ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ (ఐసీఏఓ) నుంచి జీఎంఆర్ ఏవియేషన్ అకాడమీకి రీజినల్ ట్రైనింగ్
హైదరాబాద్: ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ (ఐసీఏఓ) నుంచి జీఎంఆర్ ఏవియేషన్ అకాడమీకి రీజినల్ ట్రైనింగ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (ఆర్‌టీసీఈ) గుర్తింపు దక్కింది. భారత్‌లో జీఎంఆర్ ఏవియేషన్ అకాడమీకి మాత్రమే ఈ గుర్తింపు లభించినట్లు జీఎంఆర్ ఒక ప్రకటనలో తెలిపింది. జీఎంఆర్ ఏవియేషన్ అకాడమీ 3-6 నెలల సర్టిఫికెట్ ప్రోగ్రామ్స్‌ను, ఐసీఏఓ మెంబర్‌షిప్ ప్రోగ్రామ్స్‌ను అందిస్తోంది. వీటికి ఎయిర్‌పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ఏసీఐ), ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) వంటి తదితర అంతర్జాతీయ సంస్థల గుర్తింపు ఉంది. ఏవియేషన్ రంగంలో, దానికి సంబంధించిన ఇతర రంగాలలో ప్రొఫెషనల్స్‌ను తయారుచేయటమే తమ అకాడమీ లక్ష్యమని జీఎంఆర్ గ్రూప్ బిజినెస్ చైర్మన్ (ఎయిర్‌పోర్ట్స్) శ్రీనివాస్ బొమ్మిడాల తెలిపారు.