్, నిర్వహణ పనులు చేయాల్సి ఉంటుంది.
ఇందులో ప్రయాగ్‌రాజ్–మీర్జాపూర్ జోన్ కాంట్రాక్టు విలువ రూ. 2,387 కోట్లుగాను, వారణాసి–ఆజమ్‌గఢ్ జోన్ కాంట్రాక్టు విలువ రూ. 2,736.65 కోట్లుగాను ఉంటుందని సంస్థ తెలిపింది. త్వరలోనే దక్షిణాంచల్ (ఆగ్రా, అలీగఢ్ జోన్)లో 25.52 లక్షల స్మార్ట్ మీటర్ల ప్రాజెక్టుకు సంబంధించి దక్షిణాంచల్ విద్యుత్ వితరణ్ నిగమ్ నుంచి కూడా కాంట్రాక్టు లభించే అవకాశం ఉందని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment